JSON Variables

సోషల్ మీడియాలో అనుచిత వాక్యాలు పోస్ట్ చేస్తే కఠినచర్యలు

సోషల్ మీడియాలో అనుచిత వాక్యాలు పోస్ట్ చేస్తే కఠినచర్యలు

న్యూస్ పవర్ , 8 సెప్టెంబర్ , ఇల్లంతకుంట :
సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసినా, ఒక్క వ్యక్తి యొక్క మనోభావాలు దెబ్బతిసేలా వ్యవహరిస్తూ వ్యక్తిగత విమర్శలు చేసినా అలాంటి వారి పై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని ఇల్లంతకుంట మండల ఎస్సై దాస సుధాకర్ హెచ్చరించారు. ఎస్సై దాస సుధాకర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఒక వ్యక్తికి సంబంధించిన అంతర్గత వ్యవహారాలను సోషల్ మీడియాలో బహిర్గతం చేసినా, చట్ట విరుద్ధంగా కులాలు,మతాలు,పార్టీలు,వర్గాల మధ్య విభేదాలు,శత్రుత్వాలు సృష్టించేలా సోషల్ మీడియాలో ఎవరైనా పోస్టులు పెట్టినా, పోస్టులు పెట్టిన వారితోపాటు ఆ గ్రూప్ అడ్మిన్ లపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఎవరైనా గ్రూపులలో పోస్టులు పెట్టేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి పెట్టాలని,అలాగే గ్రూప్ అడ్మిన్ లు ఆ గ్రూప్ పై పూర్తి నియంత్రణ కలిగి ఎలాంటి చట్ట వ్యతిరేక పోస్టులు పెట్టకుండా, శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా చూడాలని సూచించారు. చట్టాన్ని అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని 
 తెలిపారు.

Post a Comment

0 Comments