Skip to main content

Posts

Showing posts from February, 2024

వివాహ వేడుకకు హాజరైన మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్

వివాహ వేడుకకు హాజరైన మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ న్యూస్ పవర్ , 29 ఫిబ్రవరి , ఇల్లంతకుంట : ఇల్లంతకుంట మండలంలోని వంతడుపుల గ్రామానికి చెందిన చిమ్మనగొట్టు శేఖర్- ఆద్యశ్రీ ల వివాహం ఇల్లంతకుంట మండల కేంద్రంలోని శ్రీ రాజ రాజేశ్వర గార్డెన్ లో జరుగగా కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ మానకొండూర్  ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తో కలిసి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు జీవి రామకృష్ణ రావు, జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, వైస్ ఎంపీపీ శ్రీనాథ్ గౌడ్, కచ్చు రాజయ్య, జక్కుల నాగరాజు, దూలం సంపత్ గౌడ్, సాయి, తదితరులు పాల్గొన్నారు.

డబుల్ బెడ్ రూoమ్ ఇండ్ల పట్టాలను తక్షణమే పంపిణీ చేయాలి

డబుల్ బెడ్ రూoమ్ ఇండ్ల పట్టాలను తక్షణమే పంపిణీ చేయాలి    న్యూస్ పవర్, 29 ఫిబ్రవరి , ఇల్లంతకుంట : రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్ద లింగాపూర్ గ్రామంలో డబుల్ బెడ్ రూoమ్ ఇళ్లను  వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు  బుర్రిప్రసాద్  సందర్శించి పేదల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత  ప్రభుత్వం హయములో నిర్మించిన డబుల్ బెడ్ రూoమ్ ఇళ్ల పంపిణీ చేయకపోవడం వల్ల గత ఎనిమిది సంవత్సరాలుగా నిరీక్షిస్తున్న నిరుపేదలు గ్రామ సభలో తమకు కేటాయించిన విధంగా తమ తమ ఇళ్లలోకి వెళ్లి నివాసం ఉంటున్నారని వారికి ఇంటి పట్టాలు ఇచ్చి వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు గత కొన్ని రోజులుగా పేదలను ఇబ్బందులకు గురి చేస్తూ మంచినీరు అలాగే విద్యుత్ నిలిపివేయడం జరిగిందని నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వం ప్రతి ఇంటికి 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తామని ప్రకటించినది గుర్తు చేశారు అలాగే గతంలో గ్రామసభ ఆమోదం పొంది రెవెన్యూ అధికారులు గడపగడపకు విచారణ చేసి లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగిందని మరి ప్రభుత్వం మారినక అధికారులు పట్టాలు ఎందుకు ఇవ్వడంల...

ఆరోగ్య కరమైన అలవాట్లతో వ్యాధులు దూరం

ఆరోగ్య కరమైన అలవాట్లతో వ్యాధులు దూరం  •  డిఎం & హెచ్ఓ శ్రీమతి రజిత  న్యూస్ పవర్ , 28 ఫిబ్రవరి, ఇల్లంతకుంట : ఎమ్మెల్యే శ కవ్వంపల్లి సత్యనారాయణ  ఎంపీపీ  ఊట్కూరీ వెంకట రమణ రెడ్డి  ఆదేశాల మేరకు రెండవ రోజు రేపాక గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించారు  ఇట్టి కార్యక్రమాన్ని జిల్లా నుండి ఇంఛార్జి డి ఎం హెచ్ ఓ  శ్రీమతి రజిత మేడం  ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది.వారు మాట్లాడుతూ గ్రామంలో యుక్త వయస్సు లోఉన్న పిల్లలకు ఎక్కువగా సస్పెక్టెడ్  జాండిస్ సోకిందని,వారు ఆహారపు అలవాట్లు మార్చుకోవాలని, జంక్ ఫుడ్స్ మరియు శీతల పానీయాలకు దూరంగా ఉండాలని, సెల్ ఫోన్ కు దూరంగా ఉండాలని సూచించారు. మరియు గ్రామ ప్రజలు కాచి చల్లార్చిన నీటిని తాగాలని, వేడి వేడి ఆహార పదార్థాలు భుజించాలని సూచించారు. మరియు గ్రామంలో ఉన్న నీటి వనరులను పరిశీలించి, రోజూ క్లోరినేషన్ చేయాలని గ్రామ పంచాయతీ కార్యదర్శి కి సూచించారు. నీటి నమూనాలను జిల్లా కు పంపించాలని గ్రామ స్పెషల్ ఆఫీసర్ కి చెప్పడం జరిగింది. మూడవ రోజు కూడా శిభిరం కంటిన్యూ చేయాలని, గ్రామ పరిస్థితిని ఎప్పటికప్పుడు మండల వైద్యాధి...

ఆధ్యాత్మిక శోభతో ఘనంగా మహా శివరాత్రి జాతర నిర్వహించాలి::రాష్ట్ర బీసీ & రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

ఆధ్యాత్మిక శోభతో ఘనంగా మహా శివరాత్రి జాతర నిర్వహించాలి:: రాష్ట్ర బీసీ & రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ • ప్రత్యేక పాసుల విధానం రద్దు... ప్రత్యేక దర్శనానికి రూ.300 టికెట్ల జారీ • మహాశివరాత్రి జాతర ఘనంగా జరిగేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి • జాతర అనంతరం శైవ క్షేత్రమైన వేములవాడను శ్రీశైలం తరహాలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలి • దాతల సహాయంతో   500 అతిధి గృహంలు నిర్మించేలా కార్యాచరణ • భవిష్యత్తులో వేములవాడలో సైతం భక్తులకు నిత్య అన్నదానం సత్రం ఏర్పాటుకు కృషి • మహాశివరాత్రి జాతర ఏర్పాట్ల పై ప్రభుత్వ విప్ జిల్లా కలెక్టర్ ఎస్పీ తో కలిసి  రివ్యూ నిర్వహించిన రాష్ట్ర బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ న్యూ స్ పవర్ , వేములవాడ,  ఫిబ్రవరి -28:     మహాశివరాత్రి జాతర ఆధ్యాత్మిక శోభతో ఘనంగా నిర్వహించేందుకు కట్టుదిట్టంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.బుధవారం రాష్ట్ర బీసీ&రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వేములవాడ రాజ రాజేశ్వర స్వామి ఆలయం ఓపెన్ స్లాబ్ లో ప్రభుత్వ ఆ...

బిటిఆర్ ఫౌండేషన్ నుండి బియ్యం అందజేత

బిటిఆర్ ఫౌండేషన్ నుండి బియ్యం అందజేత  న్యూస్ పవర్ , 28 ఫిబ్రవరి , ఇల్లంతకుంట : ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామంలో నిరుపేద కర్లబాలయ్య ఆత్మహత్య చేసుకొని మరణించగా వారి సభ్యులను పరామర్శించి 50 కేజీల బియ్యం సహాయం , రేపాక గ్రామంలో  పండుగసత్తయ్య  ఆకస్మికంగా  చనిపోగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి 50 కేజీ ల బియ్యపు బస్తాలు  బిటిఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు  బెంద్రం.తిరుపతి రెడ్డి అందజేశాడు  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ      ఇల్లంతకుంట మండలంలోని  నిరుపేద కుటుంబాలకు ఏ అపోదోచ్చిన, ఏ కష్టం వచ్చినా మీ ఆపన్నాహాస్థమై బిటిఆర్  ఫౌండేషన్ మీకు అండగా  వుంటుందాన్నరు పేద కుటుంబాలకు ఎల్లపుడు సహాయం మందిస్తామన్నారు, ఈ సహాయ సేవాలలో  బి.టీ.ఆర్ ఫౌండేషన్ సేవాప్రతినిధులు  బండారి.రాజు, బొల్లం రాంసాగర్, కర్ల లక్ష్మణ్, అంతగిరిఅనిల్, రాచకొండ సతీష్, పండుగలక్ష్మణ్,కర్ల అరుణ్, సందవేణిశేఖర్, కర్లతిరుపతి, కీర్తినర్సన్న, కిసరి లచ్చయ్య, కీర్తి అంజీ, కర్ల. అనిల్, పండుగా. నర్సయ్య, సుజాత, లచ్చయ్య,తదితరులు పాలుగోన్నారు.

18 మందికి జాండీస్ నిర్ధారణ

18 మందికి జాండీస్ నిర్ధారణ న్యూస్ పవర్ , 28 ఫిబ్రవరి , ఇల్లంతకుంట: రేపాక గ్రామంలో 2వ రోజు  వైద్య శిబిరం ఏర్పాటుచేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది గ్రామంలోని  18 మందికి జాండీస్ వచ్చాయని నిర్ధారణ చేశారు ఈరోజు 21 మందికి రక్త పరీక్షలు సేకరించి నిర్ధారణ కోసం సిరిసిల్ల ఆసుపత్రికి పంపించినట్టు ఇల్లంతకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ శరణ్య తెలిపారు.

వాణీనికేతన్ హైస్కూల్ లో సైన్స్ దినోత్సవ వేడుకలు

వాణీనికేతన్ హైస్కూల్ లో సైన్స్ దినోత్సవ వేడుకలు న్యూస్ పవర్ , 28 ఫిబ్రవరి, ఇల్లంతకుంట  జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు ఇల్లంతకుంట మండలకేంద్రంలోని వాణీనికేతన్ హైస్కూల్ లో ఘనంగా జరిగాయి. పాఠశాల ఆవరణలో విద్యార్థులు రూపొందించిన ఎగ్జిబీట్లను ప్రదర్శించారు. ఈసందర్బంగా పాఠశాల కరస్పాండెంట్ తూముకుంట శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతు ప్రఖ్యాత బౌతిక శాస్త్రవేత్త చంద్రశేఖర వెంకట రామన్ 1928 ఫిబ్రవరి 28న రామన్ ఎఫెక్ట్ సిద్దాంతాన్ని కనుగొన్నాడని తెలిపారు. అందువల్లనే ప్రతి సంవత్సరం ఇదే రోజును సైన్స్ దినంగా జరురుకుంటున్నామన్నారు.ప్రతివ్యక్తి జీవితం సైన్స్ తో ముడిపడి ఉందని, విద్యార్థులు సైన్స్ పట్ల మక్కువ పెంచుకోవాలన్నారు. సైన్స్ చదవిన విద్యార్థుల భవిష్యత్తు బాగుంటందని పేర్కొన్నారు. ఉత్తమ ఎగ్జిబీట్లకు  బహుమతులు అందించారు కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీనిధి, ఉపాద్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ప్రజాహితాయాత్ర విజయవంతం చేయండి

   ప్రజాహితాయాత్ర విజయవంతం చేయండి   న్యూస్ పవర్ , 28 ఫిబ్రవరి , ఇల్లంతకుంట:  ఇల్లంతకుంట మండల కేంద్రంలో బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్ రెడ్డి  ఆధ్వర్యంలో  మండల స్థాయి లాబర్తి సంపర్క్ అభియాన్ వర్క్ షాప్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కరీంనగర్ బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు గంగిపల్లి ఎంపీటీసీ రంగు భాస్కర చారి  హాజరై మాట్లాడుతూ  కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు ఇల్లంతకుంట మండలంలో 6500 మంది లబ్ధిదారులు ఉన్నారని వారిని కార్యకర్తలు అందరూ కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  లేఖను అందించవలసిందిగా సూచించారు ఎంపీ బండి సంజయ్ కుమార్  చేపట్టిన రెండో విడత ప్రజాహితాయాత్ర మార్చి 5న ఇల్లంతకుంట మండలంలో జరుగుతుందని ఇట్టి కార్యక్రమాన్ని కార్యకర్తలు అందరూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు  ఈ కార్యక్రమంలో బిజెపి మండల నాయకులు సూదుల కిషన్ మండల  ప్రధాన కార్యదర్శి   ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి చెప్పాలా గంగాధర్  మండల ఉపాధ్యక్షుడు భూమళ్ళ అనిల్ కుమార్ పెంటల వేణు గుగ్గిళ్ళ ఆంజనేయులు ,  బీజేవైఎం మండల అధ్యక...