అయ్యప్ప మహాపాదం చేసిన అయ్యప్ప భక్తుడికి ఘన స్వాగతం
న్యూస్ పవర్ , 21 అక్టోబర్, ఇల్లంతకుంట:
ఇల్లంతకుంట గ్రామానికి చెందిన అయ్యప్ప స్వామి అంతటి రామచంద్రం ముస్తాబాద్ గురుస్వామి రాజు వారి ఆధ్వర్యంలో 60 రోజుల క్రితం ప్రారంభమైన అయ్యప్ప స్వామి మహా పాదయాత్ర విజయవంతంగా ముగిసింది. ఈ యాత్రలో భాగంగా మొత్తం 1400 కిలోమీటర్లు శబరిమల నడిచి స్వామివారి దర్శనం పూర్తి చేసుకొని సోమవారం రోజున తిరిగి స్వగ్రామానికి చేరుకున్న నేపథ్యంలో అయ్యప్ప భక్తుడు అంతటి రామచంద్రం కు గ్రామ ప్రజలు, అయ్యప్ప భక్తులు ఘన స్వాగతం పలికారు. గ్రామ ప్రవేశద్వారం వద్ద పూలమాలలు, శాలువాలతో గ్రామస్తులు, అయ్యప్ప సేవా సంఘ సభ్యులు సన్మానించి ఆయనను సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు మాట్లాడుతూ, “స్వామి భక్తుడి నిబద్ధత అందరికీ ఆదర్శం” అని పేర్కొన్నారు. గ్రామ యువత, పెద్దలు, మహిళలు పాల్గొన్న ఈ కార్యక్రమం భక్తి పరవశ వాతావరణంలో సాగింది. స్వామి సన్నిధిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. భక్తులు ఈ సందర్భంగా “అదే పవిత్ర నిష్టతో అయ్యప్ప మాలధారణ చేస్తే ఎప్పుడూ అయ్యప్ప ఆశీర్వాదం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎర్రోజు గోపాల్ చారి, ఈదుల రవీందర్ రెడ్డి, మంద చక్రదర్ రెడ్డి, కట్ట ఎల్లా రెడ్డి, ముంజ భూపతి, ఎర్రోజు సత్యం,కొట్టె వెంకన్న, నాగసముద్రాల కృష్ణ, కర్ణాకర్ రెడ్డి, యాదన్న, జింకే రవి, కొయ్యడ రాజయ్య, గోడుగు హరి, శ్రీనివాస్, కొయ్యడ భాస్కర్,మెట్ట రాములు,రమేష్, బాల గౌడ్, రవి తేజ, భాను, రవి,రాజు,ప్రశాంత్, శేఖర్, అంజి, శ్రీనివాస్, రాకేష్, మహేష్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.
