కపాస్ యాప్ పరిశీలన
న్యూస్ పవర్, 16 అక్టోబర్ , ఇల్లంతకుంట:
ఇల్లంతకుంట మండలంలోని పొత్తూరు మరియు నర్సక్కపేట గ్రామాలలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీమతి అఫ్జల్ బేగం కిసాన్ కపాస్ అప్లికేషన్ పనితీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కిసాన్ కపాస్ యాప్ ద్వారా రైతులు పత్తి పంటను సిసిఐ ద్వారా విక్రయించటానికి ముందుగానే స్లాట్ బుక్ చేసుకోవచ్చని తెలిపారు. రైతులు ఈ సౌకర్యాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని సూచించారు.
అలాగే యాప్ వినియోగంలో ఏవైనా సాంకేతిక లేదా క్షేత్రస్థాయి సమస్యలు ఎదురైతే సమీపంలోని వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించి సందేహాలు నివృత్తి చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఎం. సురేష్ రెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారి లలిత, సంబంధిత గ్రామాల రైతులు పాల్గొన్నారు.
