JSON Variables

రాష్ట్ర ప్రభుత్వం దళితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి

రాష్ట్ర ప్రభుత్వం దళితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి

• మండల దళిత మోర్చా ఆధ్వర్యంలో ధర్నా
• దళితబంధు అమలు కోసం లక్ష కోట్లు అయినా ఖర్చు చేస్తానన్న కేసీఆర్‌ హామీ ప్రకారం ఇవ్వడానికి ఎందుకు వెనుకాడుతున్నావ్
• దళితుల ఓట్లను పొందేందుకు కేసీఆర్ దళిత బంధు పేరుతో మోసం
• టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మద్దతులకే దళిత బంధిస్తున్నారని ఆరోపణ 
• బీజేపీదళిత మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుమ్మరి శంకర్ , రాష్ట్ర నాయకులు దరువు ఎల్లన్న

న్యూస్ పవర్ , రాజన్న సిరిసిల్ల జిల్లా :
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలని డిమాండ్ చేస్తూ మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండల కేంద్రంలో మండలంలో మండల దళిత మోర్చా ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దళిత మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుమ్మరి శంకర్ హాజరయ్యి దళితులపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితబంధు అమలు కోసం లక్ష కోట్లు అయినా ఖర్చు చేస్తానన్న కేసీఆర్‌ ఇచ్చిన హామీ ప్రకారం దళిత బంధు ఇవ్వడానికి ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నించారు. అనంతరం రాష్ట్ర నాయకుడు దరువు ఎల్లన్న మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలో  దళితుల ఓట్లను పొందేందుకు కేసీఆర్ దళిత బంధు పేరుతో మోసం చేస్తున్నాడన్నారు, నిజంగా దళిత ప్రజలపై చిత్త శుద్ధి ఉంటే సీఎం కేసీఆర్  దళితుల అభ్యున్నతి కోసం ఏమి చేశారో చెప్పాలన్నారు. కాగా ఇదే అదునుగా నిజమైన అర్హులకు కాకుండా తమ మద్దతు దారులకు, టీఆర్ఎస్ కార్యకర్తలకు వారి కుటుంబ సభ్యులకు మాత్రమే లబ్ది  చేకూరేలా నాయకులు  అవకతవకలు చేశారని ఆరోపించారు. దళితబంధును ఏకకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దరువు ఎల్లన్న, రాష్ట్ర నాయకులు సొల్లు అజయ్ వర్మ, మండల అధ్యక్షుడు నాగసముద్రాల సంతోష్, జిల్లా అధికార ప్రతినిధి కొత్త శ్రీనివాస్ రెడ్డి,బత్తిని స్వామి,మామిడి హరిష్,తిప్పారాపు శ్రవణ్, పుణ్ణి సంపత్, దేశెట్టి శ్రీనివాస్, అమ్ముల అశోక్,చెప్యాల గంగాధర్, పొన్నం కృష్ణ,మ్యాకల మల్లేశం, ముత్తక్క,గజ్జల శ్రీనివాస్,గైని శ్రీనివాస్,శ్రీహరి, కట్కూరి తిరుపతి, గౌరవేణి శ్రీకాంత్ మరియు వివిధ గ్రామాల నుండి భారీ సంఖ్యలో దళితులు మహిళలు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments