రాష్ట్రస్థాయి అండర్–14 ఖో ఖో పోటీలకు పెద్దలింగాపూర్ విద్యార్థిని కొమ్ముల గౌతమి ఎంపిక
న్యూస్ పవర్ , 29 డిసెంబర్ , ఇల్లంతకుంట:
నవంబర్ 11వ తేదీన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల కథలాపూర్ లో ఖో ఖో పోటీలు నిర్వహించారు. దీనిలో రాజన్న సిరిసిల్ల ఖో ఖో టీం (అండర్ 14) ప్రాతినిథ్యం వహించడం జరిగింది. రాజన్న సిరిసిల్ల అండర్ 14 బాలికల ఖో ఖో టీం లో పెద్ద లింగాపూర్ జడ్పీహెచ్ఎస్ పాఠశాల క్రీడాకారిణి కొమ్ముల గౌతమి7వ తరగతి ఖో ఖో క్రీడలో అద్భుతమైన ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి జూనియర్స్ ఖో ఖో పోటీలకు ఎంపిక అయ్యారు.
రాష్ట్రస్థాయి ఖో ఖో పోటీలు ఈనెల 29వ తేదీ నుండి జనవరి 1వ తేదీ వరకు రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్ లో జరగనున్నాయి. ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి కి ఎంపికైన గౌతమి ని మరియు ఈ విద్యార్థికి అత్యుత్తమ శిక్షణ ఇచ్చి రాష్ట్రస్థాయిలో రాణించేలా కృషిచేసిన పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు సంద్రకారి రాజు ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు బోయిన తిరుపతి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. పెద్ద లింగాపూర్ పాఠశాలను రాష్ట్రస్థాయిలో కీర్తి ప్రతిష్టలు తెచ్చిన రాజు సార్ ని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
