Skip to main content

Posts

Showing posts with the label ELLANTHAKUNTA

డ్రగ్స్ నిర్మూలనపై విద్యార్థులకు వ్యాసరచన పోటీ

డ్రగ్స్ నిర్మూలనపై విద్యార్థులకు వ్యాసరచన పోటీ  న్యూస్ పవర్ ,23 అక్టోబర్ , ఇల్లంతకుంట: పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ శ్రీ మహేష్ బాబాసాహెబ్ గీతే  ఆదేశాల మేరకు గురువారం ఇల్లంతకుంట మండల కేంద్రంలోని వాణి నికేతన్ హై స్కూల్, కేరళ మోడల్ స్కూల్, జిల్లా పరిషత్ పాఠశాల, రహీంఖాన్ పేట మోడల్ స్కూల్‌లలో విద్యార్థినీ‑విద్యార్థులకు “డ్రగ్స్ నిర్వారణలో పోలీస్ పాత్ర” మరియు “విద్యార్థులు డ్రగ్స్ నుంచి ఎలా దూరంగా ఉండగలరు” అనే అంశాలపై వ్యాసరచన పోటీ నిర్వహించారు.   ఈ పోటీలో ఉత్తమంగా ప్రదర్శన కనబరచిన విద్యార్థులకు జిల్లా స్థాయిలో ఎస్పీ  స్వయంగా బహుమతులు అందజేయనున్నట్టు ఇల్లంతకుంట ఎస్సై  సిరిసిల్ల అశోక్ తెలిపారు.

ఇసుక అక్రమ రవాణా కేసు నమోదు

ఇసుక అక్రమ రవాణా కేసు నమోదు  న్యూస్ పవర్, 23 అక్టోబర్ , ఇల్లంతకుంట: అక్రమ  ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ సీజ్ చేసి డ్రైవరు మరియు యజమాని రిమాండ్ చేసినట్లు ఇల్లంతకుంట ఎస్సై సిరిసిల్ల అశోక్ తెలిపారు,  గురువారం  ఉదయం  ఇల్లంతకుంట మండలం పొత్తూరు శివారులోని బిక్క వాగు నుండి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక నింపుకొని అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్ ను పట్టుకొని పంచనామ ద్వారా సీజ్ చేసి  ట్రాక్టర్ డ్రైవర్ నక్క రజనీకాంత్ మరియు ట్రాక్టర్ యజమాని  ఆకుల తిరుపతి   వ్యక్తుల మీద కేసు నమోదు చేసుకొని వారిని జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం తరలించడం జరిగిందనీ ఎస్ఐ తెలిపారు.

అయ్యప్ప మహాపాదం చేసిన అయ్యప్ప భక్తుడికి ఘన స్వాగతం

అయ్యప్ప మహాపాదం చేసిన అయ్యప్ప భక్తుడికి ఘన స్వాగతం   న్యూస్ పవర్ , 21 అక్టోబర్, ఇల్లంతకుంట: ఇల్లంతకుంట గ్రామానికి చెందిన అయ్యప్ప స్వామి అంతటి రామచంద్రం ముస్తాబాద్ గురుస్వామి రాజు వారి ఆధ్వర్యంలో 60 రోజుల క్రితం ప్రారంభమైన అయ్యప్ప స్వామి మహా పాదయాత్ర విజయవంతంగా ముగిసింది. ఈ యాత్రలో భాగంగా మొత్తం 1400 కిలోమీటర్లు శబరిమల నడిచి  స్వామివారి దర్శనం పూర్తి చేసుకొని సోమవారం రోజున తిరిగి స్వగ్రామానికి చేరుకున్న నేపథ్యంలో అయ్యప్ప భక్తుడు అంతటి రామచంద్రం కు గ్రామ ప్రజలు, అయ్యప్ప భక్తులు ఘన స్వాగతం పలికారు. గ్రామ ప్రవేశద్వారం వద్ద పూలమాలలు, శాలువాలతో గ్రామస్తులు, అయ్యప్ప సేవా సంఘ సభ్యులు సన్మానించి ఆయనను సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు మాట్లాడుతూ, “స్వామి భక్తుడి  నిబద్ధత అందరికీ ఆదర్శం” అని పేర్కొన్నారు. గ్రామ యువత, పెద్దలు, మహిళలు  పాల్గొన్న ఈ కార్యక్రమం భక్తి పరవశ వాతావరణంలో సాగింది. స్వామి సన్నిధిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. భక్తులు ఈ సందర్భంగా “అదే పవిత్ర నిష్టతో అయ్యప్ప మాలధారణ చేస్తే ఎప్పుడూ అయ్యప్ప ఆశీర్వాదం ఉంటుందని తెలి...

కవ్వంపల్లి చిత్రపటానికి క్షీరాభిషేకం

  కవ్వంపల్లి  చిత్రపటానికి క్షీరాభిషేకం      న్యూస్ పవర్, 21 అక్టోబర్ , ఇల్లంతకుంట: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నిర్వహణ కొరకు గాలి పెళ్లి సొసైటీ నుండి తాళ్ల పెళ్లి మహిళా సంఘానికి ఇప్పించిన మానకొండూర్  ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ చిత్రపటానికి తాళ్ల పెళ్లి మహిళా సంఘం మహిళలు క్షీరాభిషేకం  చేశారు. సోమవారం ఇల్లంతకుంట మండల కేంద్రంలో  తాళ్ల పెల్లి ఓం సాయి మహిళాగ్రామైక్య సంఘం సభ్యులు, వివో సభ్యులు ఎమ్మెల్యే కవ్వంపల్లి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా తాళ్లపల్లి మహిళా మండలి సభ్యులు మాట్లాడుతూ మేము నిర్వహించాల్సిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గాలి పెళ్లి సొసైటీ వారు తీసుకోవడంతో మేము మాకు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ ని కలవడం జరిగింది అందుకు స్పందించిన ఎమ్మెల్యే మహిళలే నిర్వహించాలన్న ఉద్దేశంతో తాళ్ల పెళ్లి ఓం సాయి గ్రామైక్య సంఘానికి వరి ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వహణను ఇప్పించడం జరిగింది. ఈ శుభ సందర్భంగా తాళ్ల పెళ్లి ఓం సాయి గ్రామైక్య సంఘం మరియు వివో సంఘం మహిళా సభ్యులందరం కలిసి కృతజ్ఞతగా మంగళవారం...

రేణుక ఎల్లమ్మ గుడి వద్ద ప్రతి పౌర్ణమి రోజు అన్నప్రసాద వితరణ

 రేణుక ఎల్లమ్మ గుడి వద్ద ప్రతి పౌర్ణమి రోజు అన్నప్రసాద వితరణ న్యూస్ పవర్, 19 అక్టోబర్, ఇల్లంతకుంట: ఇల్లంతకుంట గ్రామానికి చెందిన సుదగోని గౌడ వంశస్థులు ప్రతి నెల పౌర్ణమి రోజు శ్రీ రేణుక ఎల్లమ్మ గుడి వద్ద అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు.ఈ నిర్ణయాన్ని ఆదివారం గ్రామంలోని గౌడ సంఘ సభ్యుల సమక్షంలో  తీసుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి పౌర్ణమికి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తామని కావున గ్రామస్తులందరూ   అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.ఈ కార్యక్రమంలో సుదగోని మల్లయ్య గౌడ్, సుదగోని పరశురాం గౌడ్, సుదగోని ఆంజనేయులు గౌడ్, సుదగోని హనుమాండ్లు, సుదగోని నాగేంద్ర గౌడ్, సుదగోని సత్యనారాయణ, సుదగోని రాంబాబు, సుదుగోని సత్యనారాయణ, సుదగోని కమలాకర్  గౌడ సంఘ సభ్యులు పాల్గొన్నారు.

ఇల్లంతకుంట లో బిసి బంద్ విజయవంతం

ఇల్లంతకుంట లో  బిసి బంద్ విజయవంతం   న్యూస్ పవర్ ,18 అక్టోబర్, ఇల్లంతకుంట: బిసి జేఏసీ ఇచ్చిన పిలుపుమేరకు తెలంగాణ రాష్ట్ర బంద్ లో భాగంగా ఇల్లంతకుంట మండల కేంద్రంలో పార్టీలకతీతంగా బీసీ సంఘాల నేతలు బీసీ కులాల ఐక్యవేదిక నాయకులు కాంగ్రెస్ బిఆర్ఎస్ బిజెపి పార్టీల బీసీ నేతలు బందులో పాల్గొన్నారు.  ఇల్లంతకుంట మండల కేంద్రంలో  వ్యాపారస్తులు బీసీ బందుకు సహకరించి స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేశారు.ఈ సందర్భంగా పలు పార్టీల నేతలు    మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించేంతవరకు బీసీల పోరాటం కొనసాగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో బిసి బిల్లును ప్రవేశపెట్టి అమలు చేయాల్సిన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీని అమలు చేసి స్థానిక ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు.  బందులో స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేసిన బీసీలందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు పార్టీల నాయకులు  బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

రసమయి ఇంటిపై దాడి సరికాదు

రసమయి ఇంటిపై దాడి సరికాదు • జడ్పీ మాజీ ఉపాధ్యక్షుడు సిద్ధం వేణు  న్యూస్ పవర్, అక్టోబర్, ఇల్లంతకుంట:  మాజీ శాసనసభ్యుడు రసమయి బాలకిషన్ ఇంటి పై కాంగ్రెస్ నాయకులు దాడులు చేసి పైశాచికానందం పొందుతున్నారని, కాంగ్రెస్  దమ్ము,ధైర్యం ఉంటే మీ ఎమ్మెల్యే ని ఫస్ట్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడమని చెప్పండని జడ్పీ మాజీ ఉపాధ్యక్షుడు సిద్ధం వేణు అన్నారు. ఈ సందర్భంగా సిద్ధం వేణు మాట్లాడుతూ చేతకాని దద్దమ్మల లెక్క కాంగ్రెస్ గుండాలు రసమయి బాలకిషన్  ఇంటిపై దాడులు చేయడం మానుకోవాలని, మా బీఆర్ఎస్ సైన్యంతో కలిసి దాడులు చేయాలనుకుంటే కాంగ్రెస్ నాయకులు ఊర్లు వదిలి పరుగెత్తాల్సి వస్తుందని అన్నారు. మానకొండూర్ నియోజకవర్గములో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని గ్రహించి స్థానిక ఎమ్మెల్యే సారధ్యంలోనే కాంగ్రెస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే ఇంటిపై, బీఆర్ఎస్ నాయకులపై దాడులకు పాల్పడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ నాయకులు దాడులకు తెగబడటం కాదు ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని, కాంగ్రెస్ నాయకులకు ప్రజల్లోకి వెళ్లే ముఖం లేకనే నిత్యం మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పై ఎదో ఒకటి కథ అల్లుతూ పబ్...

రేపటి బంధు ను విజయవంతం చేద్దాం

రేపటి బంధు ను విజయవంతం చేద్దాం • రేపు తెలంగాణ బంద్‌కు కాంగ్రెస్ మద్దతు •యువజన కాంగ్రెస్ నియోజకవర్గ మాజీ అధ్యక్షులు అంతగిరి వినయ్ కుమార్ న్యూస్ పవర్,17 అక్టోబర్ , ఇల్లంతకుంట: తెలంగాణ వ్యాప్తంగా రేపు తలపెట్టిన బంద్ విజయవంతం చేయాలని రేపటి బందుకు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మద్దతు ఉందాని స్వచ్ఛందంగా వ్యాపార ,వాణిజ్య సంఘాలు,పాఠశాలలు వారు బంద్ లో పాల్గొని సహకరించాలని కోరారు. కామారెడ్డి డిక్లరేషన్‌లో ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు 42 శాతం విద్యా, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్లు కల్పించేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేసిందన్నారు. ఈ మేరకు అసెంబ్లీలో బిల్లులను పాస్ చేసి ఆమోదం కోసం కేంద్రానికి పంపడం జరిగిందని గుర్తు చేశారు.​  కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంలో కృత నిశ్చయంతో ముందుకు పోతున్న తరుణంలో హైకోర్టు స్టే రావడం బాధాకరమన్నారు. ప్రజలను మేల్కొలిపే విధంగా బీసీ సంఘాలు ఇచ్చిన బంద్‌కు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా సంఘీభావం తెలిపారని వెల్లడించారు.కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ప్రకటిస్తుందని తెలిపారు .

రసమయి దిష్టి బొమ్మ దగ్ధం

రసమయి దిష్టి బొమ్మ దగ్ధం న్యూస్ పవర్ , 17 అక్టోబర్ , ఇల్లంతకుంట:  ఇల్లంతకుంట మండల కేంద్రంలో మాజీ శాసనసభ్యుడు రసమయి బాలకిషన్ దిష్టి బొమ్మను మండల కాంగ్రెస్ నాయకులు ఆధ్వర్యంలో దహనం చేయడం జరిగింది.ఈ సందర్బంగా యువజన కాంగ్రెస్ మానకొండూర్ నియోజకవర్గ మాజీ అధ్యక్షుడు అంతగిరి వినయ్ కుమార్ మాట్లాడుతూ  మానకొండూర్ నియోజకవర్గ  శాసనసభ్యుడు   డా. కవ్వంపల్లి సత్యనారాయణ  పై మరియు ఆయన కుటుంబ సభ్యలపై మాజీ శాసనసభ్యుడు రసమయి బాలకిషన్   అభ్యంతరకరమైన, దురుసుగా మాట్లాడిన తీరును సభ్య సమాజం ఖండిస్తుందని. ఇలాంటి మాటలు ఇంకోసారి గనుక మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.  శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ కి వెంటనే బేషరతుగా  క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ మచ్చ రాజేశం, మాజీ ఎంపీటీసీ సభ్యుడు కరుణాకర్ రెడ్డి, మైనార్టీ సెల్ అధ్యక్షుడు జమల్, ఎస్ సి సెల్ జిల్లా నాయకులు జుట్టు నగేష్, ఫిషరీస్ చైర్మన్ జెట్టి మల్లేష్, సాయి వర్మ, మల్లయ్య, బడుగు లింగం,బంగారి ఆంజినేయులు,లక్ష్మన్, రవి, దయసాగర్, బాబు, చిక్కుడ...

కపాస్ యాప్ పరిశీలన

    కపాస్ యాప్ పరిశీలన   న్యూస్ పవర్, 16 అక్టోబర్ , ఇల్లంతకుంట: ఇల్లంతకుంట మండలంలోని పొత్తూరు మరియు నర్సక్కపేట గ్రామాలలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీమతి అఫ్జల్ బేగం  కిసాన్ కపాస్ అప్లికేషన్ పనితీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు.   ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కిసాన్ కపాస్ యాప్ ద్వారా రైతులు పత్తి పంటను సిసిఐ  ద్వారా విక్రయించటానికి ముందుగానే స్లాట్ బుక్ చేసుకోవచ్చని తెలిపారు. రైతులు ఈ సౌకర్యాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని సూచించారు.   అలాగే యాప్ వినియోగంలో ఏవైనా సాంకేతిక లేదా క్షేత్రస్థాయి సమస్యలు ఎదురైతే సమీపంలోని వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించి సందేహాలు నివృత్తి చేసుకోవాలని సూచించారు.   ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఎం. సురేష్ రెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారి లలిత, సంబంధిత గ్రామాల రైతులు పాల్గొన్నారు.  

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గెలుపు ఖాయం: సిద్ధం వేణు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గెలుపు ఖాయం: సిద్ధం వేణు  న్యూస్ పవర్ , 14 అక్టోబర్ , ఇల్లంతకుంట: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా  మాగంటి సునీత ఖచ్చితంగా విజయం సాధిస్తారని మాజీ జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు విశ్వాసం వ్యక్తం చేశారు ఆమెకు మద్దతుగా  పల్లె నర్సింహారెడ్డి, కేతిరెడ్డి వెంకట నరసింహారెడ్డి (కేవీయన్ రెడ్డి) లు ప్రచార చేశారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎన్ని ప్రయత్నాలు చేసినా కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు నమోదు చేసి, ధనప్రవాహాన్ని పెంచినా, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గెలుపును ఎవరూ ఆపలేరని  తెలిపారు.

ఎంబిబిఎస్ సీట్ సాధించిన చెప్యాల గౌతమి

 ఎంబిబిఎస్ సీట్ సాధించిన చెప్యాల గౌతమి  న్యూస్ పవర్ , 14 అక్టోబర్ , ఇల్లంతకుంట: కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని దాచారం హై స్కూల్  ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి రాణి మేడం మరియు ప్రాథమిక ప్రధానోపాధ్యాయులు బాలగౌడ్  అన్నారు. గ్రామానికి చెందిన, ప్రభుత్వప్రాథమిక  పాఠశాలలో విద్యాభ్యాసం చేసిన చెప్యాల గౌతమి అనే విద్యార్థిని నీట్  లో ఎంబీబీఎస్ సీటు సాధించింది. దీంతో ఆమెకు కరీంనగర్ లోని (పీమ్స్) ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఎంబిబిఎస్ చదవనుంది. ఈ సందర్భంగా గ్రామ మాజీ సర్పంచ్ చెప్యాలా గంగాధర్ కూతురు గౌతమికి ఎంబిబిఎస్ లో చోటు సాధించడం పట్ల దాచారం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల బృందంతోపాటుగా గ్రామస్తులు, ,విద్యార్థులు గౌతమికి సన్మానం చేశారు. ఈసంధర్భంగా గౌతమిని గ్రామస్థులు  అభినందించారు. కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బాల గౌడ్ , ఉపాధ్యాయులు తుంకుంట నరేందర్ రెడ్డి , శ్రీనివాస్ రెడ్డి , రమేష్  తో పాటుగా విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

దళారులకు అమ్మి నష్టపోవద్దు

  దళారులకు అమ్మి నష్టపోవద్దు    న్యూస్ పవర్ , 13 అక్టోబర్ , ఇల్లంతకుంట:  ఇల్లంతకుంట మండల కేంద్రంలోని ప్రజా పరిషత్ లో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కుల పంపిణీ కార్యక్రమాన్నిమానకొండూరు నియోజకవర్గం శాసనసభ్యు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ  సోమవారం నిర్వహించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిరుపేదల కుటుంబాల వైద్యానికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో అండగా ఉంటుందని పేర్కొన్నారు . మండలంలోని వివిధ గ్రామాల లబ్ధిదారులకు స్థానిక నాయకులతో కలిసి ఆయన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందచేశారు   ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్, చిక్కుడువానిపల్లి, అనంతారం, ముస్కానిపేట, గాలిపెల్లి, పొత్తూరు గ్రామాల్లో ఐకేపీ, సింగిల్ విండోల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకే వరి ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నామని ఈ సందర్భంగా డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ వెల్లడించారు  ఈ ఏడాది ప్రభుత్వం ధాన్యం మద్దతు ధరను పెంచుతూ నిర్ణయం ప్రకటించిందని, దీని ప్రకారం ఏ గ్రేడ్‌ రకం క్వింటా రూ.2,389, సాధారణ రకం రూ.2,369కు కొనుగ...

బొలెరో ట్రాలీ సీజ్ డ్రైవర్, ఓనర్ రిమాండ్

బొలెరో ట్రాలీ సీజ్ డ్రైవర్, ఓనర్ రిమాండ్ న్యూస్ పవర్ ,12 అక్టోబర్ , ఇల్లంతకుంట: అక్రమంగా ఇసుక తరలిస్తే జైలుకే అని ఇల్లంతకుంట అదనపు ఎస్సై జి లక్ పతి అన్నారు  మండలం లోని తిప్పాపూర్ గ్రామ శివారులో శనివారం రాత్రి ఒక బొలెరో ట్రాలీ నందు ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న బొలెరో ట్రాలీ ని పట్టుకొని కేసు నమోదు చేసి బొలెరో వాహనం ను సీజ్ చేసి తంగళ్ళపల్లి మండలం నేరెళ్ల గ్రామానికి చెందిన డ్రైవర్ చౌదరి వెంకటేష్ మరియు యజమాని కందుకూరి సాయికుమార్ లను  జ్యుడీషియల్ రిమాండ్ చేయడం జరిగింది.

సీసీ రోడ్డుపై మట్టి, దుమ్ముతో ప్రజలకు ఇబ్బందులు

సీసీ రోడ్డుపై మట్టి, దుమ్ముతో ప్రజలకు ఇబ్బందులు న్యూస్ పవర్, 12 అక్టోబర్ , ఇల్లంతకుంట: ఇల్లంతకుంట మండల కేంద్రంలో బస్టాండ్ నుండి వివేకానంద చౌరస్తా రోడ్డు, అలాగే బైపాస్ రోడ్డును ఆనుకొని నూతనంగా  సీసీ రోడ్డు నిర్మించారు. కానీ, రోడ్డుపై మట్టి పేరుకుపోవడంతో ప్రజలు దుమ్ముతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.గ్రామానికి ప్రధాన రోడ్డుగా ఉండే ఈ రోడ్డు రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల, దుమ్ము ఎక్కువగా ఎగిసిపడి రోడ్డు పక్కన నివసించే ప్రజలకు శ్వాసకోశ సమస్యలు ఏర్పడుతున్నాయి. కావున, అధికారులు, పంచాయతీ సిబ్బందితో  సీసీ రోడ్లపై పేరుకుపోయిన మట్టిని వెంటనే తొలగించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

రాకేష్ కిషోర్ పై తక్షణ విచారణ చేపట్టాలి

రాకేష్ కిషోర్ పై తక్షణ విచారణ చేపట్టాలి   న్యూస్ పవర్ , 11 అక్టోబర్ , ఇల్లంతకుంట: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయ్ పై జరిగిన దాడిని ఖండిస్తూ, ఆ దాడిని దేశ వ్యవస్థపై జరిగిన దాడిగా పరిగణించాలని డిమాండ్ చేస్తూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి  నాయకులు  ఇల్లంతకుంట మండల కేంద్రంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఎమ్మార్పీఎస్  మండల అధ్యక్షుడు మంద రాజు మాదిగ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో,  జిల్లా కో కన్వీనర్ సావనపెల్లి రాకేష్ మాదిగ మాట్లాడుతూ,   మందకృష్ణ మాదిగ  ఆదేశాల మేరకు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. దాడి చేసిన రాకేష్ కిషోర్ పై లోతైన విచారణ జరిపి, తక్షణమే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజ్యాంగ వ్యవస్థలో అత్యున్నత పదవిలో ఉన్న న్యాయమూర్తిపై దాడి జరగడం ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దాడికి నిరసనగా మరియు న్యాయం కోసం డిమాండ్ చేస్తూ, అక్టోబర్ 13న రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు నల్ల జెండాలతో భారీ నిరసన ప్రదర్శన చే...

రైతులతో శాస్త్రవేత్తల చర్చాగోష్ఠి – యాసంగి పంటల ప్రణాళికపై అవగాహన

  రైతులతో శాస్త్రవేత్తల చర్చాగోష్ఠి – యాసంగి పంటల ప్రణాళికపై అవగాహన • పొత్తూరు గ్రామంలో రైతు సదస్సు, వ్యవసాయ ప్రదర్శన   న్యూస్ పవర్, 10 అక్టోబర్ , ఇల్లంతకుంట: తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం (జిల్లా ఏరువాక కేంద్రం), కరీంనగర్ ఆధ్వర్యంలో గ్రామీణ వ్యవసాయ కృషి అనుభవ కార్యక్రమం లో భాగంగా మహాత్మా జ్యోతిభ పులే వ్యవసాయ కళాశాల, కరీంనగర్ విద్యార్థులు పొత్తూరు గ్రామంలోని రైతువేదిక వద్ద రైతు సదస్సు, వ్యవసాయ ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యాసంగి పంటల ప్రణాళికపై రైతులు మరియు శాస్త్రవేత్తల మధ్య చర్చా గోష్ఠి జరిగింది. రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డా. కె. మదన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ, ఆధునిక సాంకేతికతను ఉపయోగించి వ్యవసాయంలో ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని, శాస్త్రవేత్తల సూచనలను పాటించడం ద్వారా ఎక్కువ దిగుబడులు పొందవచ్చని సూచించారు.   అలాగే వ్యవసాయ పరిశోధన సంచాలకుడు డా. బి. రాంప్రసాద్ రైతులు మారుతున్న వాతావరణ పరిస్థితులకు తగ్గట్టు పంటల సరళిని మార్చుకోవాలని, మార్కెట్ డిమాండ్‌ ఉన్న పంటల సాగు ద్వారా లాభాలు సాధించవచ్చని తెలిపారు.   అసోసియేటెడ్ డీన్...

మాదిగల ఐక్యతకై 'అలయ్ - బలయ్' కార్యక్రమము

  మాదిగల ఐక్యతకై 'అలయ్ - బలయ్' కార్యక్రమము   న్యూస్ పవర్ , 7 అక్టోబర్ , ఇల్లంతకుంట:  మాదిగలలో రాజకీయ, సామాజిక మరియు ఆర్థిక చైతన్యాన్ని పెంపొందించే లక్ష్యంతో మాదిగల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఇల్లంతకుంట మండల కేంద్రంలో మాదిగల అలయ్ - బలయ్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు మాదిగల ఐక్య వేదిక మండల కన్వీనర్ సావనపెల్లి రాకేష్ ప్రకటించారు   ఇల్లంతకుంట మండల కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మాదిగల ఐక్యత కోసం మరియు రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ నెల 8, బుధవారం  ఉదయం 11 గంటలకు   ఇల్లంతకుంట మండల కేంద్రంలోని శ్రీ. రాజరాజేశ్వర ఫంక్షన్ హాల్ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు   ఈ కార్యక్రమానికి మాదిగ మాజీ ప్రజా ప్రతినిధులు, మేధావులు, అలాగే ప్రతి గ్రామం నుడి మాదిగ సోదరులు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు .

దుర్గాదేవి మండపంలో ఘనంగా పూజలు

దుర్గాదేవి మండపంలో ఘనంగా పూజలు   న్యూస్ పవర్, 3అక్టోబర్, ఇల్లంతకుంట: ఇల్లంతకుంట మండల కేంద్రంలోని హిందూ వాహిని ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన దుర్గాదేవి మండపం వద్ద ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఇల్లంతకుంట మాజీ సర్పంచ్  వొగ్గు నర్సయ్య  పూజా కార్యక్రమంలో పాల్గొని, అమ్మవారికి అభిషేకాలను నిర్వహించారు. అనంతరం హిందు వాహిని ఉత్సవ సమితి సభ్యులకు రూ. 20116 లను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మామిడి సంజీవ్, కూనబోయిన బాలరాజు, ఉత్సవ సమితి అధ్యక్షుడు నాగ సముద్రాల బాలకృష్ణ, గూఢ నరేందర్ రెడ్డి, అర్చకులు రాజేశ్వర్ శర్మ, హిందు వాహిని ఉత్సవ సమితి సభ్యులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

గాలిపల్లి పల్లె దవాఖానలో ప్రత్యేక వైద్య శిబిరం

 గాలిపల్లి పల్లె దవాఖానలో ప్రత్యేక వైద్య శిబిరం    న్యూస్ పవర్,27 సెప్టెంబర్ , ఇల్లంతకుంట; కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్వస్త్ నారి సశక్త్ పరివార్ అభియాన్ లో భాగంగా  గాలిపల్లి పల్లె దవాఖాన/ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌లో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు.   ఈ శిబిరంలో చెవి-ముక్కు-గొంతు నిపుణుడు డాక్టర్ మోహన్ కృష్ణ  ప్రత్యేక పరీక్షలు చేసి, అవసరమైన వారికి ఉచితంగా మందులు, ఇయర్ డ్రాప్స్, నోస్ డ్రాప్స్ అందజేశారు. అలాగే ప్రతి ఒక్కరికీ బీపీ, షుగర్ పరీక్షలు కూడా నిర్వహించారు.   ఈ కార్యక్రమంలో మొత్తం 74 మంది  పరీక్షలు చేయించుకున్నారు. శిబిరంలో పల్లె దవాఖాన వైద్యాధికారి డాక్టర్ రమేష్, ఎంఎల్హెచ్పీలు సంధ్య, నవనీత, సూపర్వైజర్ జవహర్, ఏఎన్ఎమ్ కవిత, ఆశా కార్యకర్తలు, ప్రజలు మరియు ఇతర ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.