Skip to main content

Posts

Showing posts with the label Agriculture News

ఇల్లంతకుంటలో 21 వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం: మద్దతు ధర రూ. 2389/-

  ఇల్లంతకుంటలో 21 వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం ఇల్లంతకుంట: ఇల్లంతకుంట మండలంలో ఐకేపీ (IKP) ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న 21 వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం అధికారులు, ప్రజాప్రతినిధులు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు తమ ధాన్యాన్ని దళారులకు అమ్మి నష్టపోకుండా, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి క్వింటాకు రూ. 2389/- మద్దతు ధరను పొందాలని పిలుపునిచ్చారు. రైతుల సౌకర్యార్థం ప్రతి కేంద్రంలో నీడ, మంచినీరు మరియు కనీస వసతులు కచ్చితంగా కల్పించాలని నిర్వాహకులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏ.ఎం.సి చైర్ పర్సన్ చైతన్య మహేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ ప్రసాద్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి, ఎం.ఆర్.ఓ సురేష్, ఏ.పీ.యం కుమారస్వామి, మండల సమాఖ్య అధ్యక్షురాలు సౌమ్య పాల్గొన్నారు. వీరితో పాటు ఆయా గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, ఏ.ఎం.సి డైరెక్టర్లు, జీ.పీ.ఓ లు, ఏ.ఈ.ఓ లు, సీసీలు, వీ.ఓ.బీ లు, వీ.ఓ.ఏ లు, కమిటీ సభ్యులు, హమాలీలు, రైతులు మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ప్రకృతి వ్యవసాయంతోనే ఆరోగ్యవంతమైన సమాజం: జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం

  ప్రకృతి వ్యవసాయంతోనే ఆరోగ్యవంతమైన సమాజం: జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం ఇల్లంతకుంట (మార్చి 17, 2026): రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి, ప్రకృతి సిద్ధమైన పద్ధతుల్లో వ్యవసాయం చేయడం ద్వారానే భూసారాన్ని కాపాడుకోగలమని జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం పేర్కొన్నారు. మంగళవారం రోజున ఇల్లంతకుంట మండల కేంద్రంలోని రైతు వేదికలో ముస్కానిపేట, వల్లంపట్ల, రామాజీపేట, మరియు అనంతారం గ్రామాల రైతులతో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సు నిర్వహించారు. నేల సారం నిర్ధారిత కార్డుల పంపిణీ ఈ కార్యక్రమంలో భాగంగా రైతులకు భూసార పరీక్షల ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం రైతులకు నేల సారం నిర్ధారిత కార్డులను (Soil Health Cards) మరియు సేంద్రీయ వ్యవసాయ సంబంధిత కిట్‌లను పంపిణీ చేశారు. ప్రతి రైతు తన పొలంలోని నేల స్వభావాన్ని తెలుసుకొని, దానికి అనుగుణంగా ఎరువులు వాడాలని అఫ్జల్ బేగం సూచించారు. పాల్గొన్న ప్రజా ప్రతినిధులు మరియు అధికారులు ఈ సదస్సులో ముస్కానిపేట సర్పంచ్ భాస్కర్ రెడ్డి, ఇల్లంతకుంట సర్పంచ్ మామిడి రాజు, అనంతారం సర్పంచ్ వొల్లల రజిత వెంకటేష్ పాల్గొన్నారు.   మండల వ్యవసాయ అధికారి (MAO) సందీప్, వ్యవసాయ విస...