JSON Variables

అరెస్టులతో ఉద్యమాలు ఆపలేరు, ఆశ వర్కర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి*



*అరెస్టులతో ఉద్యమాలు ఆపలేరు, ఆశ వర్కర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి*
 న్యూస్ పవర్ , 11 సెప్టెంబర్ , ఇల్లంతకుంట :
తెలంగాణ రాష్ట్రoలో ఆశ వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలని  సోమవారం ఛలో హైదరబాద్ పిలుపులో భాగంగా మండలం నుంచి 42 మంది అశవర్కర్స్ బస్సులో వెళ్తున్న క్రమంలో మార్గ మధ్యలో అడ్డుకొని అరెస్ట్ చేసి ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ కి తరలించారు,
ఈ సదర్భంగా మండల అధ్యక్ష, కార్యదర్శి సొల్లు శాంత, తడకపెల్లి అరుణ మాట్లాడుతూ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఆశాలకు ఇస్తున్న పారదర్శకాలను రూపాయలు రూ.18,000లకు పెంచి ఫిక్సిడ్ వేతనం నిర్ణయించాలి, అలాగే పారితోషకం లేని అదనపు పనులు ఆశాలతో చేయించకూడదు అన్నారు. టీబి స్పుటమ్ డబ్బాలను  ఆశలతో మోపించే పనిని రద్దు చేయాలి. టీబి లేప్రసి, కంటి వెలుగు తదితర పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి. లేప్రసి సర్వేలో వస్తున్న ఇబ్బందులను పరిష్కరించాలి, వాలంటీర్లను ఏర్పాటు చేయాలన్నారు. ఆశలకు పని భారం తగ్గించాలి ,జాబ్ చార్టును విడుదల చేయాలి. 2021 జులై నుండి డిసెంబర్ వరకు ఆరు నెలల పిఆర్సి ఎరియర్స్ వెంటనే చెల్లించాలి. కేంద్రం చెల్లించిన కరోనా రిస్క్ అలవెన్స్ నెలకు వెయ్యి చొప్పున 16 నెలల బకాయి డబ్బులు వెంటనే చెల్లించాలి. 32 రకాల రిజిష్టర్ ను వెంటనే ప్రింట్ చేసి ప్రభుత్వం సప్లై చేయాలి. క్వాలిటీతో కూడిన 5 సంవత్సరాలు పెండింగ్ యూనిఫామ్స్ వెంటనే ఇవ్వాలి. ఆశాలకు ప్రసూతి సెలవుల పైన సర్కులర్ ను వెంటనే జారీ చేయాలి. ఆశలకు సాధారణ బీమా, ప్రమాద బీమా సౌకర్యం కల్పించి హెల్త్ కార్డులు ఇవ్వాలి. జిల్లాలో ఆశాలకు తొలగించిన అన్ని రకాల పెన్షన్లు పునరుద్ధరించాలి. ఆశాలకు ఉచిత బస్సు పాసులు ఇవ్వలని డిమాండ్ చేశారు. లేని యడల ఉద్యమం ఉద్రిక్తం చేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె , ధర్నాలు చేసి ప్రభుత్వం గద్దె దించటం కోసం ముందుకు వెళ్తాం అన్నారు. గ్రామాలలో ఆశలకు సరి ఐన గుర్తింపు లేదు చిన్న చూపు చూస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా మా సమస్యను పరిష్కరించాలని హెచ్చరించారు. గతంలో చేసిన సమ్మె రాష్ట్రన్ని  కుదిపేసిన చరిత్ర ప్రభుత్వం మరిచిపోవద్దు అని గుర్తు చేశారు. మా సమస్యలపై అనునిత్యం మతో తోడుగా సిఐటియు  మా ఉద్యనికి ఊపిరి పోస్తుంది అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షురాలు కట్కురి కస్తూరి, మండల కమిటీ నాయకురాలు లక్ష్మి  ,సుజాత, ఏసుమని ,సంతోష, ఎల్లవ్వ, రేణుక ,మంజుల పాల్గొన్నారు.

Post a Comment

0 Comments