Skip to main content

Posts

Showing posts with the label రాజన్న సిరిసిల్ల

ప్రభుత్వం నుండి ఎల్ఓసి రాలేదు..

 న్యూస్ పవర్: 5 ఆగస్టు, ఇల్లంతకుంట : అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ నేత భట్టి విక్రమార్క రాష్ట్రంలో గ్రామపంచాయతీలకు రాక బిల్లులు రాక సర్పంచులు ఆత్మహత్య చేసుకుంటూన్నరని సోమారంపేట గ్రామ సర్పంచ్ వడ్డే ఆనంద రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారని తెలుపగా స్థానిక ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ స్పందించి సర్పంచ్ ఆనందరెడ్డి అనారోగ్యం కారణంగా మరణించాడని అతని అనారోగ్యం పరిస్థితిని చూసి ప్రభుత్వము నుండి 5 లక్షల రూపాయల ఎల్ఓసి అందించామని తెలిపారు ఈ విషయానికి ఆనంద రెడ్డి కుమారుడు జస్వంత్ రెడ్డి ఖండించారు.మా తండ్రికి ప్రభుత్వం నుండి ఎల్ఓసి వచ్చిందనేది అవాస్తవమని ఎమ్మెల్యే దీనికి సంబంధించి ఏదైనా ఆధారాలు ఉంటే చూపెట్టాలని తెలిపారు.

భారతీయ జనతాపార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో లో విజయోత్సవ సంబరాలు

భారతీయ జనతాపార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో లో విజయోత్సవ సంబరాలు న్యూస్ పవర్. రిపోర్టర్ :పసుల తిరుపతి ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నాలుగు రాష్ట్రాల్లో ఘన విజయం సాధించిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో టపాకాయలు పేల్చి స్వీట్లు పంచుకుని ఘనంగా విజయోత్సవ సంబరాలు జరిపారు భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు చేసిన అభివృద్ధిని చూసి  ఉత్తర ప్రదేశ్ ఉత్తరాఖండ్ మణిపూర్ గోవా రాష్ట్రాల్లో ఘన విజయం సాధించింది రాబోయే కాలంలో లో తెలంగాణలో కూడా కాషాయ జెండా ఎగరడం ఖాయమని భారతీయ జనతా పార్టీ నాయకులు తెలిపారు ఈ కార్యక్రమంలో లో భారతీయ జనతా పార్టీ మండల ప్రధాన కార్యదర్శి చందుపట్ల లక్ష్మారెడ్డి పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ఎస్టి మోర్చా మండల అధ్యక్షుడు రవి సీనియర్ నాయకులు సంజీవరెడ్డి ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు బొమ్మ డి స్వామి మంగళ రాజు సత్యం రెడ్డి రవీందర్ కిరణ్ కృష్ణ దూస శీను పరశురామ్ రెడ్డి రాజిరెడ్డి భాస్కర్ విజయ్ గాంధీ తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు

చత్రపతి శివాజీ విగ్రహం ప్రతిష్ఠాపనకు భూమి పూజ మరియు ఊరేగింపు

చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి  సందర్భంగా వెంకటాపూర్ గ్రామంలో చత్రపతి శివాజీ విగ్రహం ప్రతిష్ఠాపనకు భూమి పూజ మరియు ఊరేగింపు న్యూస్ పవర్ రిపోర్టర్. పసుల తిరుపతి ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపురం గ్రామం ఈరోజు వెంకటాపూర్ గ్రామంలో హిందూ హృదయ సామ్రాట్ మరాఠా యోధుడు చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన కు భూమి పూజ చేయడం జరిగింది నాయకులు మాట్లాడుతూ సాహసం దయ సుపరిపాలనలు మూర్తిభావించిన టువంటి అసాధారణ నేత చత్రపతి శివాజీ మహారాజ్ గారు వీరత్వానికి ధైర్యానికి నిదర్శనం హిందూ ధర్మ రక్షణ కొరకు పోరాడిన వ్యక్తి చత్రపతి శివాజీ గారు చత్రపతి శివాజీ మహారాజ్ యొక్క ఆశయాలను కు అనుగుణంగా నడుచుకోవాలి అని కోరారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పొన్నాల తిరుపతిరెడ్డి కోలా నరసయ్య ఉప సర్పంచ్ మేడిశెట్టి బాలయ్య వార్డు సభ్యులు గుర్రాల రాజిరెడ్డి గడ్డం రవి మరాటి రాజు శ్రీకాంత్ మరియు శివాజీ యూత్ సభ్యులు బజరంగ్ దళ్ యూత్ సభ్యులు యువకులు గ్రామస్తులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు

నిరుపేద కుటుంబానికి నిత్యవసర వస్తువుల పంపిణీ. రాజన్న సిరిసిల్ల

నిరుపేద కుటుంబానికి నిత్యవసర వస్తువుల పంపిణీ.                న్యూస్ రిపోర్టర్ వంగూరి దిలీప్ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామముకు చెందిన చీటీనేని అగమ్మ- నర్సింగరావు ట్రెస్ట్ నిర్వాకులు చీటీనేని మాధవి వెంకటేశ్వరరావు దంపతులు మద్దికుంట గ్రామానికి చెందిన శ్యాగల రాజయ్య గారు మరణించినరు వారి కూతురు  ఒక్కరే మిగిలనారు ఈ విషయన్ని మద్దికుంట గ్రామస్తులు వెంకటేశ్వరరావు గారికి తెలిపినరు వెంటనే వారి కుటుంబానికి సంక్రాంతి పండుగ రోజు ఒక నెల రోజులకు సరిపడే కిరణం సామనులను పంపిచడం జరిగింది         ఆ అమ్మాయి ట్రస్ట్ నిర్వహకులు విద్యాసాగర్ రావు గారికి మాధవి వెంకటేశ్వర్ రావు గారికి కృతజ్ఞతలు తెలిపారు

గుండెపోటు తో ఒకరి మృతి

  రిపోర్టర్ వంగూరి దిలీప్    ఈరోజు పోతుగల్ గ్రామంలో కోనింటి  రాములు అలియాస్ నల్లల రాములు గుండే పోటుతో మరణించడం జరిగింది.అతనికి భార్య బాలవ్వ(45), ముగ్గురు కుమార్తెలు శ్రావణి(22),శిరీష(20),మమత(15) మరియు ఒక కుమారుడు కార్తికేయ(12) ఉన్నారు వీరిలో శ్రావణి,శిరీష వివాహం చేయగా చేసిన అప్పులు తీర్చడం కోసం దిగులు చెందుతూ బ్రతుకుదేరువు కోసం గల్ఫ్ బాట పట్టిన వలస కార్మికుడు ఆర్థిక ఇబ్బందులతో గల్ఫ్ వెళ్లి అక్కడ పని లేకపోవడంతో గత నెల స్వగ్రామం తిరిగి వచ్చాడు. ఆర్థిక సమస్యలతో సతమతమవుతు ఈరోజు ఉదయం 3:00 లకు గుండే పోటుతో మరణించడం జరిగింది. ఇలాంటి కార్మిక కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి ఆర్థిక సహాయం అందించాలని సర్పంచ్ గౌతంరావు, కాంగ్రెస్ పార్టీజిల్లాఉపాధ్యక్షుడు పెద్దిగారి శ్రీనివాస్, రాష్ట్ర రజకసంఘం అధ్యక్షుడు అక్కరాజు శ్రీనివాస్, ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు తోట ధర్మేందర్, కొండ భానుచందర్, లు మాట్లాడుతు  మృతుని కుటుంబానికి ప్రభుత్వం సాయం చేసి ఆదుకోవాలని కోరారు

నామాపూర్ లో CMRF చెక్కుల పంపిణీ

నామాపూర్ లో CMRF చెక్కుల పంపిణీ  రిపోర్టర్ వంగూరి దిలీప్                                                               ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామపూర్ గ్రామంలో మండల అధ్యక్షుడు భోంపెల్లి సురేందర్ రావు గారి ఆధ్వర్యంలో. CMRF చెక్కుల పంపిణీ నామపూర్ సర్పంచ్ వెల్మల విజయ రామిరెడ్డి  మరియు గుండం నర్సయ్య గారి చేతుల మీదుగా 8 మంది లబ్దిదారులకు పంపిణీ CMRF చెక్కులు పంపిణీ చేయడం జరిగింది                                                లబ్దిదారులు                                          1.  మెరుగు విజయ లక్ష్మి - 23000రూపాయలు 2.నిమ్మల కవిత 15000 వేల రూపాయల చెక్కు.3.యారపు భూ...

మహిళా డిగ్రీ కళాశాలో దరకాస్తులు ఆహ్వానం

మహిళా డిగ్రీ కళాశాలో దరకస్తులు ఆహ్వానం K.Vijaykumar న్యూస్ రిపోర్టర్ న్యూస్ పవార్:31డిసెంబర్, గిరిజన సంక్షేమ మహిళ గురుకుల డిగ్రీ కళాశాల తంగళ్లపల్లి లో అద్యపాకులుగా  అసక్తీ గల మహిళ అబ్యార్దులు దరకస్తు చేసుకోవలసిందిగా.ప్రాన్తీయ సమన్వయ అధికారి డి.ఎస్. వెంకన్న గురువరం ప్రకటనలో తేలిపారు. సబ్జెక్టులు తెలుగు-2, ఇంగ్లీష్-1, హిస్టారి-1, జంతుశాస్రం-1, కంప్యూటర్ సైన్స్-1, ఫ్యాషన్ డిజైన్-1, ఫోటోగ్రఫీ-1 విబగాలుగా అధ్యాపకులుగా అర్హతకలిగినవారు దరకస్తు చేసుకోవలసిందిగా.కోరుతున్నారు.పూర్తి వివరాలు:7780555424 నంబార్ ను సంప్రదించాలి అన్నారు అసక్తీ గలవారు 05/01/2022 లోగ దరకస్తు చేసుకోవలసిందిగా కోరినారు,

పొగ మంచులో ప్రయాణం

పొగ మంచులో ప్రయాణం K.విజయ్ రిపోర్టర్ న్యూస్ పవార్:27 డిసెంబర్, రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం కేంద్రంలో ఈరోజు ఉదయం పొగమంచు కానివిందు చేసింది.ఓ వైపు పొగమంచు ఓ పైపు 16° పడిపోయిన చలి ఇకరణంగా రోడ్డు పైనా వాకింగ్ వెల్లే వారికి మరియు వాహన దారులు చాల నెమ్మదిగ  ఇబ్బందీ కరంగా వెల్లడం జరిగింది.

అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆశీర్వాదం తీసుకున్న నూతన వధూవరులు

అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆశీర్వాదం తీసుకున్న నూతన వధూవరులు K.విజయ్ న్యూస్ రిపోర్టర్ న్యూస్ పవార్:27డిసెంబర్  రాజన్నసిరిసిల్ల జిల్లా యేల్లారెడ్డిపేట మండలం రాచర్లగొల్లపల్లి లో నిన్నా వివాహం చేసుకున్న నూతన వధూవరులు రమేష్ సాహితి  రాత్రి అప్పగింతల  సమయంలో ఇద్దరు ముందుగ  అంబేద్కర్ విగ్రహం వద్దకి వెల్లి  పూల మాలలు వేసి ఆశీర్వాదం తీసుకున్నారు,

రోడ్డు మీద గుంతలు పట్టించుకునే వారే కరువయ్యారు

రోడ్డు మీద గుంతలు పట్టించుకునే వారే కరువయ్యారు K.విజయకుమార్: న్యూస్ పవర్ రిపోర్టర్ న్యూస్ పవర్:రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని బస్టాండ్ వద్ద గల రామాలయం ముందు మేన్ రోడ్డుమీద గుంతలు పడి నేలలు గడుస్తున్న వాటినీ ఎవరు పట్టించుకోవడం లేదు ఏదైనా వాహనం అధుపుతప్పి ఆ గుంతలో నుండి వెళితే చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంది.ఇగుంత  రామాలయం ముందు ఉండటం వల్ల పండగ పర్వ దినాల్లో అటుగా చాలజనాలు వస్తు ఉంటారూ. ఈ విషయాన్ని స్టానిక సర్పంచ్ మరియు  అధికారులు గమనించి గుంతలు పుడ్చాలని ప్రజలు కోరుతున్నారు,

తుర్కపల్లి గ్రామం లో పోచమ్మ బోనాల పండుగ.

తుర్కపల్లి గ్రామం లో పోచమ్మ బోనాల పండుగ.   న్యూస్ రిపోర్టర్ వంగూరి దిలీప్   రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం తుర్కపల్లి గ్రామం లో గ్రామ ప్రజలందరూ కలిసి ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి గ్రామ దేవతలు పోచమ్మకు  మైసమ్మ కు బోనాల పండుగ నిర్వహిస్తామని గ్రామ సర్పంచ్ కాశో ల్ల  పద్మ  దుర్గ ప్రసాద్ అన్నారు  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలోని ప్రజలందరూ సుఖశాంతులతో ఆరోగ్యవంతులుగా ఉండాలని కోరుతూ  ప్రత్యేక పూజలు నిర్వహించి బోనాలను గ్రామ పురవీధుల గుండా డప్పు చప్పుడు తో మహిళలు బోనాలు సమర్పించి  కరోనా ప్రభావితం కాకుండా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని   ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న మని ఆమె తెలిపారు  ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పాలకవర్గం అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు మహిళలు కళాకారులు  గ్రామ ప్రజలు అందరూ పాల్గొన్నారు

మోహినికుంట గ్రామంలో క్రిస్మస్ సంబరాలు

మోహినికుంట గ్రామంలో క్రిస్మస్ సంబరాలు                                   ముస్తాబాద్ మండల న్యూస్ రిపోర్టార్ వంగూరి దిలీప్         రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మోహిణికుంట గ్రామంలో KGR  కాలనీ క్రిస్మస్ సంబరాలు కేక్ కట్ చేసి చాలా ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో భాగంగా  రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు , మండల ఉపాధ్యక్షులు కల్వకుంట్ల శ్రీనివాస్ రావు , గ్రామ శాఖ అధ్యక్షులు నారాయనోజ్ సతీష్  మండల యూత్ అధ్యక్షులు శీలం స్వామి , సనియర్ నాయకులు మెంగాని మనోహర్  గ్రామ పెద్దలు గోవర్ధన్ రావు , సుభాష్ రావు , ఫాస్టర్ కుమార్ , కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

CMRF చెక్కు పంపిణీ

న్యూస్  రిపోర్టార్ వంగూరి దిలీప్       రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మొర్రయిపల్లె గ్రామంలో సర్పంచ్ సడిమేలా సుజాత ఎల్లం గారు మరియు గ్రామ శాఖ అధ్యక్షులు బద్దిపడిగే లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో CMRF చెక్కు. మెంగని యశ్వంత్ గారికి 20.000 వేల రూపాయలు చెక్కు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమం లో భాగంగా ఉప సర్పంచ్ మెంగని శ్రీనివాస్ గారు తెరాస సనియర్ నాయకులు అల్లం లక్ష్మణ్ గారు పప్పుల బద్రయ్య బద్దీ పడిగే రాములు లక్కరి నారాయణరెడ్డి కుడుకల దేవయ్య మల్లారాపు రాజు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

అనారోగ్యంతో ఉరి వేసుకుని రైతు మృతి

అనారోగ్యంతో  ఉరి వేసుకుని రైతు మృతి న్యూస్ పవర్. ఎల్లారెడ్డిపేట...  రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన గోగూరి మోహన్ రెడ్డి  ( 58 ) అనే రైతు అనారోగ్యంతో బాధపడుతూ జీవితంపై విరక్తి చెంది బుధవారం సాయంత్రం ఆరున్నర గంటల ప్రాంతంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని మరణించినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కుటుంబ సభ్యులు పేర్కొన్నారు              అతనికి భార్య చంద్రకళ కూతురు స్వప్న , సరిత లున్నారు             శవాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ వెంకటకృష్ణ తెలిపారు

ముస్తాబాద్ మండల కేంద్రంలోని కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

న్యూస్ పవర్ రిపోర్టర్ వంగూరి దిలీప్  ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని ధాన్యం కొనుగోలుపై చేతులెత్తేసిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోడీ సర్కార్ రైతు వ్యతిరేక వైఖరిపై నిరసనగా TRS పార్టీ అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గారి పిలుపు మేరకు  ముస్తాబాద్ మండల కేంద్రంలోని  కేంద్ర ప్రభుత్వ  దిష్టిబొమ్మను ముస్తాబాద్ .మండల కేంద్రంలోని మండల నాయకులు TRS పార్టీ కార్యకర్తలు రైతాంగం మరియు టిఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు అన్ని  గ్రామ కార్యకర్తలు ప్రజలు తదితరులు  దిష్టిబొమ్మను దహనం చేశారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు. మండల నాయకులుప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు 

భక్తిలతో కిటకిట లాడుతున్న రాజరాజేశ్వర దేవాలయం

భక్తిలతో కిటకిట లాడుతున్న రాజరాజేశ్వర దేవాలయం New Reporter :K.Vijaykumar దక్షిణ కాశీగా పెరుగంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు మార్గశిర మాసంలో సోమవారం కావటంతో భక్తులు దైవ దర్శనంతో పాటు కోడెమొక్కులు సమర్పించుకుంటు వేల  సంఖ్యలో దూర ప్రాంతాల నుండి అనేక మంది భక్తులు వచ్చారూ.ఈసందర్బంగా దేవాలయం అనేక మంది భక్తులతో కిటకిట లాడింది

కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ధర్నా

 కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ధర్నా న్యూస్ పవర్ రిపోర్టర్ వంగూరి దిలీప్  రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడూరు గ్రామంలో ఈరోజు రైతుల కోసం కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక వైఖరికి నిరసనగా   లో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చెయ్యడం జరిగింది ఈ కార్యక్రమం లో TRS పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు తాటాకర్ల ప్రభాకర్  మరియు సీనియర్ నాయకులు ఎదునూరి శ్రీనివాస్ గారు మరియు TRS పార్టీ గ్రామ శాఖ యూత్ అధ్యక్షులు వంగూరి దిలీప్ నాయకులు బాలరాజు  మహేష్ మనీష్ వెంకటేష్ గ్రామ ప్రజలు రైతులు పాల్గొన్నారు

వడ్లను కొనుగోలు చేయలని దిష్టిబొమ్మ దహనం

వడ్లను కొనుగోలు చేయలని  దిష్టిబొమ్మ దహనం Newspower Reporter :K.Vijaykumar కేంద్ర ప్రభుత్వం వడ్లను కొనాలని డిమాండ్ చేస్తూ గ్రామగ్రామాన నిరసన కార్యక్రమాలు చేపట్టిన టిఆర్ఎస్ పార్టీ లీడర్లు, నల్ల బ్యాడ్జిలను ధరించి..నల్ల జెండాలను ఎగురవేసి నిరసన రైతుల పట్ల బిజెపి వైఖరి మార్చుకోవాలంటూ డిమాండ్ రైతులు పండించిన ప్రతి పంటకు కొనాలని డిమాండ్ చేస్తు కేంద్రప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేసారు.ఇ సందర్బాంలో MPP పడిగెల రాజు మానస.నలుగొండ శ్రీనివాస్.హమ్మిద్.లక్ష్మణరెడ్డి  మరియు టిఆర్ఎస్ లిడర్లు పాల్గొన్నారు,

సిరిసిల్ల సాయిశ్రీ కాలేజీ లో షి టీమ్ బృందo

News Reporter:K.విజయకుమార్ రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని జిల్లా పోలీస్ షీ టీమ్ బృందం మరియు యాంటీ హ్యూమన్  ట్రాఫికింగ్ యూనిట్ (AHTU)బృందం ఈ రోజు సాయి శ్రీ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు షీ టీమ్ యొక్క ఉపయోగాలు,ఎవరైనా మహిళలు వేధింపులకు గురై నప్పుడు షీ టీమ్ ను ఏవిదంగా సంప్రదించాలి మరియు బాలలపై అఘాయిత్యాలు, మహిళలు మరియు పిల్లలపై జరుగుతున్న నేరాలు మానవ అక్రమ రవాణా గురించి అవగాహన కల్పించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా షీ టీమ్ నెంబర్ :7901132113 తెలియజేసారు,

ముకుంద పిల్లల హాస్పిటల్ ని ప్రారంభించిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్ డాక్టర్ ఎర్రవెల్లి చెంద్రశేఖర్ రావు గారు

ముస్తాబాద్ మండల న్యూస్ రిపోర్టర్ వంగూరి దిలీప్  రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ముకుంద పిల్లల హాస్పిటల్ ని ప్రారంభించిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్ డాక్టర్ ఎర్రవెల్లి చెంద్రశేఖర్ రావు గారు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జిల్లా మాజీ అధ్యక్షులు చింతోజు శంకర్ గారు, ప్రముఖ సీనియర్ వైద్యులు చింతోజు రాజారాం గారు, స్త్రీ వైద్య నిపుణులు అనూష గారు మరియు వైద్యులు రాజేందర్ గారు,ప్రముఖ RMP వైద్యులు ముక్తర్ గారు. సంతోష్ గారు భారత్ గారు ప్రముఖ నేతలు పాల్గొన్నారు.