JSON Variables

పరేడ్ తోనే క్రమశిక్షణ శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం


పరేడ్ తోనే క్రమశిక్షణ శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం
__ ఎస్సై డి.సుధాకర్                                
 
 న్యూస్ పవర్ , 23 సెప్టెంబర్ , ఇల్లంతకుంట :
పోలీస్ శాఖలో  నిర్దేశించిన దాని ప్రకారం పరేడ్ నిర్వహించడం వల్ల, పరేడ్ లో పాల్గొనడం వల్ల క్రమశిక్షణ కలిగి ఉండడంతో పాటు మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వం లభిస్తుందని ఇల్లంతకుంట ఎస్సై డి.సుధాకర్ అన్నారు. పోలీస్ శాఖలో నిర్వహించే వీక్లీ పరెడ్ లో భాగంగా శనివారం  ఉదయం ఇల్లంతకుంట
 పోలీస్ స్టేషన్ ఆవరణలో వీక్లీ పరేడ్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వీక్లీ పరేడ్లో పాల్గొన్న సిబ్బందిని ఉద్దేశించి ఎస్సై డి.సుధాకర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నిరంతరం వీక్లీ పరేడ్ కు హాజరుకావాలని తద్వారా క్రమశిక్షణ పెరగడంతో పాటు పోలీస్ శాఖలో నిత్యం జరుగుతున్న విషయాలని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. పోలీసుల యొక్క క్రమశిక్షణ పరేడ్ తోనే సాధ్యమవుతుందని ఈ క్రమశిక్షణ మూలంగానే సమాజంలో పోలీసులకు ప్రత్యేక గౌరవం, గుర్తింపు ఉంటుందని ఆయన అన్నారు. ఈ వీక్లీ పరేడ్ లో ఏఎస్సై మోతీరాo, హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ, కానిస్టేబుళ్లు మోహన్, అనిల్, రాజు, మధు, అనిల్,  హోంగార్డు బాపుచందర్  లు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments