గాలిపల్లి లో "పది" విద్యార్థులకు పరీక్ష సామాగ్రీ అందజేత.
న్యూస్ పవర్ , 11 మార్చి , ఇల్లంతకుంట:
ఇల్లంతకుంట మండలం గాలిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులకు పరీక్షలు వ్రాసేందుకు ఉపయోగపడే ఫ్యాడ్స్, పెన్నులు, రబ్బర్, స్కెల్, తో పాటు పాఠశాలలోని విద్యార్థులకు( క్రీడాకారులకు) జెర్సీ లను గాలిపల్లి కి చెందిన సింగిరెడ్డి భరత్ రెడ్డి జ్ఞాపకార్థం తన తండ్రి అయిన సింగిరెడ్డి తిరుపతిరెడ్డి పాఠశాల ప్రధానోపాధ్యాయు్రాలు మేకల పావని చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పరీక్షలు అంటే భయం వీడి కష్టం తో కాకుండా ఇష్టం తో పరీక్షలు మంచిగా వ్రాసి మంచి మార్కులు తెచ్చుకొని పాఠశాల, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని అకాంక్షించారు.ఈ సందర్బంగా పరీక్ష సామాగ్రీ ని అందించిన తిరుపతి రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాళు మేకల పావని, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ బట్టు పద్మ శ్రీనివాస్, ఉపాధ్యాయులు, స్పోర్ట్స్ ఇంచార్జి కేశవేణి శ్రీనివాస్ యాదవ్, పి డి సాన బాబు, విద్యార్థులు, యువకులు పాల్గొన్నారు.
