గంజాయి అక్రమ రవాణాకు పాల్పడిన కఠిన చర్యలు తప్పవు • సిరిసిల్ల రూరల్ సీఐ మొగిలి న్యూస్ పవర్ , 23 నవంబర్ , ఇల్లంతకుంట: గంజాయి అక్రమ రవాణాకు పాల్పడిన కఠిన చర్యలు తీసుకుంటామని సిరిసిల్ల రూరల్ సీఐ మొగిలి తెలిపారు ఇల్లంతకుంట లో అక్రమంగా గంజాయి తాగుతూ అమ్మడానికి వచ్చిన వ్యక్తి అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించినట్లు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బెజ్జంకి మండలం గుండారం గ్రామానికి చెందిన మహమ్మద్ ఆల్ఫహాద్ అనే వ్యక్తి చికెన్ సెంటర్ లో పని చేసుకుంటూ వచ్చిన డబ్బులతో గంజాయి కొనుకోని గంజాయి తాగుతూ జల్సాలు చేసేవాడు అట్టి డబ్బులు సరిపడక గంజాయి త్రాగేవారికి అమ్మి ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు అనే ఆలోచనతో గుర్తు తెలియని వ్యక్తుల వద్ద గంజాయి కొనుగోలు చేసి గంజాయి కి అలవాటు పడిన వారికి అమ్మడానికి రాగ నమ్మదగిన సమాచారం మేరకు ఇల్లంతకుంట ఏస్ఐ శ్రీకాంత్ ముష్కనిపేట గ్రామ శివారులో అదుపులోకి తీసుకుని అతని వద్ద 110గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకొని రిమాండ్ కి తరలించడం జరిగిందన్నారు. గంజాయి తాగే వారిని పట్టుకునేందుకు జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్లకి గంజాయి టె...