రేపటి బంధు ను విజయవంతం చేద్దాం
• రేపు తెలంగాణ బంద్కు కాంగ్రెస్ మద్దతు
•యువజన కాంగ్రెస్ నియోజకవర్గ మాజీ అధ్యక్షులు అంతగిరి వినయ్ కుమార్
న్యూస్ పవర్,17 అక్టోబర్ , ఇల్లంతకుంట:
తెలంగాణ వ్యాప్తంగా రేపు తలపెట్టిన బంద్ విజయవంతం చేయాలని రేపటి బందుకు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మద్దతు ఉందాని స్వచ్ఛందంగా వ్యాపార ,వాణిజ్య సంఘాలు,పాఠశాలలు వారు బంద్ లో పాల్గొని సహకరించాలని కోరారు.
కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు 42 శాతం విద్యా, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్లు కల్పించేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేసిందన్నారు. ఈ మేరకు అసెంబ్లీలో బిల్లులను పాస్ చేసి ఆమోదం కోసం కేంద్రానికి పంపడం జరిగిందని గుర్తు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంలో కృత నిశ్చయంతో ముందుకు పోతున్న తరుణంలో హైకోర్టు స్టే రావడం బాధాకరమన్నారు. ప్రజలను మేల్కొలిపే విధంగా బీసీ సంఘాలు ఇచ్చిన బంద్కు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా సంఘీభావం తెలిపారని వెల్లడించారు.కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ప్రకటిస్తుందని తెలిపారు .
