ఘనంగా కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవం
• పార్టీ జెండాను ఆవిష్కరించిన మండల అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి
న్యూస్ పవర్, 28 డిసెంబర్, ఇల్లంతకుంట:
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అలాగే పేద బడుగు బలహీన వర్గాలకు ఎప్పుడు అండగా ఉంటూ ప్రజల పక్షాన నిలబడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, దేశంలో ఇప్పుడు నడుస్తున్న చాలా సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినవే , దేశానికి దశ దిశ చూపించింది కాంగ్రెస్ పార్టీ అని స్వతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కొనియాడారు. ఇప్పుడు కేంద్రంలో బిజెపి పార్టీ ప్రజలకు మేలు చేయకుండా పథకాల పేర్లను మారుస్తూ కాలం వృధా చేస్తుందని ఆరోపించారు. ఇటీవల ఉపాధి హామీ సంబంధించిన పేరును మారుస్తూ గాంధీ అనే పదం లేకుండా చూడాలని బిజెపి వ్యవహరిస్తుందని ఇది సరైన పద్ధతి కాదని సూచించారు. వెంటనే పేరు మార్చకుండా పని రోజులను పెంచుతూ పేదలకు ,బడుగు బలహీన వర్గాలకు ఉపయోగకరంగా ఉండేలాగా వివరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి కోఆర్డినేటర్ రాష్ట్ర కిసాన్ సెల్ ప్రధాన కార్యదర్శి రాజేందర్ రెడ్డి , కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు పుష్పలత, మానకొండూర్ నియోజకవర్గ అధికార ప్రతినిధి వెంకట్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ప్రసాద్, సర్పంచులు మామిడి రాజు, కతా మల్లేశం, నవీన్ , మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాజేశం, వెంకట్ రెడ్డి, సత్యలక్ష్మి, వీరేశం , కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ నరేష్,మైనారిటీ సెల్ అధ్యక్షులు జమాల్ మరియు సినియర్ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, గ్రామ శాఖ అధ్యక్షులు, కార్యకర్తలు , యువకులు తదితరులు పాల్గొన్నారు.
