రసమయి దిష్టి బొమ్మ దగ్ధం
న్యూస్ పవర్ , 17 అక్టోబర్ , ఇల్లంతకుంట:
ఇల్లంతకుంట మండల కేంద్రంలో మాజీ శాసనసభ్యుడు రసమయి బాలకిషన్ దిష్టి బొమ్మను మండల కాంగ్రెస్ నాయకులు ఆధ్వర్యంలో దహనం చేయడం జరిగింది.ఈ సందర్బంగా యువజన కాంగ్రెస్ మానకొండూర్ నియోజకవర్గ మాజీ అధ్యక్షుడు అంతగిరి వినయ్ కుమార్ మాట్లాడుతూ మానకొండూర్ నియోజకవర్గ శాసనసభ్యుడు డా. కవ్వంపల్లి సత్యనారాయణ పై మరియు ఆయన కుటుంబ సభ్యలపై మాజీ శాసనసభ్యుడు రసమయి బాలకిషన్ అభ్యంతరకరమైన, దురుసుగా మాట్లాడిన తీరును సభ్య సమాజం ఖండిస్తుందని. ఇలాంటి మాటలు ఇంకోసారి గనుక మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ కి వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ మచ్చ రాజేశం, మాజీ ఎంపీటీసీ సభ్యుడు కరుణాకర్ రెడ్డి, మైనార్టీ సెల్ అధ్యక్షుడు జమల్, ఎస్ సి సెల్ జిల్లా నాయకులు జుట్టు నగేష్, ఫిషరీస్ చైర్మన్ జెట్టి మల్లేష్, సాయి వర్మ, మల్లయ్య, బడుగు లింగం,బంగారి ఆంజినేయులు,లక్ష్మన్, రవి, దయసాగర్, బాబు, చిక్కుడు సత్యం, రమేష్, శ్రీకాంత్, నర్సయ్య,కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
