Skip to main content

Posts

Showing posts from September, 2023

రైతులు ఆర్నెళ్ల కొకసారి వడ్డీ ఎందుకు చెల్లించాలి??*

రైతులు ఆర్నెళ్ల కొకసారి వడ్డీ ఎందుకు చెల్లించాలి??       - బద్దం.ఎల్లారెడ్డి గాలిపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సర్వసభ్య సమావేశంలో రసాభస న్యూస్ పవర్ , 30 సెప్టెంబర్ , ఇల్లంతకుంట : గాలిపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సర్వసభ్య సమావేశంలో బద్దం ఎల్లారెడ్డి అనే యువరైతు మాట్లాడుతూ రైతులు తీసుకున్న పంట రుణంపై రైతుల వద్ద అరునెలకొకసారి వడ్డీ వసూలు చేస్తున్నారని..గత మూడు సర్వసభ్య సమావేశాలకు బ్యాంక్ మేనేజర్ ఎందుకు హాజరు కావడం లేదని ప్రశ్నించగా అధ్యక్షుడు అన్నాడి అనంత రెడ్డి  మాట్లాడుతూ మాకున్న సర్క్యులర్ ప్రకారం మాకున్న ఆదేశాల ప్రకారం వడ్డీ వసూలు చేస్తున్నామని చెప్పగా మీదగ్గర ఉన్న సర్క్యులర్ మా రైతులకు చూపించాలని రైతులు మండి పడ్డారు. పక్కన ఉన్న సిద్దిపేట జిల్లాలో రైతులు ఏడాదికి ఒక్కసారే వడ్డీ చెల్లిస్తున్నారు.ఇక్కడే ఎందుకు రైతులను ఇబ్బంది పెడుతున్నారని రైతులందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే  జిల్లా బాడీ మీటింగ్ లో ఇట్టి విషయాన్ని ఎందుకు ప్రస్తావించడం లేదని అడుగగా అక్కడ మమ్మల్ని మాట్లాడనివ్వడం లేదని సమాధానం ఇవ్వడం విడ్డూరం. రైతుల వడ్లు కొనేటప్పుడు చాలా దారుణంగా ఒక క్వి...

బీజేపీ నాయకులను, మహిళలను అక్రమంగా అరెస్ట్ చెయ్యడం అప్రజాస్వామికం

 బీజేపీ నాయకులను, మహిళలను అక్రమంగా అరెస్ట్ చెయ్యడం అప్రజాస్వామికం న్యూస్ పవర్ , 30 సెప్టెంబర్ , ఇల్లంతకుంట: ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామంలో మానకొండూర్ నియోజకవర్గ శాసన సభ్యుడు రసమయి బాలకిషన్  పర్యటిస్తున్న నేపథ్యంలో గ్రామానికి చెందిన బీజేపీ నాయకులను, గ్రామస్తులను అరెస్ట్ చేయడం పట్ల బీజేపీ మండల అధ్యక్షుడు నాగసముద్రాల సంతోష్ తీవ్రంగా ఖండించారు. గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూం ఇండ్ల కేటాయింపులో జరిగిన అన్యాయాన్ని ఎమ్మెల్యే కి విన్నవించుకొనే అవకాశం కూడా కల్పించకుండా ముందస్తు అరెస్ట్ లు సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలచే ఎన్నుకోబడిన ఎమ్మెల్యే ప్రజా సమస్యలను వినే  స్థితిలో  లేరని సమస్యలపై ప్రజలు ప్రశ్నిస్తారనే అభద్రత భావంతో అధికార బలంతో అక్రమ అరెస్ట్ చేపించడం సరికాదన్నారు.  ప్రజల నుండి వస్తున్న సమస్యలను విని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి తప్ప వారిని అరెస్ట్ చూపిస్తూ ఇబ్బందులకు గురి చేయడం ఒక ప్రజాప్రతినిధిగా సరికాదన్నారు. వెంటనే బిజెపి నాయకులను, గ్రామస్థులను విడుదల చేయాలని  డిమాండ్ చేశారు, ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర...

మహిళలు స్వయం ఉపాధులు వినియోగించుకోవాలి

మహిళలు స్వయం ఉపాధులు  వినియోగించుకోవాలి  న్యూస్ పవర్ , 29 సెప్టెంబర్ , ఇల్లంతకుంట : స్వశక్తి సంఘ సభ్యులు ఆర్థికంగా ఎదగడానికి బ్యాంకు లింకేజి ఋణం, స్త్రీనిధి, గ్రామ సంఘాల ద్వారా ఋణాలు పొందుతూ కిరాణం,హోటల్, పిండి గిర్ని,చికెన్ సెంటర్, గొర్రెలు, మేకలు, గేదెలు, లాంటి జీవనోపాదులు (ఎంటర్ ప్రైజెస్)  ఏర్పాటు చేసుకుంటున్నారు. సెర్ప్ టీమ్ ఈ రకంగా నెలకొల్పబడిన ఎంటర్ ప్రైజెస్ ని ఈరోజు వెంకట్రావ్ పల్లి, ముస్కాన్ పేట గ్రామాలను సందర్శించి వెరిఫికేషన్ చేయడం జరిగింది.  గ్రామాల్లో మహిళలు జీవనోపాదుల ద్వారా ఆదాయం పొందుతూ అభివృద్ధి చెందుతున్న విధానం పట్ల సంత్రృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వెరిఫికేషన్ అధికారి ఏడీఆర్డీఓ సుధీర్, సర్పంచ్ సుశీల, డీపీయం సుధారాణి, ఏపీయం లు శ్రీనివాస్, వాణిశ్రీ, సీసీలు రాజేశ్వరి, రాంచంద్రారెడ్డి,వెంకటేశం, సదయ్య పాల్గొన్నారు.

ఎమ్మెల్యే పిఏ గా ఏనుగుల మహేందర్ నియామకం

ఎమ్మెల్యే పిఏ గా ఏనుగుల మహేందర్ నియామకం  న్యూస్ పవర్,28 సెప్టెంబర్ , ఇల్లంతకుంట :  మానకొండూర్ ఎమ్మెల్యే, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్  ప్రయివేట్ (పిఏ) గా ఇల్లంతకుంట మండలం రహీంఖాన్ పేట గ్రామానికి చెందిన ఏనుగుల మహేందర్ ని నియామకం చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.

భగత్ సింగ్ స్ఫూర్తితో విద్యార్థులు, యువత ఉద్యమించాలి

 భగత్ సింగ్ స్ఫూర్తితో విద్యార్థులు, యువత ఉద్యమించాలి  న్యూస్ పవర్, 28 సెప్టెంబర్ , ఇల్లంతకుంట : ఇల్లంతకుంట మండల యువత అధ్వర్యంలో బస్టాండ్ అవరణలో భగత్ సింగ్ 116వ జయంతిని పునస్కరించుకొని షాహిద్ భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నిర్వహించి నివాళలర్పించారు. మా దేహం ముక్కలైన ఈ దేశాన్ని ముక్కలు కానివ్వం ‌అనే నినాదంతో భారతదేశ ప్రజల్లో గొప్ప చైతన్యం తీసుకువచ్చిన స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ గారు అని అన్నారు. చిన్న వయసులోనే బ్రిటిష్ ‌ వారి పార్లమెంటు మీద పొగ బాంబు వేసి బ్రిటిష్  వారిని గడగడలాడించిన్న గొప్ప వ్యక్తి భగత్ సింగ్ మా దేశం నుండి మీరు వెళ్లిపోవాలని బ్రిటిష్ వారిని హెచ్చరించిన వీరుడు భగత్ సింగ్ అని అన్నారు. 16 సం "ల వయస్సులోనే ఉరితాడుని ముద్దాడిన భగత్ సింగ్ నేటితరం యువత విద్యార్థులు వారి యొక్క పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని వారి ఆశయాల కోసం ముందుకు నడవాలని వారు పిలుపునిచ్చారు.  ఈ కార్యక్రమంలో మండల యువజన విభాగం నాయకుడు మంద అనిల్ కుమార్, పైస మోజెస్, ఎర్రోజు సంతోష్,గొడుగు నరేందర్,ఒగ్గు మధు,ఎలుక అనిల్,రాయినిపట్ల రాజు,దాసరి శివరాం,ఎండ్ర నరేష్,నరేష్...

ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో గణేష్ ఉత్సవాలను జరుపుకోవాలి

ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో గణేష్ ఉత్సవాలను జరుపుకోవాలి  • ఢీజే లు పెడితే జైలుకే  సిరిసిల్ల రూరల్ సిఐ. సదన్ కుమార్ • నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేశాం ఎంపిడిఓ,తహశీల్దార్, ఎస్సై న్యూస్ పవర్ , 26 సెప్టెంబర్ , ఇల్లంతకుంట : గణేష్ నవరాత్రి ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని సిరిసిల్ల రూరల్ సీఐ.సదన్ కుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం ఇల్లంతకుంట మండల కేంద్రంలోని వైశ్య భవన్ లో గణేష్ ఉత్సవాల సందర్భంగా మండపాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటన లు చోటుచేసుకోకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రతీ వినాయక విగ్రహాన్ని జియో టాగింగ్ చేయడం జరిగింది అని, గణేష్ ఉత్సవాలు సజావుగా సాగేందుకు పోలీస్ శాఖ వారి సూచనలు పాటించి సహకరించాలన్నారు.గణేష్ ఉత్సవాల్లో ఎలాంటి డీజే లకు అనుమతి లేదని నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీస్ నిబంధనలను ఉల్లంఘిస్తూ శాంతిభద్రతలకు విగుతం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని,ఎవరు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించవద్ద...

తైక్వాండోలో రాణించిన గణేష్

తైక్వాండోలో రాణించిన గణేష్ న్యూస్ పవర్, 25 సెప్టెంబర్ , ఇల్లంతకుంట : ఇల్లంతకుంట మండల కేంద్రంలోని   వాణీనికేతన్ హైస్కూల్ విద్యార్థి ఎస్ పీ గణేష్   రాష్ట్రాస్థాయి తైక్వాండో పోటీలలో  ద్వితీయ స్థానం సాధించాడు. వాణీనికేతన్ పాఠశాలలో నాలుగవ తరగతి చదువుతున్న గణేష్ వరంగల్ లో జరిగిన రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలలో పాల్గొన్నాడు. తైక్వాండో లోని పూమ్స్ విభాగంలో ఉత్తమ ప్రదర్శన కవబరిచి ద్వితీయ స్థానంలో నిలిచాడు. పాఠశాల ఆవరణలో సోమవారం జరిగిన కార్యక్రమంలో కరాటే మాస్టర్ చింతలతాడెం శరత్, ప్రతిభకనబర్చిన విద్యార్థి గణేష్ లను కరస్పాండెంట్ తూమకుంట శ్రీనివాస్ రెడ్డి, ప్రిన్సిపాల్ శ్రీనిధిలు అభినందించారు.

రాష్ట్ర ప్రభుత్వం దళితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి

రాష్ట్ర ప్రభుత్వం దళితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి • మండల దళిత మోర్చా ఆధ్వర్యంలో ధర్నా • దళితబంధు అమలు కోసం లక్ష కోట్లు అయినా ఖర్చు చేస్తానన్న కేసీఆర్‌ హామీ ప్రకారం ఇవ్వడానికి ఎందుకు వెనుకాడుతున్నావ్ • దళితుల ఓట్లను పొందేందుకు కేసీఆర్ దళిత బంధు పేరుతో మోసం • టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మద్దతులకే దళిత బంధిస్తున్నారని ఆరోపణ  • బీజేపీదళిత మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుమ్మరి శంకర్ , రాష్ట్ర నాయకులు దరువు ఎల్లన్న న్యూస్ పవర్ , రాజన్న సిరిసిల్ల జిల్లా : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలని డిమాండ్ చేస్తూ మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండల కేంద్రంలో మండలంలో మండల దళిత మోర్చా ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దళిత మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుమ్మరి శంకర్ హాజరయ్యి దళితులపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితబంధు అమలు కోసం లక్ష కోట్లు అయినా ఖర్చు చేస్తానన్న కేసీఆర్‌ ఇచ్చిన హామీ ప్రకారం దళిత బంధు ఇవ్వడానికి ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నించారు. అనంతరం రాష్ట్ర నాయకుడు దరువు ఎల్లన్న మాట్లా...

ఈ పంచాయతీ ఆపరేటర్లు సమస్యలు పరిష్కరించాలని ఎం పి డి ఓ కి వినతి

ఈ పంచాయతీ ఆపరేటర్లు సమస్యలు పరిష్కరించాలని ఎం పి డి ఓ కి వినతి  న్యూస్ పవర్ , 23 సెప్టెంబర్ , ఇల్లంతకుంట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల పరిషత్ కార్యలయంలో పనిచేస్తూ ఈ పంచాయతీ ఆపరేట ర్లు ఎం పి డి ఓ మీర్జా కి తమ సమస్యలు పరిష్కరించాలని సమ్మె నోటీసు ఇచ్చారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాంకేతిక సమాచారం ఇంటర్నెట్ వ్యవస్త వినియోగించుకొని పంచాయితీ రాజ్ సమస్త గ్రామపంచాయతీ లని శక్తి వంతముగా తయారుచేసి పార దర్శ కతను జవాబు దారి తనాన్ని పెంపొందించడానికి ప్రభుత్వం ఈ పంచాయతీ అనే కార్యక్రమాన్ని రూపొందించింది ఇంటర్నెట్ ఆధారంగా గ్రామ పంచాయతీ లో ప్రజలకు అందిస్తున్న అన్ని రకాల సేవలను కంప్యూటరు నమోదు చేయుట కొరకు రాష్ట్రంలో ఈ పంచాయతీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది జిల్లాల్లో ఈ పంచాయతీ అప్లికేషన్ పర్యవేక్షణ చేయడానికి 2012-2013 సంత్సరలం లో జిల్లా పంచాయితీ స్థాయిలో ఈ పంచాయితీ కంప్యూటర్ ఆపరేటర్ల ను  రాష్ట్రప్రభుత్వం నియమించింది జిల్లా స్థాయిలో 32 మంది ఇలా 1619 మంది కలిపి ఒక్కో ఈ పంచాయితీ కంప్యూటర్ ఆపరేటర్లు ఒక్కొక్కరు 8 నుండి 10 గ్రామ పంచాయతీ పనులను చేస్తున్నాం రాష్ట్రప్రభుత్వ...

ఇల్లంతకుంట కోర్టు కానిస్టేబుల్ కు ప్రశంసా పత్రం

ఇల్లంతకుంట కోర్టు కానిస్టేబుల్ కు ప్రశంసా పత్రం  న్యూస్ పవర్ , 23 సెప్టెంబర్, ఇల్లంతకుంట: ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తించే కోర్టు కానిస్టేబుల్ చందు నాయక్ కు ప్రశంసా పత్రం వచ్చిందని ఇల్లంతకుంట ఎస్సై డి.సుధాకర్ తెలిపారు.  ఇల్లంతకుంట మండలం లోని ఎక్కువ కక్షి దారులను కోర్టులో హాజరు పరిచి ఇటీవల జరిగిన లోక్ అదాలత్ లో ఎక్కువ కేసులు పరిష్కారం అయ్యేలా చేసిన కోర్టు కానిస్టేబుల్ చందు నాయక్ కు ఈరోజు సిరిసిల్ల లో సిరిసిల్ల ఎస్పీ. అఖిల్ మహాజన్ ప్రశంసా పత్రం అందజేసినట్లు అయన తెలిపారు.

పరేడ్ తోనే క్రమశిక్షణ శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం

పరేడ్ తోనే క్రమశిక్షణ శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం __ ఎస్సై డి.సుధాకర్                                    న్యూస్ పవర్ , 23 సెప్టెంబర్ , ఇల్లంతకుంట : పోలీస్ శాఖలో  నిర్దేశించిన దాని ప్రకారం పరేడ్ నిర్వహించడం వల్ల, పరేడ్ లో పాల్గొనడం వల్ల క్రమశిక్షణ కలిగి ఉండడంతో పాటు మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వం లభిస్తుందని ఇల్లంతకుంట ఎస్సై డి.సుధాకర్ అన్నారు. పోలీస్ శాఖలో నిర్వహించే వీక్లీ పరెడ్ లో భాగంగా శనివారం  ఉదయం ఇల్లంతకుంట  పోలీస్ స్టేషన్ ఆవరణలో వీక్లీ పరేడ్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వీక్లీ పరేడ్లో పాల్గొన్న సిబ్బందిని ఉద్దేశించి ఎస్సై డి.సుధాకర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నిరంతరం వీక్లీ పరేడ్ కు హాజరుకావాలని తద్వారా క్రమశిక్షణ పెరగడంతో పాటు పోలీస్ శాఖలో నిత్యం జరుగుతున్న విషయాలని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. పోలీసుల యొక్క క్రమశిక్షణ పరేడ్ తోనే సాధ్యమవుతుందని ఈ క్రమశిక్షణ మూలంగానే సమాజంలో పోలీసులకు ప్రత్యేక గౌరవం, గుర్తింపు ఉంటుందని ఆయన అ...

తను చదువుకున్న పాఠశాలను చూసి చలించిన అభినవ శ్రీమంతుడు

తను చదువుకున్న పాఠశాలను చూసి చలించిన అభినవ శ్రీమంతుడు న్యూస్ పవర్ , 22 సెప్టెంబర్  , ఇల్లంతకుంట  అది తను చదువుకున్న పాఠశాల, తన కళ్ళల్లో నిత్యం ఏదో తెలియని బాధ, అందులో ప్రస్తుతం చదువుతున్న విద్యార్థుల కష్టాలను చూసి అందరికీ మెరుగైన విద్యా అందాలనే ఉద్దేశ్యంతో స్థానిక ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అధ్వర్యంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అరుకుటి మల్లేశం కి యాభై వేల రూపాయలను తన వంతు ఏదో చిన్న సహాయంగా అందించిన ఇల్లంతకుంట మండలంలోని జవహర్ పేట గ్రామానికి చెందిన యువ నాయకుడు అన్నాడి మహేందర్ రెడ్డి. తన లాగే మరింత మంది గ్రామాభివృద్ధికి పాటుపడాలని కోరారు. ఈ సందర్భంగా గ్రామస్తులు అన్నాడి మహేందర్ రెడ్డి ని అభినందించి, శాలువాతో సత్కరించారు.

పోలీస్ పహర మధ్యన రసమయి పర్యటన

పోలీస్  పహర మధ్యన రసమయి పర్యటన • అభివృధ్ది చేసి ఉంటే ముందస్తు అరెస్టు ఎందుకు • కాంగ్రెస్ నాయకులు అంటే అంత భయమెందుకు • రాజన్న సిరిసిల్ల నాయకుడు పసుల వెంకటి న్యూస్ పవర్ , 22 సెప్టెంబర్ , ఇల్లంతకుంట: ఇల్లంతకుంట మండల కేంద్రములో శాసనసభ్యుడు రసమయి బాలకిషన్  నిజంగా అభివృద్ది చేసి ఉంటే ఇల్లంతకుంట మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులను ముందస్తు అరెస్ట్  చేపించి వేరే మండలాల్లో తిప్పుతూ బోయినపల్లి పోలీస్ స్టేషన్ లో పెట్టి ఇబ్బందులు ఎందుకు పెడుతున్నారో రసమయి బాలకిషన్ చెప్పలని జిల్లా కాంగ్రెస్ నాయకుడు పసుల వెంకటి డిమాండ్ చేశారు. స్థానిక అధికారులు శాసనసభ్యుని మెప్పుకోసం ఇలా చేయడం ఎంతవరకు కారేక్ట్ అన్నారు. మీరు భారత రాజ్యంగం వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది బిఆర్ఎస్ నాయకుల్లుగా పనిచేయడం సరైనా పద్దతి కాదు ప్రజలకు రక్షణ కల్పించాల్సిన  మీరు ఇలా చేయడం సరికాదని అన్నారు , ఇలాంటివి పునరావృతం అయితే ప్రతిసారి రసమయిని అడ్డుకుంటామని తెలియాజేశారు. ఈ కార్యక్రంలో యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు అంతగిరి వినయ్ కుమార్ పట్టణ అధ్యక్షుడు మామడి నరేష్ మైనర్టీ అధ్యక్షుడు జమాల్ కిసాన్ సేల్ అధ్...

ఇల్లంతకుంట మండల కేంద్రంలో సీసీ రోడ్డు నిర్మాణం పనుల ప్రారంభం

ఇల్లంతకుంట మండల కేంద్రంలో సీసీ రోడ్డు నిర్మాణం పనుల ప్రారంభం న్యూస్ పవర్, 20 సెప్టెంబర్ , ఇల్లంతకుంట : ఇల్లంతకుంట మండల కేంద్రంలో గుంతల రోడ్డు ద్వారా ప్రజలు ఇబ్బందులు పడొద్దనే లక్ష్యంతో  మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్  మాట ఇచ్చి ఇచ్చిన మాటకు కట్టుబడి సీసీ రోడ్డు వేయిస్తున్నారని  జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సిద్ధం వేణు ఎంపీపీ వుట్కూరి వెంకటరమణ రెడ్డి అన్నారు  ఇల్లంతకుంట మండల కేంద్రంలో  ఎమ్మెల్యే రసమయి బాలకిషన్  ఆదేశాల మేరకు సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  ఇల్లంతకుంట మండల కేంద్రంలో సీసీ రోడ్డు నిర్మాణం వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కూనబోయిన భాగ్యలక్ష్మి బాలరాజు  ఎంపీటీసీ ఒగ్గు నర్సయ్య  పాక్స్ చైర్మన్ రోండ్ల తిరుపతి రెడ్డి  బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు నరసింహారెడ్డి  ఉపసర్పంచ్ సాదులు  పట్టణ శాఖ అధ్యక్షులు కునబోయిన రఘు మైనార్టీ అధ్యక్షులు ఎండి ఉస్మాన్ వార్డు సభ్యులు అనంతగిరి భాస్కర్కోఆప్షన్ సభ్యులు ...

గౌడ కులస్తుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుంది

గౌడ కులస్తుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుంది     •  వైస్ ఎం.పి.పి సుదగోని శ్రీనాథ్ గౌడ్ న్యూస్ పవర్, 20 సెప్టెంబర్ , ఇల్లంతకుంట : ఇల్లంతకుంట మండలం రహీంఖాన్ పేట గ్రామంలో పొట్టి తాటి విత్తనాలను సర్పంచ్ బిలవేని పర్శరాం మరియు గౌడ సంఘం సభ్యులతో  కలిసి నాటిన ఇల్లంతకుంట మండల వైస్ ఎం.పి.పి సుదగోని శ్రీనాథ్ గౌడ్ ఈ సందర్భంగా శ్రీనాథ్ గౌడ్ మాట్లాడుతూ ఈ పొట్టి తాటి విత్తనాలను తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్  తన స్వంత ఖర్చులతో ప్రత్యేకంగా బీహార్ రాష్ట్రం నుండి తెప్పించారు అని అన్నారు, కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో దాదాపు 50 వేల తాటి మొక్కలను పంచడం జరిగింది అని అన్నారు, ఈ తాటి చెట్లు ఐదు నుండి ఏడు సంవత్సరాల తక్కువ సమయంలోనే కల్లుని ఇస్తాయని అన్నారు, ఈ చెట్లు ఎత్తు తక్కువగా ఐదు నుండి పది ఫీట్లు మాత్రమే పెరుగుతాయని అన్నారు వీటి వల్ల గౌడ వృత్తి దారులు ప్రమాదాల నివారణకు ఇవి ఉపయోగపడుతుంది అని అన్నారు, గౌడ కులస్తుల కోసం. ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు, ప్రభుత్వం గౌడ వృత్తి దారులకు  ప్రమాద బీమా 5 లక్షలు ఇస్తుందని అన్నా...

పాడి రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేత

పాడి రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేత న్యూస్ పవర్ , 19 సెప్టెంబర్ , ఇల్లంతకుంట : రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట బి సి యు పరిధిలో పాడి రైతు కుటుంబాలకు పాడి రైతు బరోసా స్కీమ్ లో చేరిన రైతులు మరణించి వారి కుటుంబాలకు సోమారంపేట గ్రామానికి రైతు బోలుగం శ్రీనివాస్ సండివారి పల్లి గ్రామానికి చెందిన ఒగ్గు దేవవ్వకు పాడి రైతు బరోసా స్కీమ్ క్రింద 50000₹ రూపాయల చెక్కులను కరీంనగర్ డైరీ చైర్మన్ చల్మెడ రాజేశ్వర రావు బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేశారు ఎం సి సి అగ్రహారం పరిధిలో మొత్తం 32 మందికి చెక్కులను అందజేశారు ఈ సందర్భంగా ఛైర్మెన్ మాట్లాడుతూ కరీంనగర్ డైరీ ఆధ్వర్యంలో వివిధ సంక్షేమ పథకాలను అందిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో పాల ఉత్పత్తి దారుల సంస్థల అధ్యక్షులు మరియు పాడి రైతు లు అగ్రహారం మేనేజర్ రవీందర్ అసిస్టెంట్ మేనేజర్ రాజి రెడ్డి కామారెడ్డి మేనేజర్ మరియు రూట్ సూపర్వై జర్లు పాల్గొన్నారు.

ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి

ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి • నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు_ఎస్ఐ సుధాకర్ న్యూస్ పవర్, 17 సెప్టెంబర్ , ఇల్లంతకుంట : ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి అని నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇల్లంతకుంట ఎస్ఐ డి.సుధాకర్ తెలిపారు. ఆదివారం ఉదయం  మండలంలోని పెద్ద లింగపురం లో ఆటో డ్రైవర్ల తో సమావేశం నిర్వహించి, కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ఆటోలను రోడ్డలపై నిలుపరాదు అని, ప్రతి ఆటోడ్రైవర్ యూనిఫాం వేసుకోవాలి అని  డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి అనీ ఆటో పత్రాలు కలిగి ఉండాలి అని,  అనవసరమైన సౌండ్ సిస్టమ్ ఉండకూడదు అని, రంగ్ రూట్ లో ఆటోలను నడపరాదు అని, ఆటోలలో అధిక ప్యాసింజర్ లను ఎక్కించుకోవద్దు అని, ఆటో కు వెనుకవైపు ఓపెన్ చేసి ఉండరాదు అని, ఆటోలను ప్రమాదకరం గా నదపరాదు అని,  మైనర్ లు ఆటో డ్రైవింగ్ చేయరాదు అని అన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించబోమని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో పెద్ద లింగాపురం సర్పంచ్ జి.జితేందర్ గౌడ్, ఉపసర్పంచ్ కుమార్ యాదవ్,  ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్...

ఎమ్మెల్యేనీ మర్యాదపూర్వకంగా కలిసిన కందికట్కూరు గ్రామ గొల్ల కురుమలు

ఎమ్మెల్యేనీ మర్యాదపూర్వకంగా కలిసిన కందికట్కూరు గ్రామ గొల్ల కురుమలు     న్యూస్ పవర్ , 13 సెప్టెంబర్ , ఇల్లంతకుంట : మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చింతపల్లి వేణు రావు , గ్రామ సర్పంచ్ ముత్యం అమర్ గౌడ్  ఆధ్వర్యంలో కందికట్కూరు గ్రామ గొల్ల కురుమలు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది,లబ్ధిదారులకు రెండవ విడత గొర్ల పంపిణీ కందికట్కూర్ గ్రామంలో త్వరగా చేపట్టాలని కోరారు , వారితో పాటు జక్కుల శ్రీనివాస్, నక్క వెంకటి, ఏగుర్ల పరుశురాం, భూమల్ల ప్రశాంత్, గుంటి శ్రీనివాస్, మధు, బాలయ్య, ఎల్లయ్య, పోచమల్లు, బాల పరశురాం, కొమురయ్య మరియు గొల్ల కురుమ సభ్యులు పాల్గొన్నారు.

రోడ్డు బాగు చేయాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థుల ధర్నా

రోడ్డు బాగు చేయాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థుల ధర్నా • చినుకు పడితే వారం రోజులు అయినా తగ్గకుండా  మోకాళ్ళ లోతు నీళ్లు నిలువ  •బిక్క వాగు బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాక నిత్యం ప్రజలకు విద్యార్థులకు తీవ్ర ఇబ్బంది • ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ప్రహరీ గోడ లేక  దొంగలు పడి ఫర్నిచర్ ఇతర సామగ్రి ధ్వంసం • ఏబీవీపీ జిల్లా కన్వీనర్ అక్కేం నాగరాజు  న్యూస్ పవర్ , 13 సెప్టెంబర్ , ఇల్లంతకుంట :  ఏబీవీపీ  ఇల్లంతకుంట మండల శాఖ ఆధ్వర్యంలో రోడ్డు నిర్మాణం చేపట్టాలి అని ఏబీవీపీ నాయకులు ధర్నా నిర్వహించడం జరిగింది ఈ సందర్బంగా ఏబీవీపీ జిల్లా కన్వీనర్ అక్కేం నాగరాజు మాట్లాడుతూ స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల కు వెళ్లే ప్రధాన రోడ్డు విద్యార్థులు వెళ్లకుండా తీవ్ర ఇబ్బందిగా ఉంది చినుకు పడితే వారం రోజులు అయినా తగ్గకుండా దాదాపు మోకాళ్ళ లోతు నీళ్లు నిలువ ఉండి నిత్యం ప్రజలకు విద్యార్థులకు తీవ్ర ఇబ్బందిగా మారింది అలాగే అనంతారం బిక్క వాగు బ్రిడ్జి నిర్మాణం పూర్తి స్థాయిలో నిర్మిచ్చకపోవడంతో ప్రజలకు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాల కు ప్రహరీ ...

గొల్ల కుర్మల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయం

గొల్ల కుర్మల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయం న్యూస్ పవర్ , 11 సెప్టెంబర్ , ఇల్లంతకుంట : ఇల్లంతకుంట  మండలంలోని తాళ్లల్లపల్లె  గ్రామంలో గొల్ల, కురుమలకు 6 యునిట్లు ఆరపల్లె గ్రామంలో 19యునిట్లను ఎమ్మెల్యే రసమయి బాలకిషన్  చేతుల మీదుగ  గొర్రెలను పంపిణీ చేశారు,  ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ  సీఎం కేసీఆర్  గొల్ల కురుమల అభివృద్ధి కి ఎంతో కృషి చేస్తున్నారని,గత ప్రభుత్వాలు గొల్ల కురుమల సంక్షేమాన్ని మరిచాయని,ఆర్థికాభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతో   ముఖ్యమంత్రి కేసిఆర్  సబ్సిడీపై గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నారని అన్నారు.తెలంగాణ రాకముందు గొల్ల-కురుమల పరిస్థితి ఎలా ఉండేది, తెలంగాణ వచ్చిన తర్వాత ఎలా ఉందో ఒకసారి ఆలోచించాలని అని అన్నారు.తాతలనాటి కులవృత్తులు కూడా ఉంటేనే రాష్ట)o బాగుపడుతుందని అన్నారు. గొల్ల కురుమల సంక్షేమం కోసం పనిచేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎల్లవేళలా యాదవుల ఆశీర్వాదం ఉండాలి అని అన్నారు.ఆర్థికంగా నిలబెట్టిన సీఎం కేసీఆర్‌ గారికి గొల్ల కురమలు మద్దతు నిలవాలి అని అన్నారు, ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ సిద్...

అరెస్టులతో ఉద్యమాలు ఆపలేరు, ఆశ వర్కర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి*

*అరెస్టులతో ఉద్యమాలు ఆపలేరు, ఆశ వర్కర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి*  న్యూస్ పవర్ , 11 సెప్టెంబర్ , ఇల్లంతకుంట : తెలంగాణ రాష్ట్రoలో ఆశ వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలని  సోమవారం ఛలో హైదరబాద్ పిలుపులో భాగంగా మండలం నుంచి 42 మంది అశవర్కర్స్ బస్సులో వెళ్తున్న క్రమంలో మార్గ మధ్యలో అడ్డుకొని అరెస్ట్ చేసి ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ కి తరలించారు, ఈ సదర్భంగా మండల అధ్యక్ష, కార్యదర్శి సొల్లు శాంత, తడకపెల్లి అరుణ మాట్లాడుతూ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఆశాలకు ఇస్తున్న పారదర్శకాలను రూపాయలు రూ.18,000లకు పెంచి ఫిక్సిడ్ వేతనం నిర్ణయించాలి, అలాగే పారితోషకం లేని అదనపు పనులు ఆశాలతో చేయించకూడదు అన్నారు. టీబి స్పుటమ్ డబ్బాలను  ఆశలతో మోపించే పనిని రద్దు చేయాలి. టీబి లేప్రసి, కంటి వెలుగు తదితర పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి. లేప్రసి సర్వేలో వస్తున్న ఇబ్బందులను పరిష్కరించాలి, వాలంటీర్లను ఏర్పాటు చేయాలన్నారు. ఆశలకు పని భారం తగ్గించాలి ,జాబ్ చార్టును విడుదల చేయాలి. 2021 జులై నుండి డిసెంబర్ వరకు ఆరు నెలల పిఆర్సి ఎరియర్స్ వెంటనే చెల్లించాలి. కేంద్రం చెల్లించిన కరోనా రిస్క్ అలవెన్స్ న...

యాదవ సంఘం భవనాన్ని ప్రారంభించిన ఎంపిపి

యాదవ సంఘం భవనాన్ని ప్రారంభించిన ఎంపిపి    న్యూస్ పవర్ , 10 సెప్టెంబర్ , ఇల్లంతకుంట : ఇల్లంతకుంట మండలంలోని వెంకట్రావుపల్లె గ్రామంలో నూతనంగా నిర్మించిన యాదవ సంఘ భవనాన్ని ఎంపిపి  వుట్కూరి వెంకట రమణా రెడ్డి ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం యాదవులకు పెద్ద పీఠ వేస్తుందని, యాదవుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మంద సుశీల లింగం, ఉప- సర్పంచ్ బాలగౌడ్, యాదవ సంఘం గ్రామ అధ్యక్షుడు మురారి, ప్యాక్స్  డైరెక్టర్ నవీన్ రెడ్డి, తెరాస గ్రామ శాఖ అధ్యక్షులు తిరుపతి,మాజీ సర్పంచులు మమతయాదగిరి గౌడ్, రమేష్ యాదవ్, వార్డు సభ్యులు, యాదవ సంఘ సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సబ్సిడీ రుణాలు సద్వినియోగం చేసుకోవాలి

సబ్సిడీ రుణాలు  సద్వినియోగం చేసుకోవాలి  న్యూస్ పవర్, 9 సెప్టెంబర్ , ఇల్లంతకుంట : ఇల్లంతకుంట మండలం వంతడుపుల గ్రామంలో  సుదగోని స్వప్న శ్రీనివాస్ కి పీఎం ఎఫ్ఎమ్ఈ పథకం ద్వారా ఏర్పాటు చేసిన పిండి గిర్ని ని ఏపీఎం వాణిశ్రీ తో కలిసి  ఇల్లంతకుంట మండల వైస్ ఎం.పి.పి సుదగోని శ్రీనాథ్ గౌడ్ ప్రారంభించారు  ఈ సందర్భంగా శ్రీనాథ్ గౌడ్ మాట్లాడుతూ మహిళా సంఘాలు ఆర్థికంగా బలపడడం కోసం ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు  సబ్సిడీ అందిస్తుంది అని అన్నారు మహిళా సంఘాలు ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు  ఈ కార్యక్రమంలో సర్పంచ్ కట్ట వెంకటరెడ్డి , ఏపిఎం వాణిశ్రీ , వీవో అధ్యక్షురాలు మౌనిక, సిసి రాంచంద్రారెడ్డి, సదయ్య, వెంకటేశం ఓబీలు ,వివోఏ లు సుజాత, పద్మలత మరియు సంఘ సభ్యులు పాల్గొన్నారు.

సోషల్ మీడియాలో అనుచిత వాక్యాలు పోస్ట్ చేస్తే కఠినచర్యలు

సోషల్ మీడియాలో అనుచిత వాక్యాలు పోస్ట్ చేస్తే కఠినచర్యలు న్యూస్ పవర్ , 8 సెప్టెంబర్ , ఇల్లంతకుంట : సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసినా, ఒక్క వ్యక్తి యొక్క మనోభావాలు దెబ్బతిసేలా వ్యవహరిస్తూ వ్యక్తిగత విమర్శలు చేసినా అలాంటి వారి పై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని ఇల్లంతకుంట మండల ఎస్సై దాస సుధాకర్ హెచ్చరించారు.  ఎస్సై దాస సుధాకర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఒక వ్యక్తికి సంబంధించిన అంతర్గత వ్యవహారాలను సోషల్ మీడియాలో బహిర్గతం చేసినా, చట్ట విరుద్ధంగా కులాలు,మతాలు,పార్టీలు,వర్గాల మధ్య విభేదాలు,శత్రుత్వాలు సృష్టించేలా సోషల్ మీడియాలో ఎవరైనా పోస్టులు పెట్టినా,  పోస్టులు పెట్టిన వారితోపాటు ఆ గ్రూప్ అడ్మిన్ లపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఎవరైనా గ్రూపులలో పోస్టులు పెట్టేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి పెట్టాలని,అలాగే గ్రూప్ అడ్మిన్ లు ఆ గ్రూప్ పై పూర్తి నియంత్రణ కలిగి ఎలాంటి చట్ట వ్యతిరేక పోస్టులు పెట్టకుండా, శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా చూడాలని సూచించారు. చట్టాన్ని అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని   తెలిపారు.

వాణీనికేతన్ లో కృష్ణాష్టమి వేడుకలు

వాణీనికేతన్ లో కృష్ణాష్టమి వేడుకలు న్యూస్ పవర్ , 6 సెప్టెంబర్ , ఇల్లంతకుంట :  ఇల్లంతకుంటలోని వాణీనికేతన్ హైస్కూల్ లో కృష్ణాష్టమి వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. విద్యార్థులు కృష్ణులు, గోపికల వేషదారణతో ఆకట్టుకున్నారు. అనంతరం పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఉట్టిని కొట్టడానికి విద్యార్థులు పోటీపడ్డారు. కార్యక్రమంలో కరస్పాండెంట్ తూముకుంట శ్రీనివాస్ రెడ్డి, ప్రిన్సిపాల్ శ్రీనిధిలతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సీజనల్ వ్యాధులు రాకుండ జాగ్రత్తలు తీసుకోవాలి

సీజనల్ వ్యాధులు రాకుండ జాగ్రత్తలు తీసుకోవాలి న్యూస్ పవర్ , 4 సెప్టెంబర్ , ఇల్లంతకుంట : రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రములోనీ  ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి డాక్టర్ కట్టా రమేష్ మాట్లాడుతూ  మండలం లో అధికంగా వర్షాలు పడతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలనీ, ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలనీ ఎక్కువ నీరు నిలువ ఉండకుండా చూసుకోవాలనీ, సీజనల్ వ్యాధులు రాకుండ  ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలనీ,   రానున్న 2 నుంచి 4 వారాల్లో ప్రసవం జరిగే అవకాశం ఉన్న గర్భిణీలను వెంటనే జిల్లా ఆస్పత్రి కి షిఫ్ట్ చేస్తున్నామనీ, మండలంలో ఎవ్వరైనా పాము కాటు మరియు తేలు కాటు, అధిక జ్వరం, ఆస్తమా కి గురైతే వెంటేనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కి రావాలి అన్ని రకాల మందులు ,సూదులు, రక్త పరీక్షలు అందుబాటులొ ఉన్నాయని తెలిపారు.