JSON Variables

దోస్తి మీట్ 2024 విజేతలుగా వంతడ్పుల, రేపాక

దోస్తి మీట్ 2024 విజేతలుగా వంతడ్పుల, రేపాక
 న్యూస్ పవర్ , 28 మే , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో పోలీస్ గ్రౌండ్ లో గత నాలుగు రోజులుగా ఉత్కంఠ భరితంగా సాగుతున్న దోస్తీ క్రీడా పోటీలలో వాలీబాల్ విజేతగా వంతడ్పుల జట్టు, రన్నర్ గా రేపాక జట్టు. కబడ్డీ విజేతగా రేపాక జట్టు, రన్నర్ గా గాలిపల్లి జట్లు నిలిచాయి. ఈ దోస్తీ మీట్ బహుమతుల ప్రధానోత్సవానికి సిరిసిల్ల రూరల్ సీఐ సదన్ కుమార్  ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇల్లంతకుంట ఎస్సై లింగంపల్లి రాజు తో కలిసి విజేతలుగా నిలిచిన జట్లకు పదివేల రూపాయలు ప్రైజ్ మనీ తో పాటు ట్రోఫీ, మెడల్స్, రన్నర్ గా నిలిచిన జట్లకు ఐదువేల రూపాయలతో పాటు ట్రోఫీ, మెడల్స్ అందించారు. ఈ సందర్భంగా సీఐ సదన్ కుమార్  ఎస్సై లింగంపల్లి రాజు
మాట్లాడుతూ క్రీడల్లో గెలుపోటములు సహజమని గెలిచిన ఓడిన ముందుకు సాగాలన్నారు. యువత చదువుతో పాటు క్రీడల్లో కూడా ముందు ఉండాలని, పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ దోస్తీ మీట్ 2024 కు మంచి స్పందన లభించిందని, అలాగే ప్రతి సంవత్సరం ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహిస్తామని తెలిపారు మండల క్రీడాకారుల నుండి ఇంత మంచి స్పందన రావడం అభినందనీయమన్నారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి చదువుతో పాటు క్రీడల్లో రాణించి మీకు మీ కుటుంబానికి, మన మండలానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. వాలీబాల్ కు 20 జట్లు, కబడ్డీ కి 16 జట్లు పాల్గొన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఈటి లు సాన బాబు, మామిడి శ్రీనివాస్, శ్రీనివాస్, నాగరాజు, పోలీస్ సిబ్బంది, క్రీడాకారులు, యువత, మండల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Post a Comment

0 Comments