డిసెంబర్ 31 రాత్రి పలుచోట్ల డ్రంక్ డ్రైవ్ తనిఖీలు
• ఇల్లంతకుంట ఎస్ఐ సిరిసిల్ల అశోక్ కుమార్
న్యూస్ పవర్ , 30 డిసెంబర్, ఇల్లంతకుంట:
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల ఎస్ఐ సిరిసిల్ల అశోక్ కుమార్ మాట్లాడుతూ, డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది చిన్న తప్పు కాదని, అది ఇతరుల ప్రాణాలతో ఆడుకునే ప్రమాదకరమైన నేరమని పేర్కొన్నారు. మద్యం మత్తులో వాహనం నడపడం వల్ల అనేక కుటుంబాలు అనాధలవుతున్నాయని, అలాంటి ఘటనలను అడ్డుకోవడమే పోలీసుల ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. అందుకే ఈ విషయంలో ఎవరి మాటలు వినేది లేదని ఇలాంటి విషయాలలో ఎవరు అయిన మద్యలో వచ్చి మా యొక్క సమయాన్ని వృథా చేయడం మంచిది కాదని ,కాబట్టి నూతన సంవత్సరం అనేది అందరూ కలసి సంతోషంగా మీయొక్క కుటుంబం తో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని అన్నారు.
ముఖ్యంగా డిసెంబర్ 31 రోజున డీజే లు పెట్టడం,బాణాసంచ పేల్చడం నిషేధం , పోలీసు యాక్ట్ అమల్లో ఉంది కాబట్టి ఎవరు కూడా బహిరంగంగా నూతన సంవత్సర వేడుకలు కార్యక్రమాలు నిర్వహించారాదు . ఒక వేళ ఏదైనా కార్యక్రమాలు చేయాలనుకునే వారు ముందస్తుగా సంబంధిత అధికారుల వద్ద అనుమతి తీసుకోవాలని అలాగే మద్యం మత్తులో ఉండి గొడవలు కొట్లాటలు పెట్టుకోవద్దని మండలములో ప్రత్యేకంగా పెట్రోలింగ్ చెయ్యడం జరుగుతుంది కాబట్టి మండలములో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండి మా పోలీసులకు సహకరించాలని ‘కోరుతూ మండల ప్రజలకు ఎస్ఐ సిరిసిల్ల అశోక్ కుమార్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
