JSON Variables

పాడి రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేత

పాడి రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేత
న్యూస్ పవర్ , 19 సెప్టెంబర్ , ఇల్లంతకుంట :
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట బి సి యు పరిధిలో పాడి రైతు కుటుంబాలకు పాడి రైతు బరోసా స్కీమ్ లో చేరిన రైతులు మరణించి వారి కుటుంబాలకు సోమారంపేట గ్రామానికి రైతు బోలుగం శ్రీనివాస్ సండివారి పల్లి గ్రామానికి చెందిన ఒగ్గు దేవవ్వకు పాడి రైతు బరోసా స్కీమ్ క్రింద 50000₹ రూపాయల చెక్కులను కరీంనగర్ డైరీ చైర్మన్ చల్మెడ రాజేశ్వర రావు బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేశారు ఎం సి సి అగ్రహారం పరిధిలో మొత్తం 32 మందికి చెక్కులను అందజేశారు ఈ సందర్భంగా ఛైర్మెన్ మాట్లాడుతూ కరీంనగర్ డైరీ ఆధ్వర్యంలో వివిధ సంక్షేమ పథకాలను అందిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో పాల ఉత్పత్తి దారుల సంస్థల అధ్యక్షులు మరియు పాడి రైతు లు అగ్రహారం మేనేజర్ రవీందర్ అసిస్టెంట్ మేనేజర్ రాజి రెడ్డి కామారెడ్డి మేనేజర్ మరియు రూట్ సూపర్వై జర్లు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments