Skip to main content

Posts

Showing posts with the label BJP Ellanthakunta

ఘనంగా పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు

ఘనంగా  పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు    న్యూస్ పవర్, 25 సెప్టెంబర్, ఇల్లంతకుంట: ఇల్లంతకుంట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ (బిజెపి) మండల అధ్యక్షుడు  భూమల్ల అనిల్ కుమార్ ఆధ్వర్యంలో, బిజెపి పూర్వ సంస్థ అయిన భారతీయ జన సంఘ నాయకులు శ్రీ పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది  ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు  భూమల్ల అనిల్ కుమార్ మాట్లాడుతూ, పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ  జన సంఘ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పటికీ అతి సామాన్య, క్రమశిక్షణతో కూడిన జీవనాన్ని గడిపారని కొనియాడారు  ఆయన కార్యపద్ధతి స్ఫూర్తితో ఎందరో కార్యకర్తలు, నాయకులు తయారయ్యారని పేర్కొన్నారు . ఉన్నత విద్యను పూర్తి చేసిన తర్వాత, ఆయన దేశమాత సేవకై ప్రచారక్ గా పనిచేసి, ఆ తర్వాత జన సంఘంలో చేరారని గుర్తుచేశారు  నేటి భారతీయ జనతా పార్టీకి మార్గదర్శకంగా నిలుస్తున్న 'ఇంటిగ్రల్ హ్యూమనిజం' (ఏకాత్మ మానవతావాదం) మరియు 'అంత్యోదయ' వంటి సిద్ధాంతాలను వారు నిర్వచించారని, అవి నేటి సమాజానికి ఎంతో మేలు చేశాయని  అనిల్ కుమార్ అన్నారు . జాతీయ స్థాయి నాయకుడిగా...

సభ్యత్వ నమోదు పూర్తి చేయాలి

 సభ్యత్వ నమోదు పూర్తి చేయాలి   న్యూస్ పవర్ , 28 అక్టోబర్ , ఇల్లంతకుంట : సభ్యత్వ నమోదు కార్యక్రమం స్పెషల్ డ్రైవ్  సోమవారము రోజున వల్లంపట్ల ఓబులాపూర్ గ్రామాలలో మండల కన్వీనర్ దేశెట్టి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యదర్శి  మండల ఇంచార్జ్ కరివేద మహిపాల్ రెడ్డి  జిల్లా పరిశీలకులు ఏలేటి చంద్రారెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మైపాల్ రెడ్డి  మాట్లాడుతూ సభ్యత్వ నమోదు కార్యక్రమం చివరి దశకు వచ్చినది మిగిలిన రెండు రోజులు అన్ని బూతులలో 300 సభ్యతము కచ్చితంగా చేసి బిజెపి పార్టీ ప్రతిష్ట కు పాటుపడాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు అదేవిధంగా  రైతులు వరి కోతలు కోసి నెలరోజులైనా వడ్ల సెంటర్లలో వడ్లు ప్రభుత్వము కొన్న దాఖలాలు లేవు తొందరగా సెంటర్లలో కొనుగోలు చేయాలనీ లేనిచో మా పార్టీ తరఫున రైతులకు మద్దతుగా ధర్నా చేయడం జరుగుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు ఈ కార్యక్రమంలో బత్తిని స్వామి కొలనూరు ముత్తక్క చదవాల రవి బూత్ అధ్యక్షుడు రాజు శేఖర్ ప్రణయ్ ఆత్మకూరు రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ నాయకులకు ఓటు అడిగే హక్కు లేదు

కాంగ్రెస్ నాయకులకు ఓటు అడిగే హక్కు లేదు న్యూస్ పవర్ , 23 ఏప్రిల్ , ఇల్లంతకుంట : కాంగ్రెస్ నాయకులకు లోక్ సభ ఎన్నికల్లో ప్రజలను ఓట్లు అడిగే హక్కు లేదని బీజేపీ సీనియర్ నాయకుడు మ్యాకల మల్లేశం విమర్శించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మల్లేశం మాట్లాడుతు ఆరు గ్యారెంటీల పెరితో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయడంలో విఫలం అయ్యిందని అన్నారు. అలాగే ఇచ్చిన హామీలకే సరిగ్గ దిక్కులేదు కానీ ఆగస్టు 15 లోపు రైతులకు ఎలా రుణమాఫీ చేస్తారని ఏద్దేవా చేశారు. అలాగే కొనుగోలు కేంద్రాలలో వేగం పెంచి త్వరగా వరి పంటను తూకం వేయాలని, ప్రతిరోజు రైతులు మారుతున్న వాతావరణ సూచనలతో బిక్కు బిక్కు మంటూ గడుపుతున్నారని తెలిపారు. ఇప్పటికే సగం మంది రైతులు దళారులను నమ్మి పంటలను అమ్ముకున్నారని, ఇకనైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి సకాలంలో ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు త్వరగా డబ్బులు జమ చేయాలనీ విజ్ఞప్తి చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం దళితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి

రాష్ట్ర ప్రభుత్వం దళితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి • మండల దళిత మోర్చా ఆధ్వర్యంలో ధర్నా • దళితబంధు అమలు కోసం లక్ష కోట్లు అయినా ఖర్చు చేస్తానన్న కేసీఆర్‌ హామీ ప్రకారం ఇవ్వడానికి ఎందుకు వెనుకాడుతున్నావ్ • దళితుల ఓట్లను పొందేందుకు కేసీఆర్ దళిత బంధు పేరుతో మోసం • టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మద్దతులకే దళిత బంధిస్తున్నారని ఆరోపణ  • బీజేపీదళిత మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుమ్మరి శంకర్ , రాష్ట్ర నాయకులు దరువు ఎల్లన్న న్యూస్ పవర్ , రాజన్న సిరిసిల్ల జిల్లా : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలని డిమాండ్ చేస్తూ మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండల కేంద్రంలో మండలంలో మండల దళిత మోర్చా ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దళిత మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుమ్మరి శంకర్ హాజరయ్యి దళితులపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితబంధు అమలు కోసం లక్ష కోట్లు అయినా ఖర్చు చేస్తానన్న కేసీఆర్‌ ఇచ్చిన హామీ ప్రకారం దళిత బంధు ఇవ్వడానికి ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నించారు. అనంతరం రాష్ట్ర నాయకుడు దరువు ఎల్లన్న మాట్లా...

సంబరాలు చేసుకున్న బిజెపి శ్రేణులు

సంబరాలు చేసుకున్న బిజెపి శ్రేణులు న్యూస్ పవర్ , 30 జూలై , ఇల్లంతకుంట : ఇల్లంతకుంట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఇల్లంతకుంట మండల అధ్యక్షుడు నాగసముద్రాల సంతోష్  ఆధ్వర్యంలో  భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్ కుమార్  నియామకమైన సందర్భంగా పెద్ద ఎత్తున ఘనంగా సంబరాలు జరుపుకోవడం జరిగింది ఏ సందర్భంగా  పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి, స్వీట్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు నాగసముద్రాల సంతోష్  మాట్లాడుతూ బండి సంజయ్  నియామకంతో బిజిపి శ్రేణుల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. పార్టీకి క్రమశిక్షణ నిబద్ధతతో  పనిచేసే కార్యకర్తలకు సముచిత స్థానం ఉంటుంది అని బండి సంజయ్  నిరూపించారని వారి యొక్క మార్గదర్శకంలో  బిజెపి నాయకులను కార్యకర్తలను అందరం కూడా  వారి స్ఫూర్తితో పార్టీ యొక్క అభివృద్ధికి పాటుపడతామని తెలియజేశారు. సీనియర్ నాయకులు మేకల మల్లేశం, బత్తిని సాయి గౌడ్,మండల ప్రధాన కార్యదర్శి తిప్పారాపు శ్రావణ్,పట్టణ శాఖ అధ్యక్షుడు గంగ అనిల్,మండలాధికార ప్రతినిధి పున్ని రాజు, ఓబిసి జిల్లా...

మేరా బూత్ సబ్ సే మజ్బూత్ కార్యక్రమము

  మేరా బూత్ సబ్ సే మజ్బూత్ కార్యక్రమము న్యూస్ పవర్ , 27జూన్ , ఇల్లంతకుంట:  మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భూపాల్ లో బిజెపి కార్యకర్తలను ఉద్దేశించి మేరా బుత్ సబ్సే మద్బూత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ  ప్రసంగాన్ని   ఇల్లంతకుంట మండల కేంద్రంలో బిజెపి మండల అధ్యక్షుడు నాగ సముద్రాల సంతోష్ ఆధ్వర్యంలో టీవీ స్క్రీన్ ద్వారా వీక్షించడం జరిగింది, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దరువు ఎల్లన్న , మానకొండూర్ నియోజకవర్గం ఇంచార్జ్ గడ్డం నాగరాజు  హాజరై మాట్లాడుతూ నరేంద్ర మోడీ  ప్రసంగం బిజెపి కార్యకర్తల్లో నూతన ఉత్తేజాన్ని ఇచ్చిందని అన్నారు బూత్ స్థాయిలో కార్యకర్తలందరూ కష్టపడి అధికార లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు, ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు దేశెట్టి శ్రీనివాస్, మ్యాకలా మల్లేశం, పుణ్ణి రాజు,చింతలపల్లి రాజి రెడ్డి,వజ్జెపల్లి శ్రీకాంత్, రంగు రమేశ్,,చిమ్మనిగొట్టు శ్రీనివాస్ మరియి మహిళలు పాల్గొన్నారు.

మోడీ చిత్రపటానికి క్షీరాభిషేకం

మోడీ చిత్రపటానికి క్షీరాభిషేకం   న్యూస్ పవర్, 9 జూన్ , ఇల్లంతకుంట : పంటలకు కనీస మద్దతు ధర పెంపు,  మెడికల్ కాలేజీల కేటాయింపుపై హర్షం వ్యక్తం చేస్తూ బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. తదనంతరం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 13 మెడికల్‌ కళాశాలలను కేటాయించగా దీనిలో భాగంగా  కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలలో మెడికల్‌ కళాశాల మంజూరు చేయడం పట్ల బీజేపీ నాయకులు టాపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం మండల అధ్యక్షుడు నాగసముద్రాల సంతోష్  మాట్లాడుతూ... ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి పంట పెట్టుబడిపై 50 శాతం లాభం వచ్చేలా కనీస మద్దతు ధరను పెంచుతూ వస్తోందన్నారు. వరికి క్వింటాల్‌కు రూ.143 పెంచిందని.. ఈ నిర్ణయం వల్ల  రైతాంగానికి విశేష ప్రయోజనం చేకూరుతోందని వారు అభిప్రాయపడ్డారు. రైతులకు ఆర్థిక చేయూత అందించుటకు కిసాన్ క్రెడిట్ కార్డు, ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజన, ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన లాంటి అనేక సంక్షేమ పథకాలను అమలుపరుస్తున్న  మోడీ ప్రభుత్వాన్ని కొనియాడారు....

ఐకెపి వివోఎ ల నిరవధిక సమ్మె కు సంఘీభావం తెలియజేసిన గడ్డం నాగరాజు

ఐకెపి వివోఎ ల నిరవధిక సమ్మె కు సంఘీభావం తెలియజేసిన గడ్డం నాగరాజు న్యూస్ పవర్, 7 జూన్ , ఇల్లంతకుంట :  మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండల కేంద్రంలో  ఐకెపి వివోఎ ల నిరవధిక సమ్మె 30వ రోజు చేరుకున్న సందర్భంగా అట్టి నిరవధిక సమ్మెలో పాల్గొని  సంఘీభావం తెలియజేసిన భారతీయ జనతా పార్టీ మానకొండూరు నియోజకవర్గం ఇంచార్జ్ గడ్డం నాగరాజు , మండల అధ్యక్షుడు  నాగసముద్రాల సంతోష్ , బిజెపి నాయకులు.అనంతరం గడ్డం నాగరాజు  మాట్లాడుతూ అనంతరం ఆయన మాట్లాడుతూ2014 ఎన్నికలకు ముందు సీఎం కెసిఆర్ విఓఏ లకు 10, 000  వేతనం ఇస్తామని అన్నారని గుర్తు చేశారు. తెలంగాణ లో కాంట్రాక్టు అనే మాట వినపడవద్దు అని మాట్లాడిన కెసిఆర్ కి రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగస్తులు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. మహిళా సాధికారత అని గొప్పలు చెప్పుకొనే తిరిగే నాయకులకు ఈ మహిళలు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ఐకెపి విఓఏ ల సమస్యలు పరిష్కరించాలని , వివోఏ లను సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం 18,000 ఇవ్వాలని, 10 లక్షల సాధారణ బీమా, ఆరోగ్య బీమా కల్పిం...

మోడీ కోసం ప్రత్యేక పూజలు నిర్వహించిన మండల బీజేపీ నాయకులు

మోడీ కోసం  ప్రత్యేక పూజలు నిర్వహించిన మండల బీజేపీ నాయకులు  న్యూస్ పవర్ , 27 మే , ఇల్లంతకుంట : బిజెపి ఇల్లంతకుంట మండల అధ్యక్షులు నాగసముద్రాల సంతోష్  ఆధ్వర్యంలో  దేశ ప్రధాని నరేంద్ర మోడీ  ఆయురారోగ్యాలతో ఉండాలని జంగంరెడ్డి పల్లె గ్రామంలోని శ్రీ రామ లింగేశ్వర స్వామి దేవస్థానం లో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. పూజ అనంతరం నాగసముద్రాల సంతోష్  మాట్లాడుతూ దేశం యొక్క ఖ్యాతిని ప్రపంచ దేశాలకు విస్తరింపజేసి ప్రపంచ దేశాలు మన భారతదేశం వైపు చూసేలా చేసిన కారణజన్ముడు నరేంద్ర మోడీ  అని అన్నారు. మోడీ  వంటి గొప్ప పరిపాలకుడు ప్రధాని కావడం మన అదృష్టం అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందించి దేశాన్ని అభివృద్ధి వైపు నడిపించిన గొప్ప దార్శనికుడు నరేంద్ర మోడీ అన్నారు. నేడు ప్రపంచంలోనే విశ్వ గురువుగా భారతదేశాన్ని నిలిపిన వ్యక్తి నరేంద్ర మోడీ ని అది చూసి ఓర్వలేని కుహనా పార్టీలు మోడీ  పైన విషం కక్కే ప్రయత్నం చేస్తున్నాయని దీన్ని దేశ ప్రజలు అంతా కూడా గమనిస్తున్నారని. దేశంలో పార్టీలకు అతీతంగా మోడీ  యొక్క పాలనను అందరూ స్వాగతిస్తున్న...

మానకొండూర్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయడం ఖాయం

మానకొండూర్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయడం ఖాయం  న్యూస్ పవర్ , 25 మే  , రాజన్న సిరిసిల్ల: భారతీయ జనతా పార్టీ ఇల్లంతకుంట మండల అధ్యక్షుడు ఆధ్వర్యంలో మండల కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది, ఇట్టి సమావేశానికి భారతీయ జనతా పార్టీ దళిత మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కుమ్మరి శంకర్  హాజరైనారు.ఈ సందర్భంగా కుమ్మరి శంకర్  మాట్లాడుతూ గౌరవ దేశ ప్రధాని నరేంద్ర మోడీ  9 ఏండ్ల పాలనలో అన్ని రంగాలలో దేశం సుభిక్షితంగా సురక్షితంగా ముందుకు సాగుతుందని దేశ ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు అన్నీ అన్ని వర్గాల ప్రజలకు అందే విధంగా వ్యవహరిస్తూ ప్రపంచ దేశాలు సంక్షోభంలో కోరుకుపోయినా కూడా దేశ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పాలన అందించిన గొప్ప పరిపాలన దక్షకుడు నరేంద్ర మోడీ  అని కొనియాడారు. కేంద్ర ప్రభుత్వం నిధుల వాటా లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి ఏ ఏ కార్యక్రమాలు చేసిందో చెప్పాలి అని నిలదీశారు. మానకొండూర్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమని తెలిపారు. ప్రతి బిజెపి కార్యకర్త బిజెపి కేంద్ర ప్రభుత్వం పథకాల...

హిందూ ఎక్తా యాత్ర గోడ పత్రాలు ఆవిష్కరణ

హిందూ ఎక్తా యాత్ర గోడ పత్రాలు ఆవిష్కరణ జనం న్యూస్ , 10 మే , ఇల్లంతకుంట :  హనుమాన్ జన్మదినం పురస్కరించుకుని ప్రతి సంవత్సరం బండి సంజయ్ కుమార్  ఆధ్వర్యంలో  కరీనగరంలో నిర్వహిస్తున్న హిందూ ఏక్తా యాత్ర ర్యాలీ పోస్టర్ ఆవిష్కరణ చేసిన బీజేపీ నాయకులు నాగసముద్రాల సంతోష్, కొత్త శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి తిప్పారాపు శ్రవణ్,మైనారిటీ మోర్చా మండల అధ్యక్షులు ఫసివోద్దీన్, శక్తి కేంద్రం ఇంచార్జ్ దేశెట్టి శ్రీనివాస్,దళిత మోర్చా ఉపాధ్యక్షుడు మామిడి శేఖర్, చొప్పరి వంశీ,సాగర్,వంశీ , ఈ నెల 14వ తేదీన కరీనగరంలో లక్ష మందితో నిర్వహించనున్న  హిందూ ఏక్తా యాత్రలో ఇల్లంతకుంట మండలం నుండి పార్టీలకు అతీతంగా ప్రతి హైందవ సోదరులందరు పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాము. హిందూ ధర్మ రక్షణ కోసం పాటుపడే ప్రతి ఒక్కరు ఈ యాత్రలో పాల్గొని హిందూ సంఘటిత శక్తిని చాటుదామని కోరారు.

వడ్ల కొనుగోలు సెంటర్లలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలి

వడ్ల కొనుగోలు సెంటర్లలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలి    న్యూస్ పవర్ , 2 మే , ఇల్లంతకుంట : ఇల్లంతకుంట మండల కేంద్రంలోని ఫ్యాక్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న  వడ్ల కొనుగోలు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నాయకులు రైతులను కలిసి, రైతుల యొక్క బాధలను వారు అడిగి తెలుసుకున్నారు, తదనంతరం  బిజెపి మండల అధ్యక్షులు నాగసముద్రాల సంతోష్ మాట్లాడుతూ వడ్ల కొనుగోలు సెంటర్లలో కనీస మౌలిక  సదుపాయాలు కల్పించలేనటువంటి స్థితిలో ఉన్నదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు, ఇల్లంతకుంట మండల కేంద్రంలోని వడ్ల కొనుగోలు సెంటర్ తో సహా మండలంలో  నిర్వహిస్తున్న వడ్ల కొనుగోలు కేంద్రాల్లో మ్యాచర్ వచ్చినప్పటికీ కూడా తూకం నిర్వహణ చేయకపోవడంతో అకాల వర్షాలతో వడ్లు పూర్తిగా తడిసిపోయాయిని అన్నారు, తడిసిన వడ్లు మొలకెత్తడంతో రైతులు తీవ్ర ఆవేదనకు గురి అవుతున్నారు, రైతుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో రైతన్నలు తీవ్ర ఆవేదనకు గురు అవుతున్న  వారి ఓట్లతో గద్దె నెక్కిన పాలకులు  ఎమ్మెల్యే రసమయి బాలకిషన్  కానీ, మండల అధికార, ప్రజాప్రతినిధులు గాని రైతులకు ఏ విధమైన భరోసనిచ్చారు తెలపాలి అని ప్రశ్నిం...

జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మెకు సంఘీభావం తెలిపిన బిజెపి మండల నాయకులు

జూనియర్ పంచాయతీ కార్యదర్శుల  సమ్మెకు  సంఘీభావం తెలిపిన బిజెపి మండల నాయకులు   న్యూస్ పవర్ , 2 మే , ఇల్లంతకుంట : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ పంచాయతీ కార్యదర్శుల శాంతియుత నిరవాదిక సమ్మె లో భాగంగా ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఐదవ రోజు సమ్మెలో  పాల్గొని  సంఘీభావం తెలిపిన బిజెపి మండల నాయకులు  ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు నాగ సముద్రాల సంతోష్  మాట్లాడుతూ    తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న గ్రామపంచాయతీ జూనియర్‌ కార్యదర్శుల నాలుగు సంవత్సరాలుగా వెట్టి చాకిరి చేసి, వారిని విముక్తి చేసి తక్షణమే క్రమబద్ధీకరణ చేయాలని బీజేపీ పార్టీ మండల శాఖ ద్వార డిమాండ్ చేశారు,  ఈ కార్యక్రమంలో బిజెపి మండల ప్రధాన కార్యదర్శులు తిప్పారపు శ్రావణ్, సింగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, మండల ఉపాధ్యక్షుడు  కాట్నపల్లి రవీందర్ రెడ్డి, కిసాన్ మోచ మండల అధ్యక్షుడు ఇట్రెడ్డి లక్ష్మారెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు రోడ్ల మధుసూదన్ రెడ్డి,శక్తి కేంద్రం ఇన్చార్జులు దేశెట్టి శ్రీనివాస్, బద్దం ఎల్లారెడ్డి, లోన్కోజు చంద్రం, మేకల మల్లేశం, అధికార ప్రతినిధి పున్న...

బీజేపీ దళిత మోర్చా ఆధ్వర్యంలో తహశీల్దార్ కి వినతిపత్రం అందజేత

బీజేపీ దళిత మోర్చా ఆధ్వర్యంలో తహశీల్దార్ కి వినతిపత్రం అందజేత   న్యూస్ పవర్ , 29 ఏప్రిల్ , ఇల్లంతకుంట : రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో బీజేపీ మండల దళిత మోర్చా శాఖ ఆధ్వర్యంలో దళిత బంధు లబ్ధిదారుల నుండి 3 లక్షలు  లంచం తీసుకున్న ఎమ్మెల్యే పై చర్యలు తీసుకోవాలని కోరుతూ తహశీల్దార్ కి వినతిపత్రం అందజేశారు, ఈ సందర్భంగా దళిత మోర్చా మండల ఉపాధ్యక్షుడు మామిడి శేఖర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్  మాట్లాడుతూ దళిత బంధు లబ్ధిదారుల వద్ద నుండి లంచం తీసుకున్న ఎమ్మెల్యే చిట్టా తన దగ్గర ఉందని వ్యాఖ్యానించారు, ముఖ్యమంత్రి వద్ద ఆ అవినీతి ఎమ్మెల్యే ల పేర్లు ప్రభుత్వం వారిచే విడుదల చేపించి, అట్టి ఎమ్మెల్యే లను పదవి నుండి తొలగించి వారిపై ఎస్సి,ఎస్టీ అట్రాసిటీ చట్టం క్రింద కేసు నమోదు చేసి దళిత కుటుంబాలకు అన్యాయం చేసిన వారిపై  తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు నాగసముద్రాల సంతోష్, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కొత్త శ్రీనివాస్ రెడ్డి, నియోజకవర్గ కో కన్వీనర్ బత్తిని స్వామి, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు ఇట్టిరెడ్డి లక్ష్మారె...

ఛత్రపతి శివాజి మహారాజ్ 344 వ వర్ధంతి

ఛత్రపతి శివాజి మహారాజ్ 344 వ వర్ధంతి న్యూస్ పవర్ , 3 ఏప్రిల్ , ఇల్లంతకుంట : రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో శ్రీ ఛత్రపతి శివాజి మహారాజ్  344 వ వర్ధంతికి ఘనంగా నివాళులు అర్పించి భారత మరాఠ సామ్రాజ్యన్ని నిర్మించిన మహనీయునీ 50 సంవత్సరాల జీవిత కాలం దేశ ప్రజలకు స్ఫూర్తి దయాకమనీ కొనియాడుతూ, వారి ఆశయాలసాధనకై యువత కృషి చేయాలానీ బెండ్రం.తిరుపతి రెడ్డి, నియోజకవర్గ జాయింట్ కన్వీనర్ బత్తిని.స్వామి, జిల్లా బీజేపీ యువ మోర్చా ఉపాధ్యక్షులు బొల్లారం.ప్రసన్న, జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు గజ్జల.శ్రీనివాస్, మండల బీజేపీ ఉపాధ్యక్షులు బోయిని.రంజిత్, బీజేపీ నాయకులు చుక్క.రమేష్, కోమటిరెడ్డి.అనిల్, చల్లూరి. భాను, గడ్డమిది.వినయ్, బొంగోని. శ్రీనివాస్ తదితరులు పాలుగోన్నారు. ఈరోజు అన్ని ప్రధాన దిన పత్రిక చదవడానికి క్లిక్ చెయ్యండి 

వల్లంపట్ల శక్తి కేంద్రాలలో స్ట్రీట్ కార్నర్ సమావేశం

  వల్లంపట్ల శక్తి కేంద్రాలలో  స్ట్రీట్ కార్నర్ సమావేశం - తొమ్మిదెండ్ల పాలనాలో  కల్వకుంట్ల కుటుంబం లక్షల కోట్ల దోపిడీ  - 9 ఏండ్లలో పాలనలో నరేంద్ర మోదీ దేశాన్ని  ప్రపంచంలో  ప్రథమ స్థానం  - మండల బీజేపీ అధ్యక్షుడు బెంద్రం.తిరుపతిరెడ్డి న్యూస్ పవర్ , 23 ఫిబ్రవరి , ఇల్లంతకుంట : ఇల్లంతకుంట మండల  వల్లంపట్ల 260,261,262,263  బూత్ లలో స్ట్రీట్ కార్నర్ సమావేశంలో   నరేంద్ర మోదీ జీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం  ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ బెంద్రం.తిరుపతిరెడ్డి మండల బీజేపీ అధ్యక్షుడు మాట్లాడతూ తెలంగాణా రాష్టంలో తొమ్మిదెండ్ల పాలనాలో  కల్వకుంట్ల కుటుంబం లక్షల కోట్ల దోపిడీ చేసి ప్రజల్ని గోస పెడ్తున్నారన్నారు, కేంద్రంలో ఇదే 9 ఏండ్లలో పాలనలో నరేంద్ర మోదీ దేశాన్ని ప్రపంచంలో ప్రథమ స్థానంలో నిలిపరన్నారు, మన గ్రామాలలో  నిర్మించిన వైకుంఠ దామలకు డబ్బులు ఇచ్చింది బీజేపీ కేంద్ర ప్రభుత్వవేన్నారు, రైతువేదికల నిర్మాణనికి డబ్బులు ఇచ్చింది బీజేపీ కేంద్ర ప్రభుత్వమేన్నారు, డంపింగ్ యార్డ్స్ కు డబ్బులు ఇచ్చింది బీజేపీ కేంద్ర ప్రభు...