అంగన్వాడిలో పిల్లలకు దుస్తుల పంపిణీ
న్యూస్ పవర్ ,2 జనవరి, ఇల్లంతకుంట:
ఇల్లంతకుంట మండలంలోని అనంతారం గ్రామంలో శుక్రవారం అంగన్వాడి కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వొల్లాల రజిత వెంకటేశం పాల్గొని చిన్నారులకు దుస్తులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్నారుల విద్య, ఆరోగ్యం పట్ల తల్లిదండ్రులతో పాటు సమాజం మొత్తం బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని తెలిపారు.అంగన్వాడి కేంద్రాల ద్వారా పిల్లలకు అవసరమైన మౌలిక సదుపాయాలు సమర్థంగా అందేలా గ్రామపంచాయతీ ఎల్లప్పుడూ సహకరిస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి విజయలక్ష్మి, అంగన్వాడి టీచర్ బండారి మంగ,3వ వార్డు సభ్యురాలు గోనపల్లి లావణ్య వెంకటేశం,5వ వార్డు సభ్యుడు బట్టి క్రాంతి,పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
