మహిళలు స్వయం ఉపాధులు వినియోగించుకోవాలి
స్వశక్తి సంఘ సభ్యులు ఆర్థికంగా ఎదగడానికి బ్యాంకు లింకేజి ఋణం, స్త్రీనిధి, గ్రామ సంఘాల ద్వారా ఋణాలు పొందుతూ కిరాణం,హోటల్, పిండి గిర్ని,చికెన్ సెంటర్, గొర్రెలు, మేకలు, గేదెలు, లాంటి జీవనోపాదులు (ఎంటర్ ప్రైజెస్) ఏర్పాటు చేసుకుంటున్నారు. సెర్ప్ టీమ్ ఈ రకంగా నెలకొల్పబడిన ఎంటర్ ప్రైజెస్ ని ఈరోజు వెంకట్రావ్ పల్లి, ముస్కాన్ పేట గ్రామాలను సందర్శించి వెరిఫికేషన్ చేయడం జరిగింది. గ్రామాల్లో మహిళలు జీవనోపాదుల ద్వారా ఆదాయం పొందుతూ అభివృద్ధి చెందుతున్న విధానం పట్ల సంత్రృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వెరిఫికేషన్ అధికారి ఏడీఆర్డీఓ సుధీర్, సర్పంచ్ సుశీల, డీపీయం సుధారాణి, ఏపీయం లు శ్రీనివాస్, వాణిశ్రీ, సీసీలు రాజేశ్వరి, రాంచంద్రారెడ్డి,వెంకటేశం, సదయ్య పాల్గొన్నారు.
ప్రైవేట్ పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి: ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మంద అనిల్ కుమార్ డిమాండ్
ప్రైవేట్ పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి: ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మంద అనిల్ కుమార్ డిమాండ్ న్యూస్ పవర్, 12 మార్చి, ఇల్లంతకుంట విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఇల్లంతకుంటలోని శ్రీవాణి ప్రైవేట్ పాఠశాల యాజమాన్యంపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ (AISF) జిల్లా కార్యదర్శి మంద అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. గురువారం మండలంలోని వెంకటపూర్, తిప్పాపూర్ గ్రామ శివార్లలో సదరు పాఠశాలకు చెందిన బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల బస్సు అతివేగంతో పొలాల్లోకి దూసుకెళ్లిన ఘటనపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా మంద అనిల్ కుమార్ మాట్లాడుతూ పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంపై పలు కీలక విమర్శలు చేశారు సదరు బస్సు డ్రైవర్ గతంలోనూ పలుమార్లు అతివేగంగా వాహనాన్ని నడుపుతూ విద్యార్థుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టాడని, ఈ విషయాన్ని పాఠశాల యాజమాన్యం మరియు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోకపోవడం వల్లే నేడు ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించారు. పాఠశాల భవనానికి చుట్టూ రక్షణ గోడ (ఫెన్సింగ్) లేకపోవడం, తరగతి గదులు ఇరుకుగా ఉండటం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా...
Comments
Post a Comment