ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
• నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు_ఎస్ఐ సుధాకర్
న్యూస్ పవర్, 17 సెప్టెంబర్ , ఇల్లంతకుంట :
ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి అని నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇల్లంతకుంట ఎస్ఐ డి.సుధాకర్ తెలిపారు. ఆదివారం ఉదయం మండలంలోని పెద్ద లింగపురం లో ఆటో డ్రైవర్ల తో సమావేశం నిర్వహించి, కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
ఆటోలను రోడ్డలపై నిలుపరాదు అని, ప్రతి ఆటోడ్రైవర్ యూనిఫాం వేసుకోవాలి అని డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి అనీ ఆటో పత్రాలు కలిగి ఉండాలి అని,
అనవసరమైన సౌండ్ సిస్టమ్ ఉండకూడదు అని, రంగ్ రూట్ లో ఆటోలను నడపరాదు అని, ఆటోలలో అధిక ప్యాసింజర్ లను ఎక్కించుకోవద్దు అని, ఆటో కు వెనుకవైపు ఓపెన్ చేసి ఉండరాదు అని, ఆటోలను ప్రమాదకరం గా నదపరాదు అని,
మైనర్ లు ఆటో డ్రైవింగ్ చేయరాదు అని అన్నారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించబోమని ఆయన హెచ్చరించారు.
ఈ సమావేశంలో పెద్ద లింగాపురం సర్పంచ్ జి.జితేందర్ గౌడ్, ఉపసర్పంచ్ కుమార్ యాదవ్, ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ లు లక్ష్మీనారాయణ, జీవన్, మండలంలోని ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.
0 Comments