వాణినికేతన్ హైస్కూల్లో ముందస్తు నూతన సంవత్సర వేడుకలు
న్యూస్ పవర్ , 31 డిసెంబర్ , ఇల్లంతకుంట:
ఇల్లంతకుంట మండల కేంద్రంలోని వాణి నికేతన్ హై స్కూల్లో ముందస్తు నూతన సంవత్సర వేడుకలు జరిగాయి. పాఠశాల ఆవరణలో బుధవారం విద్యార్థులు కేక్ కట్ చేసి నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ తూముకుంట శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కొత్త ఆంగ్ల సంవత్సరంలో ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు రావాలన్నారు. గత సంవత్సరపు అనుభవాల పునాదులపై నూతన లక్ష్యాలను నిర్ణయించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీనిధి, ఉపాధ్యాయులు సంతోష్, రాజు, రమేష్, తిరుపతి, రాజు, శ్రీనివాస్, సుమంగళి, శోభ, రేఖ, మహాలక్ష్మి, లావణ్య, సునంద, మౌనిక, కళ్యాణి, రేణుక, షమీమా, స్వాతి, జలజ, రేణుక, శాంత, పద్మ, సునీత ల తోపాటు విద్యార్థులు పాల్గొన్నారు.
