వెల్జీపూర్ గ్రామంలో ఎరువుల పంపిణీ ప్రారంభం
న్యూస్ పవర్, 31 డిసెంబర్ , ఇల్లంతకుంట:
ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ: సహకారంతో నూతన సర్పంచ్ నాయిని నవీన్ కుమార్ మరియు పాలకవర్గం కృషితో గత కొన్ని సంవత్సరాల కల అయిన వెల్జీపూర్ గ్రామంలోనే ఎరువుల పంపిణీకి బుధవారం నుండి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం శ్రీకారం చుట్టింది దీనివల్ల రైతులకు ఇల్లంతకుంట నుండి రవాణా భారం నుండి విముక్తి కలగనుంది. అంతే కాకుండా ఎరువుల కోసం పని వదులుకొని మండల కేంద్రానికి వెళ్లాల్సి వస్తుంది కేంద్రం ఏర్పడడంతో ఆ సమయం కూడా ఆదా అవుతుందని గ్రామ రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇందుకు సహకరించిన ఇల్లంతకుంట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సీఈఓ, మండల వ్యవసాయ అధికారి కి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు గుండా వెంకటేశం, ఏఎంసీ చైర్మన్ కంకణాల రాంప్రసాద్ రెడ్డి, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు గొల్లకోమటి శంకర్ కి మరియు యాదవ సంఘం సభ్యులకు గ్రామపంచాయతీ పాలకవర్గం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కంకణాల శ్రావణి నరేష్ రెడ్డి, వార్డు సభ్యులు గొల్ల కమిటీ మల్లవ్వ శంకర్, సోనవేణి (బొజ్జ) శ్రీనివాస్, సంగేపు వేణు, సంగెం ముత్తవ్వ, దేశెట్టి కవిత బాబుచందర్, వేములవాడ భారతి రాజేశం, బొల్లారం ప్రసన్నకుమార్ లు పాల్గొన్నారు.
