వాణినికేతన్ లో ముందస్తు ఉగాది వేడుకలు
ఇల్లంతకుంట: మండల కేంద్రంలోని వాణినికేతన్ హై స్కూల్ లో ముందస్తు ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. పాఠశాల ఆవరణలో బుధవారం ఉగాది పచ్చడిని తయారుచేసి విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ తూముకుంట శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఉగ అంటే నక్షత్ర గమనం, ఆది అంటే మొదలు అన్నారు. వసంత రుతువు ఆరంభం అవుతుండడంతో చెట్లు చిగురిస్తాయని పేర్కొన్నారు. షడ్రుచుల సమ్మిళితమైన ఉగాది పచ్చడి లాగా ప్రతి ఒక్కరి జీవితాలలో కష్టసుఖాలు ఉంటాయని వాటిని సమానంగా స్వీకరించాలన్నారు. గత సంవత్సరపు చేదు జ్ఞాపకాలను మర్చిపోయి కొత్త సంవత్సరంలో ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ తూముకుంట శ్రీనిధి, ఉపాధ్యాయులు సుమంగళి, శోభ, రేఖ, మహాలక్ష్మి, లావణ్య, సునంద, మౌనిక, కళ్యాణి, రేణుక, జలజ, శాంత, పద్మ, రేణుక, సునీత, స్వాతి, శ్రీనివాస్, రాజు, సంతోష్, తిరుపతి, రాజు, రమేష్ లతోపాటు విద్యార్థులు పాల్గొన్నారు

