JSON Variables

ఆరోగ్య కరమైన అలవాట్లతో వ్యాధులు దూరం

ఆరోగ్య కరమైన అలవాట్లతో వ్యాధులు దూరం 

•  డిఎం & హెచ్ఓ శ్రీమతి రజిత 

న్యూస్ పవర్ , 28 ఫిబ్రవరి, ఇల్లంతకుంట :
ఎమ్మెల్యే శ కవ్వంపల్లి సత్యనారాయణ  ఎంపీపీ  ఊట్కూరీ వెంకట రమణ రెడ్డి  ఆదేశాల మేరకు రెండవ రోజు రేపాక గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించారు 
ఇట్టి కార్యక్రమాన్ని జిల్లా నుండి ఇంఛార్జి డి ఎం హెచ్ ఓ  శ్రీమతి రజిత మేడం  ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది.వారు మాట్లాడుతూ గ్రామంలో యుక్త వయస్సు లోఉన్న పిల్లలకు ఎక్కువగా సస్పెక్టెడ్  జాండిస్ సోకిందని,వారు ఆహారపు అలవాట్లు మార్చుకోవాలని, జంక్ ఫుడ్స్ మరియు శీతల పానీయాలకు దూరంగా ఉండాలని, సెల్ ఫోన్ కు దూరంగా ఉండాలని సూచించారు. మరియు గ్రామ ప్రజలు కాచి చల్లార్చిన నీటిని తాగాలని, వేడి వేడి ఆహార పదార్థాలు భుజించాలని సూచించారు. మరియు గ్రామంలో ఉన్న నీటి వనరులను పరిశీలించి, రోజూ క్లోరినేషన్ చేయాలని గ్రామ పంచాయతీ కార్యదర్శి కి సూచించారు. నీటి నమూనాలను జిల్లా కు పంపించాలని గ్రామ స్పెషల్ ఆఫీసర్ కి చెప్పడం జరిగింది. మూడవ రోజు కూడా శిభిరం కంటిన్యూ చేయాలని, గ్రామ పరిస్థితిని ఎప్పటికప్పుడు మండల వైద్యాధికారి కి తెలియ చేయాలని గ్రామ ఏఎన్ఎం , ఆశాలను ఆదేశించారు.
ఇట్టి కార్యక్రమమలో మండల వైధ్యాధి కారి డా ,శరణ్య, సుమన్ ఆయుష్, లలిత, సూపర్వైజర్ నయీం, జవహర్, భిగిందర్  మరియు  జయ, ఆశాలు మమత, పద్మ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments