వాణినికేతన్ హై స్కూల్ లో ఘనంగా మెహందీ ఫెస్ట్
న్యూస్ పవర్, 24 జూలై , ఇల్లంతకుంట:
విద్యార్థులలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలపట్ల అవగాహన పెంపొందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన
మెహందీ ఫెస్ట్ - 2026 ఘనంగా జరిగింది. వాణినికేతన్ హై స్కూల్ ఆవరణలో శుక్రవారం
చేతులకు గోరింటాకు మనసుకు సంతోషం అనే నినాదంతో
చేపట్టిన కార్యక్రమానికి విద్యార్థినీలు సంప్రదాయ దుస్తులలో హాజరై ఉత్సవంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ తూముకుంట శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ విద్యతో పాటు, కళలు, సంస్కృతి సాంప్రదాయాలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలనే లక్ష్యంతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థులలో సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు, పోటీత్వాన్ని పెంపొందించడానికి పాఠశాలలో తరచూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా విద్యార్థినీలు తమదైన శైలిలో వివిధ రీతుల గోరింటాకు డిజైన్లను రూపొందించి పోటీలో ఆసక్తిగా పాల్గొన్నారు.
కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీమతి తూముకుంట శ్రీనిధి, ఉపాధ్యాయినీలు సుమంగళి, శోభ, మహాలక్ష్మి, లావణ్య, సునంద, మౌనిక, కళ్యాణి, షమీమా, రేణుక, జలజ, శాంత, పద్మ,రేణుక,సునీత, స్వాతి, ఊష, ఉపాధ్యాయులు శ్రీనివాస్,రాజు, సంతోష్, రాజు, రమేష్, తిరుపతి తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.
