బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం న్యూస్ పవర్ రిపోర్టర్ సాయిరాం బెల్లంపల్లి: బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ద్వారా సాన వెంకటయ్య రిటైర్డ్ ఉపాధ్యాయుడు 2వ వర్ధంతి సందర్భంగా వారి కూతుర్లు అల్లుళ్లు , తోట వనజ రాజేశ్వర్ రావు,జాపతి జలజ వెంకటేశ్వర్లు,కారెంగుల శైలజ మోహన్, జాపతి అన్విత కుటుంబీకుల వారి ఆర్ధిక సహకారంతో శుక్రవారం మధ్యాహ్నం బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తాలో అన్నదానం నిర్వహించినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు కాంపల్లి రాజేశ్వరిశంకర్ తెలిపారు. బెల్లంపల్లి పట్టణానికి వివిధ పనుల నిమిత్తం చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చిన ప్రజలు, విద్యార్థులు, ఆటో డ్రైవర్లు, ప్రయాణికులు, యాచకులకు అన్నదానం చేయడం జరిగిందని వివరించారు. అన్నదానాన్ని స్వీకరించిన వారు ఈ సందర్భంగా వెంకటయ్య కుటుంబ సభ్యులకు , మరియు బాయిజమ్మసాయి సేవ ట్రస్ట్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఉదయాన్నే వివిధ పనుల నిమిత్తం గ్రామాల నుంచి పట్టణానికి వచ్చే మాలాంటి వారికి ఈ అన్నదానం కార్యక్రమం కడుపు నింపి ఎంతగానో ఉపయోగపడిందని సంతోషం వ్యక్తం చేశారు. దాతలు ఎవరైనా ఉంటే బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్...