రైతులకు విత్తన కొనుగోలు పై అవగాహన
న్యూస్ పవర్, 31 మే , ఇల్లంతకుంట :
రేపాక క్లస్టర్ లోని ఆరేపల్లి, తాళ్ళల పల్లి గ్రామాలలోని రైతులకు వానాకాలం విత్తన కొనుగోలు సమయంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మండల వ్యవసాయ అధికారి సురేష్ రెడ్డి మరియు వ్యవసాయ విస్తరణ అధికారి రవళి అవగాహన సమావేశం నిర్వహించారు.ఇందులో భాగంగా రైతులు వ్యవసాయ శాఖ ద్వారా గుర్తింపు పొందిన అధీకృత డీలర్స్ దగ్గర మాత్రమే విత్తన కొనుగోలు చేయాలని సూచించారు.రైతులు విత్తనాలు కొనుగోలు చేసిన దుకాణం నుండి తప్పనిసరి రసీదు తీసుకోవలన్నారు. తీసుకున్న రసీదు మీద కంపెనీ పేరు ,విత్తన రకం, బ్యాచ్ నెంబర్ , లాట్ నెంబర్, రేటు ఉండాలని సూచించారు.విత్తన పాకెట్ మరియు బిల్లును పంట కాలం పూర్తయ్యే వరకు భద్రంగా దాచుకోవాలని తెలియజేశారు.సమావేశం లో గ్రామ రైతులు పాల్గొన్నారు.
0 Comments