బిఆర్ఎస్ పార్టీ లో చేరిక
న్యూస్ పవర్, 27 డిసెంబర్, ఇల్లంతకుంట:
ఇల్లంతకుంట మండలం ఒగులాపూర్ గ్రామానికి చెందిన వివిధ పార్టీలకు చెందిన నాయకులు పండుగ రాజిరెడ్డి, ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి, ఎడ్ల రుషేందేర్ రెడ్డి, బైరి ప్రశాంత్, నాలవేణి ఎల్లయ్య, కీర్తి శ్రీకాంత్,రాదారపు మల్లేశ్, మానకొండూర్ మాజీ శాసన సభ్యుడు రసమయి బాలకిషన్ ఆధ్వర్యం లో బి ఆర్ ఎస్ పార్టీ లో చేరారు.. అనంతరం రసమయి బాలకిషన్ మాట్లాడుతూ తెలంగాణలో మార్పు మొదలైందని కాంగ్రెస్ పార్టీ పైన తెలంగాణ అంతటా తిరుగుబాటు ప్రారంభమైందని ప్రజలందరూ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. రెండేళ్లలో రెండుసార్లు రైతుబంధు ఎగ్గొట్టిన దొంగ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం. గతంలో రైతన్నలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతుబంధును రైతుల ఖాతాల్లో వేశాం అని గుర్తుకు చేశారు..బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ 11 సార్లు రైతుబంధు పథకం కింద రూ. 72 వేల కోట్లు వేశారని అన్నారు
పంచాయతీ ఎన్నికల్లో పార్టీ అద్భుతమైన విజయం సాధించిందని అధికార పార్టీ అరాచకాలను అక్రమాలను తట్టుకొని మరీ భారీ సంఖ్యలో గ్రామ పంచాయతీల్లో సర్పంచులుగా మన పార్టీ నేతలు గెలిచారని అన్నారు.. కొందరు నాయకులు అధికార పార్టీ ప్రలోభాలకు లోనై పార్టీ వీడి పారిపోతే, గ్రామ గ్రామాన ఉన్న పార్టీ నేతలు నిలబడి కొట్లాడి గెలిచారని అన్నారు.. అలాంటి ప్రతి ఒక్క కార్యకర్తకు పార్టీ తరఫున ధన్యవాదాలు తెలిపారు.స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేసిందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకవెల్లారని అన్నారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పదేండ్ల పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని, అడగకముందే ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి నడిపిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు.ప్రజలంతా కేసీఆర్ పాలననే మళ్ళీ కోరకుంటున్నారన్నారు.ఈ కార్యక్రమం లో రాజన్న సిరిసిల్ల జిల్లా మాజీ జడ్పీ వైస్ ఛైర్మెన్ సిద్ధం వేణు మరియు నూతన సర్పంచు లు కాముటం లావణ్య రాములు, పట్నం అశ్విని శ్రీనివాస్,కుడుములు రేణుక నాగారజు, గౌరవేణి శ్రీవాణి సుమన్,వికృతి స్నేహ లక్ష్మారెడ్డి, రడం లక్ష్మి, పెద్దలింగాపూర్ ఉప సర్పంచ్ ఎలవేణి రమేష్, మండల నాయకులు ఎం డి సాధుల్,ఎండ్ర చెందన్,రడం ప్రవీణ్, జెట్టి నాగరాజు సిద్ధం సాగర్,ఓగులాపూర్ నాయకులు అరె కొంరయ్య, గుండేటి ప్రశాంత్, పండుగు రాజిరెడ్డి,అలవాలా రాజేశం, మెడకొక్కుల ప్రవీణ్, కోడూరి సుజాత, వికృతి లావణ్య,గుండా అనిల్ తదితరులు పాల్గొన్నారు.
