గాలిపల్లి లో దంతవైద్య శిబిరం
న్యూస్ పవర్, 10 మే , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండలం లోని గాలిపల్లి పల్లె దవాఖానాలో నిర్వహించిన దంతవైద్య శిబిరంలో గ్రామస్తులు విరివిగా పాల్గొని తమ దంత సంబంధిత రుగ్మతలకు డాక్టర్ తో చెకప్ చేసుకొని సలహాలు, సూచనలు, తగిన జాగ్రత్తలు చెప్పడం జరిగింది మరియు ఉచితంగా మందులు ఇవ్వడం జరిగింది అవసరమైన వారికి శస్త్ర చికిత్స నిమిత్తం జిల్లా దంతవైద్య నిపుణుల వద్దకు రిఫర్ చేయడం జరిగింది ఈ శిబిరానికి దాదాపు 60 మంది గ్రామస్తులు చేకప్ చేసుకున్నారు ఈ శిబిరాన్ని తమ గ్రామంలో నిర్వహించడం తమకు ఎంతగానో తోడ్పాటుగా ఉందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు ఇట్టి శిబిరానికి జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు,అదనపు జిల్లా వైద్యాధికారి డాక్టర్ వసంతరావు , ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ నయీం జహ విచ్చేసి పరిశీలించారు ఇట్టి కార్యక్రమంలో డాక్టర్ సారా దంతవైద్య నిపుణులు, మరియుపల్లె దవాఖాన డాక్టర్ కట్ట రమేష్ , ఎన్ హెచ్ ఏ ఓ ఆంజనేయులు ,హెచ్ ఈ ఓ లింగం, హెచ్ ఎస్ శోభారాణి,ఏఎన్ఎం బీ.ఆర్. సులోచన, కవిత మరియు ఆశ కార్యకర్తలు లక్ష్మి, సరిత, భారతి, రాజమణి, అనిత, కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు.
0 Comments