ఇసుక అక్రమ రవాణా కేసు నమోదు
న్యూస్ పవర్, 23 అక్టోబర్ , ఇల్లంతకుంట:
అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ సీజ్ చేసి డ్రైవరు మరియు యజమాని రిమాండ్ చేసినట్లు ఇల్లంతకుంట ఎస్సై సిరిసిల్ల అశోక్ తెలిపారు,
గురువారం ఉదయం ఇల్లంతకుంట మండలం పొత్తూరు శివారులోని బిక్క వాగు నుండి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక నింపుకొని అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్ ను పట్టుకొని పంచనామ ద్వారా సీజ్ చేసి ట్రాక్టర్ డ్రైవర్ నక్క రజనీకాంత్ మరియు ట్రాక్టర్ యజమాని ఆకుల తిరుపతి వ్యక్తుల మీద కేసు నమోదు చేసుకొని వారిని జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం తరలించడం జరిగిందనీ ఎస్ఐ తెలిపారు.
