Skip to main content

Posts

Showing posts with the label Ellanthakunta mandal

అంగన్వాడిలో పిల్లలకు దుస్తుల పంపిణీ

అంగన్వాడిలో పిల్లలకు దుస్తుల పంపిణీ  న్యూస్ పవర్ ,2 జనవరి, ఇల్లంతకుంట: ఇల్లంతకుంట మండలంలోని అనంతారం గ్రామంలో శుక్రవారం అంగన్వాడి కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వొల్లాల రజిత వెంకటేశం పాల్గొని చిన్నారులకు దుస్తులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్నారుల విద్య, ఆరోగ్యం పట్ల తల్లిదండ్రులతో పాటు సమాజం మొత్తం బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని తెలిపారు.అంగన్వాడి కేంద్రాల ద్వారా పిల్లలకు అవసరమైన మౌలిక సదుపాయాలు సమర్థంగా అందేలా గ్రామపంచాయతీ ఎల్లప్పుడూ సహకరిస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి విజయలక్ష్మి, అంగన్వాడి టీచర్ బండారి మంగ,3వ వార్డు సభ్యురాలు గోనపల్లి లావణ్య వెంకటేశం,5వ వార్డు సభ్యుడు బట్టి క్రాంతి,పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

ఎన్యుమరెటర్లకు శిక్షణ కార్యక్రమము

ఎన్యుమరెటర్లకు  శిక్షణ కార్యక్రమము      న్యూస్ పవర్ , 30 అక్టోబర్ , ఇల్లంతకుంట : ఇల్లంతకుంట మండల కేంద్రంలో జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో ఎన్యుమారెటర్లకు ఇంటింటి సమగ్ర కుంటుంబ సర్వే శిక్షణ కార్యక్రమం బుధవారం రోజున నిర్వహించారు.మండల నోడల్ అధికారి రామకృష్ణ జిల్లా కో ఆపరేటివ్ అధికారి సందర్శించి  ఎన్యుమారెటర్లు ప్రతి ఇంటినీ సందర్శించి వివరాలు జాగ్రత్తగా నమోదు చేయాలని పేర్కొన్నారు. ఈకార్యక్రంలో  తహశీల్దార్ ఫరూఖ్ ఎం పి డి ఓ శశికళ ఎం ఈ ఓ శ్రీనివాస్ గౌడ్ మాస్టర్ ట్రైనర్స్ సందీప్ రెడ్డి జగన్మోహన్ సదానందం రాజు.అనిల్కుమార్.మరియు సూపర్వైజర్ లు ఎన్యుమారెటరులు పాల్గొన్నారు.