• జడ్పీ మాజీ ఉపాధ్యక్షుడు సిద్ధం వేణు
న్యూస్ పవర్, అక్టోబర్, ఇల్లంతకుంట:
మాజీ శాసనసభ్యుడు రసమయి బాలకిషన్ ఇంటి పై కాంగ్రెస్ నాయకులు దాడులు చేసి పైశాచికానందం పొందుతున్నారని, కాంగ్రెస్ దమ్ము,ధైర్యం ఉంటే మీ ఎమ్మెల్యే ని ఫస్ట్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడమని చెప్పండని జడ్పీ మాజీ ఉపాధ్యక్షుడు సిద్ధం వేణు అన్నారు.
ఈ సందర్భంగా సిద్ధం వేణు మాట్లాడుతూ చేతకాని దద్దమ్మల లెక్క కాంగ్రెస్ గుండాలు రసమయి బాలకిషన్ ఇంటిపై దాడులు చేయడం మానుకోవాలని, మా బీఆర్ఎస్ సైన్యంతో కలిసి దాడులు చేయాలనుకుంటే కాంగ్రెస్ నాయకులు ఊర్లు వదిలి పరుగెత్తాల్సి వస్తుందని అన్నారు.
మానకొండూర్ నియోజకవర్గములో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని గ్రహించి స్థానిక ఎమ్మెల్యే సారధ్యంలోనే కాంగ్రెస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే ఇంటిపై, బీఆర్ఎస్ నాయకులపై దాడులకు పాల్పడుతున్నారని అన్నారు.
కాంగ్రెస్ నాయకులు దాడులకు తెగబడటం కాదు ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని, కాంగ్రెస్ నాయకులకు ప్రజల్లోకి వెళ్లే ముఖం లేకనే నిత్యం మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పై ఎదో ఒకటి కథ అల్లుతూ పబ్బం గడుపుతున్నారని దుయ్యబట్టారు.
కాంగ్రెస్ నాయకులు ఎన్ని నక్కజిత్తుల వేషాలు వేసిన ప్రజల్లో రసమయి బాలకిషన్ కి ఉన్న ఇమేజ్ ని డ్యామేజ్ చేయలేరని...తెలంగాణ ఉద్యమంలో సీమాంధ్ర నాయకులకు తన పాటతో దడపుట్టించిన నాయకుడని నిత్యం ప్రజల్లో మెదిలే నాయకుడు రసమయి బాలకిషన్ మాత్రమేనన్నారు.
ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఇప్పటికైనా మీ ప్రజాపాలనలో గుండాగిరి రాజ్యం చేయకండి మీరు ఇలాగే చేస్తే ప్రజలు మిమ్మల్ని, మీ నాయకుల్ని ఊర్లలోకి రానివ్వరని హెచ్చరించారు.
