సైబర్ నేరగాళ్లను మించిన 'ఇసుక' దొంగలు.. లబ్ధిదారులకు తెలియకుండానే ఆధార్‌తో మాయాజాలం! ఇల్లంతకుంట, ఏప్రిల్ 17 (న్యూస్ పవర్): రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో ఇసుక మాఫియా కొత్త పుంతలు తొక్కుతోంది. గతంలో ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక కోసం లబ్ధిదారులు అందజేసిన ఆధార్ కార్డులు, ప్రొసీడింగ్ పత్రాలను అక్రమార్కులు ఆయుధంగా చేసుకుంటున్నారు. లబ్ధిదారులకు కనీస సమాచారం లేకుండానే వారి పేరుతో ఆన్‌లైన్‌లో ఇసుక బుక్ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వెలుగులోకి వచ్చిన వైనం: సోమారంపేట గ్రామానికి చెందిన ఒక ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుడి పేరుతో ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు ఇసుక బుక్ చేశారు. ఈ విషయంపై గ్రామ పంచాయతీ కార్యదర్శి సదరు లబ్ధిదారుడికి ఫోన్ చేయడంతో అసలు విషయం బయటపడింది. తనకు తెలియకుండానే తన పత్రాలను వాడుతున్నారని తెలుసుకున్న బాధితుడు విస్మయానికి గురయ్యాడు. మోసం జరుగుతోందిలా: పాత పత్రాల దుర్వినియోగం: గతంలో ఇసుక పర్మిషన్ కోసం ఇచ్చిన జిరాక్స్ కాపీలను ఇసుక ట్రాక్టర్ల యజమానులు భద్రపరుచుకున్నారు. ధరల వ్యత్యాసమే పెట్టుబడి: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రూ. 250 లకే ఇసుక పర్మిషన్ లభిస్తుంది (6 ట్రిప్ప...