డ్రగ్స్ నిర్మూలనపై విద్యార్థులకు వ్యాసరచన పోటీ
న్యూస్ పవర్ ,23 అక్టోబర్ , ఇల్లంతకుంట:
పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ శ్రీ మహేష్ బాబాసాహెబ్ గీతే ఆదేశాల మేరకు గురువారం ఇల్లంతకుంట మండల కేంద్రంలోని వాణి నికేతన్ హై స్కూల్, కేరళ మోడల్ స్కూల్, జిల్లా పరిషత్ పాఠశాల, రహీంఖాన్ పేట మోడల్ స్కూల్లలో విద్యార్థినీ‑విద్యార్థులకు “డ్రగ్స్ నిర్వారణలో పోలీస్ పాత్ర” మరియు “విద్యార్థులు డ్రగ్స్ నుంచి ఎలా దూరంగా ఉండగలరు” అనే అంశాలపై వ్యాసరచన పోటీ నిర్వహించారు.
ఈ పోటీలో ఉత్తమంగా ప్రదర్శన కనబరచిన విద్యార్థులకు జిల్లా స్థాయిలో ఎస్పీ స్వయంగా బహుమతులు అందజేయనున్నట్టు ఇల్లంతకుంట ఎస్సై సిరిసిల్ల అశోక్ తెలిపారు.
