తెలంగాణ రైతు భరోసా కొత్త దరఖాస్తులు ప్రారంభం - పూర్తి వివరాలు!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 'రైతు భరోసా' పథకానికి సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది. యాసంగి (Rabi) 2025-26 సీజన్‌కు సంబంధించి కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి మరియు బ్యాంక్ వివరాలను అప్డేట్ చేసుకోవడానికి వ్యవసాయ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.ఎవరు దరఖాస్తు చేసుకోవాలి?
కొత్త రైతులు: 28/02/2026 తేదీ వరకు కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన రైతులు.
మిగిలిపోయిన రైతులు: గతంలో అర్హత ఉండి కూడా ఇప్పటివరకు రైతు భరోసా పొందని వారు.
బ్యాంక్ అప్డేట్: గతంలో వివరాలు తప్పుగా ఉండి, నగదు జమ కాని వారు తమ బ్యాంక్ వివరాలను ఇప్పుడే సరిచేసుకోవచ్చు.
కావలసిన పత్రాలు (Required Documents):
దరఖాస్తు చేసుకునే సమయంలో ఈ క్రింది పత్రాలను సిద్ధంగా ఉంచుకోండి:
రైతు భరోసా అప్లికేషన్ ఫారం.
పట్టాదార్ పాస్‌బుక్ (PPB) జిరాక్స్ కాపీ.
ఆధార్ కార్డు.
బ్యాంక్ పాస్‌బుక్ మొదటి పేజీ లేదా క్యాన్సిల్డ్ చెక్.
మొబైల్ నంబర్.
దరఖాస్తు ఎక్కడ చేయాలి? (Registration Center):
రైతులు తమ సమీపంలోని 'రైతు వేదిక' వద్ద ఉన్న వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) ని సంప్రదించి తమ దరఖాస్తులను సమర్పించవచ్చు.
చివరి తేదీ:
ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 25-03-2026. అర్హులైన రైతులు గడువులోపు నమోదు చేసుకుని ప్రభుత్వ ఆర్థిక సాయాన్ని పొందవచ్చు.

