Skip to main content

పోలీస్ పహర మధ్యన రసమయి పర్యటన

పోలీస్  పహర మధ్యన రసమయి పర్యటన

• అభివృధ్ది చేసి ఉంటే ముందస్తు అరెస్టు ఎందుకు
• కాంగ్రెస్ నాయకులు అంటే అంత భయమెందుకు
• రాజన్న సిరిసిల్ల నాయకుడు పసుల వెంకటి

న్యూస్ పవర్ , 22 సెప్టెంబర్ , ఇల్లంతకుంట:
ఇల్లంతకుంట మండల కేంద్రములో శాసనసభ్యుడు రసమయి బాలకిషన్  నిజంగా అభివృద్ది చేసి ఉంటే ఇల్లంతకుంట మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులను ముందస్తు అరెస్ట్  చేపించి వేరే మండలాల్లో తిప్పుతూ బోయినపల్లి పోలీస్ స్టేషన్ లో పెట్టి ఇబ్బందులు ఎందుకు పెడుతున్నారో రసమయి బాలకిషన్ చెప్పలని జిల్లా కాంగ్రెస్ నాయకుడు పసుల వెంకటి డిమాండ్ చేశారు. స్థానిక అధికారులు శాసనసభ్యుని మెప్పుకోసం ఇలా చేయడం ఎంతవరకు కారేక్ట్ అన్నారు. మీరు భారత రాజ్యంగం వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది బిఆర్ఎస్ నాయకుల్లుగా పనిచేయడం సరైనా పద్దతి కాదు ప్రజలకు రక్షణ కల్పించాల్సిన  మీరు ఇలా చేయడం సరికాదని అన్నారు , ఇలాంటివి పునరావృతం అయితే ప్రతిసారి రసమయిని అడ్డుకుంటామని తెలియాజేశారు. ఈ కార్యక్రంలో యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు అంతగిరి వినయ్ కుమార్ పట్టణ అధ్యక్షుడు మామడి నరేష్ మైనర్టీ అధ్యక్షుడు జమాల్ కిసాన్ సేల్ అధ్యక్షుడు సురేందర్ రెడ్డి యస్ సి సేల్ అధ్యక్షుడు మచ్చ రాజేశం యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఎర్రోజు సంతోష్, ప్రధాన కార్యదర్శి కాసుపాక రమేష్, దూస రాజు కాంగ్రెస్ నాయకులు పాల్గోన్నారు.


Comments

Popular posts

ప్రైవేట్ పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి: ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మంద అనిల్ కుమార్ డిమాండ్

  ప్రైవేట్ పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి: ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మంద అనిల్ కుమార్ డిమాండ్ ​ న్యూస్ పవర్, 12 మార్చి, ఇల్లంతకుంట  విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఇల్లంతకుంటలోని శ్రీవాణి ప్రైవేట్ పాఠశాల యాజమాన్యంపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ (AISF) జిల్లా కార్యదర్శి మంద అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. గురువారం మండలంలోని వెంకటపూర్, తిప్పాపూర్ గ్రామ శివార్లలో సదరు పాఠశాలకు చెందిన బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల బస్సు అతివేగంతో పొలాల్లోకి దూసుకెళ్లిన ఘటనపై ఆయన తీవ్రంగా స్పందించారు. ​ఈ సందర్భంగా మంద అనిల్ కుమార్ మాట్లాడుతూ పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంపై పలు కీలక విమర్శలు చేశారు సదరు బస్సు డ్రైవర్ గతంలోనూ పలుమార్లు అతివేగంగా వాహనాన్ని నడుపుతూ విద్యార్థుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టాడని, ఈ విషయాన్ని పాఠశాల యాజమాన్యం మరియు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోకపోవడం వల్లే నేడు ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించారు. పాఠశాల భవనానికి చుట్టూ రక్షణ గోడ (ఫెన్సింగ్) లేకపోవడం, తరగతి గదులు ఇరుకుగా ఉండటం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా...

నెల రోజులే గడువు.. లేదంటే క్యాంపు ఆఫీస్ ముట్టడిస్తాం! ఎమ్మెల్యే కవ్వంపల్లికి రసమయి వార్నింగ్..

  నెల రోజులే గడువు.. లేదంటే క్యాంపు ఆఫీస్ ముట్టడిస్తాం! ఎమ్మెల్యే కవ్వంపల్లికి రసమయి  వార్నింగ్.. ఇల్లంతకుంట (న్యూస్ పవర్): మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తీరుపై మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆదివారం ఇల్లంతకుంటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే వ్యవహారశైలిని తప్పుబట్టారు.  34 రోజులుగా రైతులు రిలే దీక్షలు చేస్తున్నా ఎమ్మెల్యే స్పందించకపోవడం దారుణమని, పైగా దీక్ష చేస్తున్న రైతులను 'పిచ్చికుక్కలు' అనడం ఆయన అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. రైతులను అవమానించినందుకు ఎమ్మెల్యే వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.  ఎమ్మెల్యేకు కమీషన్లపై ఉన్న సోయి రైతుల సమస్యలపై లేదని, అసలు టీఎంసీ అంటే ఏమిటో, ఏ ప్రాజెక్టులో ఎన్ని నీళ్లు ఉన్నాయో కూడా తెలియని దుస్థితిలో ఎమ్మెల్యే ఉన్నారని రసమయి ఎద్దేవా చేశారు.  గత పదేళ్లలో కేసీఆర్ నాయకత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇల్లంతకుంట మండలంలోని వేలాది ఎకరాలకు సాగునీరు అందించామని గుర్తు చేశారు. అన్నపూర్ణ రిజర్వాయర్ పూర్తి చేసి ఎర్రటి ఎండల్లో కూడా నీళ్లిచ్చిన ఘనత బీఆర్ఎస్‌దేన...

రాజన్న సిరిసిల్ల జిల్లా మత్స్యకారులకు శుభవార్త: ఐస్‌బాక్స్ మోటార్ సైకిళ్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం!

  రాజన్న సిరిసిల్ల జిల్లా మత్స్యకారులకు శుభవార్త: ఐస్‌బాక్స్ మోటార్ సైకిళ్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం! రాజన్న సిరిసిల్ల: మత్స్యకారుల ఆర్థికాభివృద్ధిని పెంపొందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (PMMSY) కింద రాజన్న సిరిసిల్ల జిల్లాకు ఐస్‌బాక్స్‌తో కూడిన మోటార్ సైకిళ్లు మంజూరయ్యాయి. ఈ పథకం ద్వారా చేపల విక్రయానికి అవసరమైన రవాణా సౌకర్యాన్ని కల్పించి, మత్స్యకారుల ఆదాయాన్ని పెంచడమే ప్రధాన ఉద్దేశ్యం. జిల్లాకు కేటాయించిన యూనిట్ల వివరాలు: తెలంగాణ రాష్ట్రానికి మొత్తం 500 యూనిట్లు మంజూరు కాగా, రాజన్న సిరిసిల్ల జిల్లాకు 13 యూనిట్లు కేటాయించబడ్డాయి. వీటి విభజన ఈ క్రింది విధంగా ఉంది: సాధారణ వర్గం (General): 08 యూనిట్లు మహిళలు: 02 యూనిట్లు షెడ్యూల్డ్ కులాలు (SC): 02 యూనిట్లు షెడ్యూల్డ్ తెగలు (ST): 01 యూనిట్ మొత్తం: 13 యూనిట్లు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: అర్హత కలిగిన మత్స్యకారులు తమ దరఖాస్తులను పూర్తి పత్రాలతో సమర్పించాల్సి ఉంటుంది. జిల్లా స్థాయి కమిటీ (DLC) ఈ దరఖాస్తులను పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేస్తుంది. దరఖాస్తు గడువు: మార్చి 16, 2...