Skip to main content

Posts

Showing posts with the label సిరిసిల్ల జిల్లా

విజయ గర్జన సభ విజయవంతం చేద్దాం

విజయ గర్జన సభ విజయవంతం చేద్దాం NEWSPOWER REPORTER:Dilip విజయ గర్జన సభను విజయవంతం చేద్దామని మండల అధ్యక్షుడు సురేందర్ రావు అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రతి కార్యకర్త పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలన్నారు. కార్యకర్తలందరూ సైనికుల్లా పనిచేయాలనీ, సంక్షేమ పథకాలను అర్హులకు అందేలా చూడాలన్నారు. ఇక్కడ ఎంపీపీ శరత్ రావు, సర్పంచులు, ఎంపీటీసీలు, టిఆర్ఎస్ నాయకులు, మండల యూత్ సభ్యులు పాల్గొన్నారు.

చలో హైదరాబాద్మాదిగ ఉద్యోగుల 5వ జాతీయ మహాసభల గురించి

NEWSPOWER REPORTER:vijay చలో హైదరాబాద్ మాదిగ ఉద్యోగుల 5వ జాతీయ మహాసభల గురించి ఈరోజు సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ బావనంలో సమవేశం ఏర్పటు చేయడం జరిగింది సామావేశంలో బాగంగా మహాజన సోషలిస్టు పార్టీ జిల్లా  నాయకులు అవునూరి  ప్రభాకర్, ఖానాపురం లక్ష్మణ్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ముందు  ఈనెల24 తేదీన జరుగు  మాదిగ ఉద్యోగుల 5వ జాతీయ మహాసభ ను  విజయవంతం చేయడం కోసం కరపత్రం విడుదల చేయడం జరిగింది ఇ సందర్బంగా 1994లో గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి  నాయకత్వంలో ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరణ సాధనే ప్రధానాంశంగా ఎమ్మార్పీఎస్ ఉద్యమం ఏర్పడింది Mrps ఉద్యమం ద్వారా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను సాధించి 2002 నుండి 2004 వరకు అమలు పరచడం జరిగింది వర్గీకరణ కోసమే కాకుండా   మందకృష్ణ మాదిగ గారు  సమాజంలోని అన్ని వర్గాల పేద ప్రజలకు ప్రయోజనాలు పొందే లాగా అనేక ఉద్యమాలు చేసి ఆరోగ్యశ్రీ. వికలాంగులు. వృద్ధులు వితంతువులకు పింఛను నిరుపేదలకు రేషన్ కోట పెంపు వంటి ప్రభుత్వ పథకాలు సాధించడం జరిగింది అలాగే ఎస్సీ ఎస్టీలు ప్రయోజనం పొందే లాగా ఎస్సీలకు ప్రమ...

తెలంగాణ భవన్. లో కేటీఆర్ ను కలిసిన నాయకులు

తెలంగాణ భవన్ లో కేటీఆర్ ను కలిసిన నాయకులు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం లోని తెరాస నాయకులు ఈరోజు హైదరాబాద్ లోని  తెలంగాణ భవన్ లో గౌరవ  కేటిఆర్ గారి సమక్షంలో ఏర్పాటు చేసిన సమావేశంలో. రసమయి  బాలకిషన్  ఆధ్వర్యంలో  పాల్గొని .కేటీఆర్ గారికి పుష్పగుఛ్చం అందజేసిన. ఎంపిపి.వుట్కూరి వెంకట రమణా రెడ్డి ,   వైస్ ఎంపిపి. సుధగోని శ్రీనాథ్ గౌడ్.మరియు మండల. నాయకులు పాలుగోన్నారు.

ఎల్లారెడ్డిపేట మండలంలో ఇద్దరికీ డెంగ్యూ లక్షణాలు

ఎల్లారెడ్డిపేట మండలంలో ఇద్దరికీ డెంగ్యూ లక్షణాలు NEWSPOWER REPORTER:Babu  ఎల్లారెడ్డి పేట మండలంలోని  అక్కపల్లి గ్రామంలో ఇద్దరికీ డెంగీ లక్షణాలు ఉన్నట్లు వైద్య సిబ్బంది గురువారం గుర్తించారు వెంటనే మండల అభివృద్ధి అధికారి చిరంజీవి ,మండల వైద్యాధికారి డాక్టర్ ధర్మ నాయక్ మరియు  వైద్య సిబ్బంది  అక్కపల్లి గ్రామాన్ని గురువారం  సందర్శించి వారి ఆరోగ్య పరిస్థతి తెలుసుకున్నారు.. జిల్లా ఎం వి బి సి పి ఆధ్వర్యంలో  దాదాపు 100 ఇళ్లక్కు పైరేత్రం (ఇండోర్)స్ప్రే చేశారు .అంతేకాకుండా డెంగీ దోమ పుట్టకుండా ఉండాలంటే ప్రతి రోజు డ్రైడే పటిష్టంగా చేపట్టాలని స్థానిక ఏఎన్ఎం కి, పంచాయతీ కార్యదర్శి మరియు ఆశ, అంగన్వాడీ కార్యకర్తల ను ఆదేశించారు. డెంగీ దోమ ఎలా తయారువుతుందో  గ్రామ మహిళలకు మరియు  యువతి యువకులకు అవగాహన కల్పించడం జరిగింది.ఇంటింటా ఫీవర్ సర్వే కూడా నిర్వహించి వారికి కావాల్సిన మందులూ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎం పి ఓ వాజీర్, హెచ్ డి ఈ ఓ  లింగము, పి హెచ్ ఎన్  ప్రమీల మరియు గ్రామ సిబ్బది పాల్గొన్నారు.

ఇసుక వాహనం పట్టివేత

ఇసుక వాహనం పట్టివేత NEWSPOWER REPORTER:Babu అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని వచ్చిన సమాచారం మేరకు ఎల్లారెడ్డిపేట గ్రామ శివారులో  ఎస్సై వెంకట కృష్ణ వాహనాల తనిఖీ నిర్వహించగా ఎలాంటి అనుమతి పత్రాలు  లేకుండా ఇసుక తరలిస్తున్న పిక్ అప్  వాహనాన్ని అదుపులోకి తీసుకొని బాధ్యులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.

50 రు,,లకే నాణ్యమైన భోజనం

50 రు,,లకే నాణ్యమైన భోజనం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని అశ్విని హాస్పిటల్ లో పేషెంట్లకు, సహాయకులకు  50  రూపాయలకే నాణ్యమైన భోజనము అందించనున్నట్లు  హైదరాబాది ప్రైడ్  ధమ్ భిర్యాణీ   ప్యామీలీ రెస్టారెంట్   నిర్వాహకులు మహమ్మద్ ఖైస్ తెలిపారు.  మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు అశ్విని హాస్పిటల్ లోనే అందిస్తామని ఖైస్ అన్నారు.ఇట్టి   అవకాశం కల్పించిన అశ్విని హాస్పిటల్ వైద్యులు జి.సత్యనారాయణ స్వామి కి మహమ్మద్ ఖైస్ ధన్యవాదాలు తెలిపారు.

వాల్మీకి జయంతి సందర్భంగా

వాల్మీకి జయంతి సందర్భంగా NEWSPOWER REPORTER:Saireddy  రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రంలోని కలెక్టర్  కార్యాలయంలో.కలెక్టర్ అనురాగ్ జయంతి.గారితో కలసి జ్యోతి ప్రజ్వలన చేసి వాల్మీకి చిత్రపటానికి పుల మాల వేసి  వాల్మీకి బోయ సోదర సోదరీమణులకు వాల్మీకి మహర్షి జయంతి శుభాకాంక్షలు తెలిపి అనంతరం వాల్మీకి బోయకులస్థుల పలు సమస్యలు కలెక్టర్ గారి దృష్టికి తీసుకవెళ్లిన వాల్మీకి బోయ రాజన్న సిరిసిల్లా జిల్లా అధ్యక్షులు  మీసరగండ్ల అనిల్ కుమార్ మాట్లాడుతూ  రామకథను గానం చేసి వాల్మీకి మహర్షి లోకాన్ని ఉద్ధరించాడు. ఇరవై నాలుగువేల శ్లోకాలతో ఆయన రామాయణాన్ని రూపొందించాడని అన్నారు..మానవతా విలువలను, ఉన్నతమైన ఆదర్శ భావాలను బోధించే మధుర కావ్యం రామాయణం అని అన్నారు. అటువంటి గొప్ప కావ్యాన్ని రచించి యుగాలు మారినా కూడా ఆదర్శంగా నిలిచే విధంగా వాల్మీకి మహర్షి గారు సమాజానికి అందించడం గొప్ప విషయమన్నారు.

నూతన గ్రామపంచాయతీ భవనానికి స్థల పరిశీలన

నూతన గ్రామపంచాయతీ భవనానికి స్థల పరిశీలన NEWSPOWER REPORTER:Babu ఎల్లారెడ్డిపేట మండలం లోని అగ్రహారం గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనం కోసం స్థలాన్ని పరిశీలించిన టిఆర్ఎస్ జిల్లా ఇంచార్జ్ తోట ఆగయ్య. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ పాలక వర్గం, గ్రామస్తులంతా కలిసి గ్రామ పంచాయతీ భవనం కోసం ఆమోదయోగ్యమైన, అనువైన స్థలంలో నిర్మాణం మొదలు పెట్టాలని సూచించారు. ఇక్కడ ఎంపిపి పిల్లా రేణుక, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కృష్ణ హరి, ఎంపిటిసి తిరుపతి, అందె సుభాష్, ఉప సర్పంచ్ బాలు, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎడ్ల లక్ష్మణ్, గ్రామ శాఖ అధ్యక్షుడు ఉప్పలయ్య, తదితరులు పాల్గొన్నారు.

పిల్లలకు పోషకాహారం అందించాలి

పిల్లలకు పోషకాహారం అందించాలి NEWSPOWER REPORTER:Babu ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి ప్రాథమిక పాఠశాలలో చదువుతూ కుంటున్న పిల్లలకు పోషకాహారం అందించాలని మార్కెట్ కమిటీ చైర్మన్ కొండ రమేష్ గౌడ్ అన్నారు. బుధవారం రోజున పాఠశాలను పరిశీలించి మాట్లాడారు. అదేవిధంగా చేపూరి రాజేశం పిల్లలకు ఐదు లీటర్ల శానిటైజరిని వితరణ చేశారు.