రసమయి బాలకిషన్ ఇంటిని ముట్టడించిన కాంగ్రెస్ నాయకులు
న్యూస్ పవర్, 17 అక్టోబర్, ఇల్లంతకుంట:
మాజీ శాసనసభ్యుడు రసమయి బాలకిషన్ ఇంటిని ఇంటిని ముట్టడించడానికి బెజ్జంకి మండలం గుండారంలోని ఆయన ఫామ్ హౌస్ ను ముట్టడించి నిరసన తెలుపుతుండగా పోలీస్ వారు అక్కడి నుండి అరెస్టు చేసి బెజ్జంకి పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బెజ్జంకి మార్కెట్ కమిటీ చైర్మన్ పులి కృష్ణ, మానకొండూరు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు అంతగిరి వినయ్ కుమార్, నియోజకవర్గ అధికార ప్రతినిధి పసుల వెంకటి,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ప్రసాద్, డైరెక్టర్లు వీరేశం వీరేశం సురేందర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, ఫిషరీస్ చైర్మన్ జెట్టి మల్లేశం, సోషల్ మీడియా అధ్యక్షుడు కాసుపాక రమేష్, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ నాయకులు షాదీక్ ఉన్నారు.
