Skip to main content

Posts

Showing posts from May, 2024

రైతులకు విత్తన కొనుగోలు పై అవగాహన

రైతులకు విత్తన కొనుగోలు పై అవగాహన  న్యూస్ పవర్, 31 మే , ఇల్లంతకుంట : రేపాక క్లస్టర్ లోని ఆరేపల్లి, తాళ్ళల పల్లి గ్రామాలలోని రైతులకు వానాకాలం విత్తన కొనుగోలు సమయంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మండల వ్యవసాయ అధికారి సురేష్ రెడ్డి  మరియు వ్యవసాయ విస్తరణ అధికారి రవళి అవగాహన సమావేశం నిర్వహించారు.ఇందులో భాగంగా రైతులు వ్యవసాయ శాఖ ద్వారా గుర్తింపు పొందిన అధీకృత డీలర్స్ దగ్గర మాత్రమే విత్తన కొనుగోలు చేయాలని సూచించారు.రైతులు విత్తనాలు కొనుగోలు చేసిన దుకాణం నుండి తప్పనిసరి రసీదు తీసుకోవలన్నారు. తీసుకున్న రసీదు మీద కంపెనీ పేరు ,విత్తన రకం, బ్యాచ్ నెంబర్ , లాట్ నెంబర్, రేటు ఉండాలని సూచించారు.విత్తన పాకెట్ మరియు బిల్లును పంట కాలం పూర్తయ్యే వరకు భద్రంగా దాచుకోవాలని తెలియజేశారు.సమావేశం లో గ్రామ రైతులు పాల్గొన్నారు.

రైతులకు విత్తన కొనుగోలు పై అవగాహన

రైతులకు విత్తన కొనుగోలు పై అవగాహన   న్యూస్ పవర్, 30 మే , ఇల్లంతకుంట : రేపాక క్లస్టర్ లోని సోమారంపేట,చింతల కుంట పల్లి గ్రామాలలోని రైతులకు వానాకాలం విత్తన కొనుగోలు సమయంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వ్యవసాయ విస్తరణ అధికారి రవళి అవగాహన సమావేశం నిర్వహించారు.ఇందులో భాగంగా రైతులు వ్యవసాయ శాఖ ద్వారా గుర్తింపు పొందిన అధీకృత డీలర్స్ దగ్గర మాత్రమే విత్తన కొనుగోలు చేయాలని సూచించారు.రైతులు విత్తనాలు కొనుగోలు చేసిన దుకాణం నుండి తప్పనిసరి రసీదు తీసుకోవలన్నారు. తీసుకున్న రసీదు మీద కంపెనీ పేరు ,విత్తన రకం, బ్యాచ్ నెంబర్ , లాట్ నెంబర్, రేటు ఉండాలని సూచించారు.విత్తన పాకెట్ మరియు బిల్లును పంట కాలం పూర్తయ్యే వరకు భద్రంగా దాచుకోవాలని తెలియజేశారు.సమావేశం లో గ్రామ రైతులు పాల్గొన్నారు.

దోస్తి మీట్ 2024 విజేతలుగా వంతడ్పుల, రేపాక

దోస్తి మీట్ 2024 విజేతలుగా వంతడ్పుల, రేపాక  న్యూస్ పవర్ , 28 మే , ఇల్లంతకుంట : ఇల్లంతకుంట పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో పోలీస్ గ్రౌండ్ లో గత నాలుగు రోజులుగా ఉత్కంఠ భరితంగా సాగుతున్న దోస్తీ క్రీడా పోటీలలో వాలీబాల్ విజేతగా వంతడ్పుల జట్టు, రన్నర్ గా రేపాక జట్టు. కబడ్డీ విజేతగా రేపాక జట్టు, రన్నర్ గా గాలిపల్లి జట్లు నిలిచాయి. ఈ దోస్తీ మీట్ బహుమతుల ప్రధానోత్సవానికి సిరిసిల్ల రూరల్ సీఐ సదన్ కుమార్  ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇల్లంతకుంట ఎస్సై లింగంపల్లి రాజు తో కలిసి విజేతలుగా నిలిచిన జట్లకు పదివేల రూపాయలు ప్రైజ్ మనీ తో పాటు ట్రోఫీ, మెడల్స్, రన్నర్ గా నిలిచిన జట్లకు ఐదువేల రూపాయలతో పాటు ట్రోఫీ, మెడల్స్ అందించారు. ఈ సందర్భంగా సీఐ సదన్ కుమార్  ఎస్సై లింగంపల్లి రాజు మాట్లాడుతూ క్రీడల్లో గెలుపోటములు సహజమని గెలిచిన ఓడిన ముందుకు సాగాలన్నారు. యువత చదువుతో పాటు క్రీడల్లో కూడా ముందు ఉండాలని, పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ దోస్తీ మీట్ 2024 కు మంచి స్పందన లభించిందని, అలాగే ప్రతి సంవత్సరం ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహిస్తామని తెలిపారు మండల క్రీడాకారుల నుండి ఇంత మంచి స్పందన ర...

ముస్కాన్ పేటలో రైతులకు అవగాహన సదస్సు

ముస్కాన్ పేటలో రైతులకు అవగాహన సదస్సు  న్యూస్ పవర్ , 28 మే , ఇల్లంతకుంట : విత్తనాల కొనుగోలు విషయంలో రైతులు  జాగ్రత్త తీసుకోవాలని  మండల వ్యవసాయ అధికారి సురేష్ రెడ్డి అన్నారు ముస్కాన్ పేట గ్రామంలో ఏర్పాటు చేసిన  అవగాహన సదస్సులు ఆయన మాట్లాడుతూ   లూజుగా ఉన్న సంచులలో ఉన్న విత్తనాలను కొనుగోలు చేయరాదని ,  రైతులు విత్తనాలు కొనుగోలు చేసిన దుకాణం నుంచి రసీదులు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు , విత్తన ప్యాకెట్ మరియు బిల్లును పంటకాలం పూర్తయ్యే వరకు భద్రంగా దాచుకోవాలనీ,  వ్యవసాయ శాఖ ద్వారా గుర్తింపు పొందిన అధికృత డీలర్ల దగ్గర మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలనీ  కొనుగోలు రసీదు మీద విత్తన కంపెనీ పేరు దాని రకం బ్యాచ్ నెంబర్ ప్లాట్ నెంబర్ రేటు తయారైన తేదీ ముగిసిన తేదీ వంటివి ఉన్నాయా లేదా సరిచూసుకోవాలని సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో  వ్యవసాయ విస్తరణ అధికారి గంగా  గ్రామ కార్యదర్శి రాజయ్య  కారోబార్ ప్రకాష్ రైతులు పాల్గొన్నారు.

సన్న వడ్లకు బోనస్.. ఒక బోగస్ పథకం

సన్న వడ్లకు బోనస్.. ఒక బోగస్ పథకం • బిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం మండల అధ్యక్షుడు బుర్ర సూర్య గౌడ్  న్యూస్ పవర్, 28 మే , ఇల్లంతకుంట : రైతు పండించిన ప్రతి గింజాకు 500 రూపాయల బోనస్ ఇస్తాం   అని దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రైతులను నట్టేట ముంచి  అన్యాయం చేస్తుంది అని బిఆర్ఎస్ పార్టీ యూత్ మండల అధ్యక్షుడు బుర్ర సూర్య గౌడ్ పేర్కొన్నారు మంగళ వారం రోజు మండల కేంద్రంలో విలేఖరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మరోసారి రైతు వ్యతిరేక ప్రభుత్వం గా నిరూపితం అయ్యింది అని అన్నారు, రైతు పండించిన ప్రతి  క్వింటాలికి బోనస్ ఇవ్వాలని లేని పక్షంలో బిఆర్ఎస్ పార్టీ తరపున పెద్ద ఎత్తున రైతులతో కలసి నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు  ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ప్రశాంత్ రెడ్డి, బాలకిషన్, బుర్ర స్వామి చరణ్ ,గుంటి మందు తదితరులు పాల్గొన్నారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి  న్యూస్ పవర్ , 17 మే , ఇల్లంతకుంట : ఉరుములు, పిడుగులతో కురుస్తున్న వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలనీ ఇల్లంతకుంట ఎస్సై ఎల్ రాజు తెలిపారు  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఉరుములు, పిడుగులతో కురుస్తున్న వర్షాల దృష్ట్యా  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,వర్షం పడుతున్న సమయంలో ఎవరు కూడా చెట్ల కిందకు,బయటకు వెళ్లవద్దని చెట్ల మీద పిడుగులు పడే అవకాశం ఎక్కువ ఉంటుందని అన్నారు.గురువారం రోజున అకస్మాత్తుగా పిడుగులు పడడంతో జిల్లాలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారని,వర్షాలు కురుస్తున్న సమయంలో ఎవరు కూడా బయటకు వెళ్లవద్దని ఈదురు గాలులకు విద్యుత్ తీగలు కూడా తెగి మీదపడి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందన్నారు.అంతేకాక వర్షాల దృష్ట్యా వాగులు, చెరువులు కుంటలు నిండుకుండ లాగా ఉంటాయి కావున చెరువులు, కుంటలు వద్దకు పిల్లలు,యువత ఎవరూ వెళ్ళొద్దన్నారు.ప్రజలు అప్రమత్తంగా ఉంటూ తక్షణ సహాయం కోసం కు డయల్100 సమాచారం ఇవ్వాలని కోరారు.

వెలిశాల రాజేందర్ రావు ని ఆశీర్వదించండి

వెలిశాల రాజేందర్ రావు ని ఆశీర్వదించండి • ఎంపీపీ వుట్కూరి వెంకటరమణారెడ్డి   న్యూస్ పవర్ , 11 మే , ఇల్లంతకుంట : పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో  భాగంగా  ఇల్లంతకుంట మండలంలోని వెంకట్రావుపల్లి గ్రామంలో ఎంపీపీ వుట్కూరి వెంకటరమణారెడ్డి  ఉపాధిహామీ కూలీల దగ్గరికి వెళ్లి వారి యోగ క్షేమలు తెలుసుకున్నరు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్న తీరుతెన్నులు తెలియజేస్తూ దేశములో కాంగ్రేస్ గెలిస్తే రాహుల్ గాంధీ ప్రధాని అవుతారనీ పాంచ్ న్యాయ్ లను అమలుపరచడమే కాకుండా తెలంగాణకు ప్రత్యేక మేనిఫెస్టో ఇచ్చారనీ తెలిపారు   ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు కనకరాజు , లవరెడ్డి, వెంకటేశ్ , ప్రశాంత్, చంద్రమౌళి, కిష్టస్వామి, మల్లేశం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.

ప్రతి ఒక్క ఓటరు ఒక కాన్షీరాం లాగా వ్యవహరించాలి,

ప్రతి ఒక్క ఓటరు ఒక కాన్షీరాం లాగా వ్యవహరించాలి,   న్యూస్ పవర్, 10 మే , ఇల్లంతకుంట :  పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా బహుజన సమాజ్ పార్టీ  మండల అధ్యక్షుడు అమర్ మాట్లాడుతూ గతంలో కొన్ని పార్టీ లు రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేయగా మాన్యశ్రీ కాన్షిరాం  బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో భారీ జన శక్తి ప్రదర్శన చేసి అప్పటి ప్రభుత్వానికి ఒక హెచ్చరిక జారీ చేయడం ద్వారా రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నాన్ని అప్పటి ప్రభుత్వాలు వెనిక్కి తీసుకోవడం జరిగిందని గుర్తు చేశారు.ఇప్పుడు ప్రతి ఒక్క కాన్షిరామ్  విధానాన్ని అనుసరించి రాజ్యాంగాన్ని కాపాడాలని కోరారు.అన్ని పార్టీలు కలిసి రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నాన్ని ప్రజలు ఓటుతో తిప్పి కొట్టాలని సూచించారు.బహు జన్ సమాజ్ పార్టీ కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థి అయినటువంటి మారేపల్లి మొగిలయ్య గారిని గెలిపించి రాజ్యాంగ సంరక్షణలో బలమివ్వాలని ఓటర్లను కోరడం జరిగింది.

బైక్ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ

బైక్ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ  న్యూస్ పవర్ , 10 మే , ఇల్లంతకుంట : కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు  ఎన్నికల ప్రచారంలో భాగంగా మానకొండూర్ నియోజవర్గం ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ అధ్వర్యంలో వల్లంపట్ల నుండి ఇల్లంతకుంట వరకు నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొన్న కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, మానకొండూరు నియోజకవర్గ శాసనసభ్యుడు డా.కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గోన్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీ అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని కోరారు 

ఎల్వోసి అందజేత

ఎల్వోసి అందజేత  న్యూస్ పవర్, 10 మే , ఇల్లంతకుంట : ఇల్లంతకుంట మండలం  వెల్జిపురం గ్రామానికీ  చెందిన  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గొల్లకోమటి బాలయ్య వెన్నుపూస నొప్పితో బాధపడుతూ నిమ్స్ హాస్పిటల్ లో చేరగా ముందస్తు వైద్య ఖర్చుల నిమిత్తం 2లక్షల ఎల్వో సి  ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ   అందజేయడం జరిగింది  వారి కుటుంబ సభ్యులు వెల్జీపురం కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు తెలియజేశారు  ఈ కార్యక్రమంలో ఎంపీపీ వూట్కూరి వెంకట రమణ రెడ్డి , మాజీ ఎంపీపీ గుడిసె ఐలయ్య , వెల్జిపురం మాజీ సర్పంచ్ గుండ వెంకటేశం  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కంకణాల రాంప్రసాద్ రెడ్డి, బొజ్జ శ్రీనివాస్, న్యాత అశోక్, రంగు రజిని, తదితర నాయకులు పాల్గొన్నారు.

గాలిపల్లి లో దంతవైద్య శిబిరం

గాలిపల్లి లో దంతవైద్య శిబిరం  న్యూస్ పవర్, 10 మే , ఇల్లంతకుంట : ఇల్లంతకుంట మండలం లోని గాలిపల్లి పల్లె దవాఖానాలో నిర్వహించిన దంతవైద్య శిబిరంలో గ్రామస్తులు విరివిగా పాల్గొని తమ దంత సంబంధిత రుగ్మతలకు డాక్టర్ తో చెకప్ చేసుకొని సలహాలు, సూచనలు, తగిన జాగ్రత్తలు చెప్పడం జరిగింది మరియు ఉచితంగా మందులు ఇవ్వడం జరిగింది అవసరమైన వారికి శస్త్ర చికిత్స నిమిత్తం జిల్లా దంతవైద్య నిపుణుల వద్దకు రిఫర్ చేయడం జరిగింది  ఈ శిబిరానికి దాదాపు  60 మంది గ్రామస్తులు చేకప్ చేసుకున్నారు ఈ శిబిరాన్ని  తమ గ్రామంలో నిర్వహించడం తమకు ఎంతగానో తోడ్పాటుగా ఉందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు ఇట్టి శిబిరానికి జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు,అదనపు జిల్లా వైద్యాధికారి డాక్టర్ వసంతరావు , ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ నయీం జహ  విచ్చేసి పరిశీలించారు ఇట్టి కార్యక్రమంలో డాక్టర్ సారా దంతవైద్య నిపుణులు, మరియుపల్లె దవాఖాన డాక్టర్ కట్ట రమేష్ , ఎన్ హెచ్ ఏ ఓ ఆంజనేయులు ,హెచ్ ఈ ఓ లింగం, హెచ్ ఎస్ శోభారాణి,ఏఎన్ఎం బీ.ఆర్. సులోచన, కవిత మరియు ఆశ కార్యకర్తలు లక్ష్మి, సరిత, భారతి, రాజమణి, అనిత, కార్య...

వెలిశాల రాజేందర్ రావు నీ గెలిపించండి

వెలిశాల రాజేందర్ రావు నీ గెలిపించండి   న్యూస్ పవర్ , 9 మే , ఇల్లంతకుంట : పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో  భాగంగా  ఇల్లంతకుంట మండలంలోని సోమారంపేట  గ్రామంలో  వడ్ల కొనుగోలు సెంటర్లో హమాలీలకు మరియు ఉపాధి హామీ కూలీలకు  మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమం మండల కిసాన్ సెల్ అధ్యక్షుడు సురేందర్ రెడ్డి  ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది.కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్న తీరుతెన్నులు తెలియజేస్తూ దేశములో కాంగ్రేస్ గెలిస్తే రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు పాంచ్ న్యాయ్ లను అమలుపరచడమే కాకుండా తెలంగాణకు ప్రత్యేక మేనిఫెస్టో ఇచ్చారు. ఈ కార్యక్రమంలో  ఆదిరెడ్డి, నరసింహారెడ్డి, మల్లారెడ్డి, రాజేందర్ రెడ్డి, కోటేశ్వర్ రెడ్డి, సత్తిరెడ్డి, వివిధ సంఘాల అధ్యక్షులు , కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు పాల్గొన్నారు.

కారు గుర్తుకు ఓటు వేయాలని గడప-గడపకు ప్రచారం

కారు గుర్తుకు ఓటు వేయాలని గడప-గడపకు ప్రచారం  న్యూస్ పవర్ , 9 మే , ఇల్లంతకుంట :  ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామంలో కరీంనగర్ పార్లమెంట్  బిఆర్ఎస్  పార్టీ అభ్యర్థి  బోయినిపెల్లి వినోద్ కుమార్ గుర్తు కారు కు తేది:13-05-2024 సోమవారం రోజున  ఓటు కారు  గుర్తుకు వేసి బోయినిపెల్లి వినోద్ నీ అత్యధిక మెజారిటీతో గెలిపీయాలని గ్రామంలో గడప గడపకు వెళ్లి ప్రచారం నిర్వహించడం జరిగింది  ఈ కార్యక్రమంలో నాయకులు మాతిరెడ్డి కిషన్ రెడ్డి,మీసరగండ్ల అనిల్ కుమార్,బొప్ప శ్రీనివాస్,కేతిరెడ్డి సుధాకర్ రెడ్డి,పసుల బాబు,పసుల బాల్ రాజ్,దుమాల శ్రీకాంత్ ,జక్కుల శ్రీనివాస్,పసుల యాదగిరి మహిళలు దుమాల భారతి,గాదె గోదావరి,శిరవేణి ఎల్లవ్వ,చుక్కపద్మ,జంగింటి దివ్య,కడారి రేణుక,అంబటి లక్షిత,దుమాల అనిత తదితరులు పాల్గొన్నారు.

వినోద్ కుమార్ ని భారీ మెజారిటీ తో గెలిపించండి

వినోద్ కుమార్ ని భారీ మెజారిటీ తో గెలిపించండి  -  వైస్ ఎం. పి. పి సుదగోని శ్రీనాథ్ గౌడ్   న్యూస్ పవర్ , 3 మే , ఇల్లంతకుంట : ఇల్లంతకుంట మండలం రహీంఖాన్ పేట గ్రామంలో కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ కి మద్దతుగా  ఇల్లంతకుంట మండల వైస్ ఎం.పి. పి సుదగోని శ్రీనాథ్ గౌడ్ , మాజీ సర్పంచ్ బిలవేణి పర్శరాములు, బీ ఆర్ ఎస్ నాయకులు ఇంటి ఇంటి ప్రచారం నిర్వహించారు  ఈ సందర్బంగా శ్రీనాథ్ గౌడ్ మాట్లాడుతూ కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ ని భారీ మెజారిటీ తో గెలిపించాలని కోరారు పార్లమెంట్ లో ప్రశ్నించే గొంతు  వినోద్ కుమార్  అని అన్నారు.. 2014 నుండి 2019 వరకు 102 చర్చల్లో 550 కి పైగా అత్యధిక ప్రశ్నలు అడిగిన వ్యక్తి వినోద్ కుమార్  అని అన్నారు..కరీంనగర్ కి స్మార్ట్ సిటీ తెచ్చి వెయ్యి కోట్ల రూపాయలతో కరీంనగరాన్ని అభివృద్ధి చేసింది వినోద్ కుమార్  అని అన్నారు . కరీంనగర్ చుట్టూ జాతీయ రహదారులను తీసుకు వచ్చింది వినోద్ కుమార్  అని అన్నారు.. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం ని అన్ని వి...