ఇల్లంతకుంట లో బిసి బంద్ విజయవంతం
న్యూస్ పవర్ ,18 అక్టోబర్, ఇల్లంతకుంట:
బిసి జేఏసీ ఇచ్చిన పిలుపుమేరకు తెలంగాణ రాష్ట్ర బంద్ లో భాగంగా ఇల్లంతకుంట మండల కేంద్రంలో పార్టీలకతీతంగా బీసీ సంఘాల నేతలు బీసీ కులాల ఐక్యవేదిక నాయకులు కాంగ్రెస్ బిఆర్ఎస్ బిజెపి పార్టీల బీసీ నేతలు బందులో పాల్గొన్నారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలో వ్యాపారస్తులు బీసీ బందుకు సహకరించి స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేశారు.ఈ సందర్భంగా పలు పార్టీల నేతలు మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించేంతవరకు బీసీల పోరాటం కొనసాగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో బిసి బిల్లును ప్రవేశపెట్టి అమలు చేయాల్సిన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీని అమలు చేసి స్థానిక ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. బందులో స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేసిన బీసీలందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు పార్టీల నాయకులు బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
