JSON Variables

గొల్ల కుర్మల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయం



గొల్ల కుర్మల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయం
న్యూస్ పవర్ , 11 సెప్టెంబర్ , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట  మండలంలోని తాళ్లల్లపల్లె  గ్రామంలో గొల్ల, కురుమలకు 6 యునిట్లు ఆరపల్లె గ్రామంలో 19యునిట్లను ఎమ్మెల్యే రసమయి బాలకిషన్  చేతుల మీదుగ  గొర్రెలను పంపిణీ చేశారు, 
ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ  సీఎం కేసీఆర్  గొల్ల కురుమల అభివృద్ధి కి ఎంతో కృషి చేస్తున్నారని,గత ప్రభుత్వాలు గొల్ల కురుమల సంక్షేమాన్ని మరిచాయని,ఆర్థికాభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతో   ముఖ్యమంత్రి కేసిఆర్  సబ్సిడీపై గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నారని అన్నారు.తెలంగాణ రాకముందు గొల్ల-కురుమల పరిస్థితి ఎలా ఉండేది, తెలంగాణ వచ్చిన తర్వాత ఎలా ఉందో ఒకసారి ఆలోచించాలని అని అన్నారు.తాతలనాటి కులవృత్తులు కూడా ఉంటేనే రాష్ట)o బాగుపడుతుందని అన్నారు. గొల్ల కురుమల సంక్షేమం కోసం పనిచేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎల్లవేళలా యాదవుల ఆశీర్వాదం ఉండాలి అని అన్నారు.ఆర్థికంగా నిలబెట్టిన సీఎం కేసీఆర్‌ గారికి గొల్ల కురమలు మద్దతు నిలవాలి అని అన్నారు, ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు ఎంపీటీసీ సభ్యుడు ఒగ్గు నరసయ్య యాదవ్ , రేపాక సర్పంచ్, గొల్ల కురుమ కులస్తులు , టిఆర్ఎస్ కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments