రేణుక ఎల్లమ్మ గుడి వద్ద ప్రతి పౌర్ణమి రోజు అన్నప్రసాద వితరణ
న్యూస్ పవర్, 19 అక్టోబర్, ఇల్లంతకుంట:
ఇల్లంతకుంట గ్రామానికి చెందిన సుదగోని గౌడ వంశస్థులు ప్రతి నెల పౌర్ణమి రోజు శ్రీ రేణుక ఎల్లమ్మ గుడి వద్ద అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు.ఈ నిర్ణయాన్ని ఆదివారం గ్రామంలోని గౌడ సంఘ సభ్యుల సమక్షంలో తీసుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి పౌర్ణమికి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తామని కావున గ్రామస్తులందరూ అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.ఈ కార్యక్రమంలో సుదగోని మల్లయ్య గౌడ్, సుదగోని పరశురాం గౌడ్, సుదగోని ఆంజనేయులు గౌడ్, సుదగోని హనుమాండ్లు, సుదగోని నాగేంద్ర గౌడ్, సుదగోని సత్యనారాయణ, సుదగోని రాంబాబు, సుదుగోని సత్యనారాయణ, సుదగోని కమలాకర్ గౌడ సంఘ సభ్యులు పాల్గొన్నారు.
