కవ్వంపల్లి చిత్రపటానికి క్షీరాభిషేకం
న్యూస్ పవర్, 21 అక్టోబర్ , ఇల్లంతకుంట:
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నిర్వహణ కొరకు గాలి పెళ్లి సొసైటీ నుండి తాళ్ల పెళ్లి మహిళా సంఘానికి ఇప్పించిన మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ చిత్రపటానికి తాళ్ల పెళ్లి మహిళా సంఘం మహిళలు క్షీరాభిషేకం చేశారు. సోమవారం ఇల్లంతకుంట మండల కేంద్రంలో తాళ్ల పెల్లి ఓం సాయి మహిళాగ్రామైక్య సంఘం సభ్యులు, వివో సభ్యులు ఎమ్మెల్యే కవ్వంపల్లి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా తాళ్లపల్లి మహిళా మండలి సభ్యులు మాట్లాడుతూ మేము నిర్వహించాల్సిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గాలి పెళ్లి సొసైటీ వారు తీసుకోవడంతో మేము మాకు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ ని కలవడం జరిగింది అందుకు స్పందించిన ఎమ్మెల్యే మహిళలే నిర్వహించాలన్న ఉద్దేశంతో తాళ్ల పెళ్లి ఓం సాయి గ్రామైక్య సంఘానికి వరి ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వహణను ఇప్పించడం జరిగింది. ఈ శుభ సందర్భంగా తాళ్ల పెళ్లి ఓం సాయి గ్రామైక్య సంఘం మరియు వివో సంఘం మహిళా సభ్యులందరం కలిసి కృతజ్ఞతగా మంగళవారం ఎమ్మెల్యే కవంపల్లి చిత్రపటానికి క్షీరాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు సింగిరెడ్డి మాధవి, ఉపాధ్యక్షులు ఎలుక ఇందిరా, కార్యదర్శి ఎలుక బాలమని, సహాయ కార్యదర్శి బట్టు సంతోష, కోశాధికారి అబ్బు ఉమా, మండల కాంగ్రెస్ నాయకులు ఎలుక రామస్వామి, ఏఎంసి డైరెక్టర్ తిరుపతి గౌడ్, కాంగ్రెస్ నాయకులు బోడ కమలాకర్ రెడ్డి, మాడుగుల మహేందర్ రెడ్డి, గుర్రం ఆదిరెడ్డి, జేరిపోతు చంద్రయ్య, సింగిరెడ్డి అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
