ఇల్లంతకుంటలో రోడ్లు, డిగ్రీ కళాశాల కోసం ఉద్యమం
న్యూస్ పవర్ ,28 డిసెంబర్, ఇల్లంతకుంట:
ఇల్లంతకుంట మండల కేంద్రంలో సామాజిక ఉద్యమ కారుడు సావనపెల్లి రాకేష్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, మండలంలో రోడ్లు అధ్వానంగా మారాయని, మిడ్ మానేర్ రాజర్వాయర్ నుండి ఒగులాపూర్ వరకు కెనాల్ పనులు పూర్తి కాకపోవడంతో గుంటల మయమై, ప్రజలు భయపడుతున్నారని ఆక్షేపించారు.ఇల్లంతకుంటలో డిగ్రీ కళాశాల లేక 35 గ్రామాల విద్యార్థులు దూరాలకు వెళ్లి భవిష్యత్తు కోల్పోతున్నారని చెప్పారు. ఎమ్మెల్యే కవ్వంపెల్లి సత్యనారాయణ శీతాకాల సమావేశంలో రోడ్డు మరమ్మత్తు, కళాశాల మంజూరుకు డిమాండ్ చేస్తూ, అఖిల పక్షాలు, యువజన సంఘాలతో ఏకం చేసి ఉద్యమం ప్రకటించారు.కార్యక్రమంలో మామిడి విజయ్, మ్యాకల మల్లేశం, ఏనుగుల లింగన్న తదితరులు పాల్గొన్నారు.
