సన్న వడ్లకు బోనస్.. ఒక బోగస్ పథకం
• బిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం మండల అధ్యక్షుడు బుర్ర సూర్య గౌడ్
న్యూస్ పవర్, 28 మే , ఇల్లంతకుంట :
రైతు పండించిన ప్రతి గింజాకు 500 రూపాయల బోనస్ ఇస్తాం అని దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రైతులను నట్టేట ముంచి అన్యాయం చేస్తుంది అని బిఆర్ఎస్ పార్టీ యూత్ మండల అధ్యక్షుడు బుర్ర సూర్య గౌడ్ పేర్కొన్నారు మంగళ వారం రోజు మండల కేంద్రంలో విలేఖరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మరోసారి రైతు వ్యతిరేక ప్రభుత్వం గా నిరూపితం అయ్యింది అని అన్నారు, రైతు పండించిన ప్రతి క్వింటాలికి బోనస్ ఇవ్వాలని లేని పక్షంలో బిఆర్ఎస్ పార్టీ తరపున పెద్ద ఎత్తున రైతులతో కలసి నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ప్రశాంత్ రెడ్డి, బాలకిషన్, బుర్ర స్వామి చరణ్ ,గుంటి మందు తదితరులు పాల్గొన్నారు.
0 Comments