JSON Variables

మోడీ చిత్రపటానికి క్షీరాభిషేకం

మోడీ చిత్రపటానికి క్షీరాభిషేకం 
 న్యూస్ పవర్, 9 జూన్ , ఇల్లంతకుంట :
పంటలకు కనీస మద్దతు ధర పెంపు,  మెడికల్ కాలేజీల కేటాయింపుపై హర్షం వ్యక్తం చేస్తూ బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. తదనంతరం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 13 మెడికల్‌ కళాశాలలను కేటాయించగా దీనిలో భాగంగా  కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలలో మెడికల్‌ కళాశాల మంజూరు చేయడం పట్ల బీజేపీ నాయకులు టాపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం మండల అధ్యక్షుడు నాగసముద్రాల సంతోష్  మాట్లాడుతూ... ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి పంట పెట్టుబడిపై 50 శాతం లాభం వచ్చేలా కనీస మద్దతు ధరను పెంచుతూ వస్తోందన్నారు. వరికి క్వింటాల్‌కు రూ.143 పెంచిందని.. ఈ నిర్ణయం వల్ల  రైతాంగానికి విశేష ప్రయోజనం చేకూరుతోందని వారు అభిప్రాయపడ్డారు. రైతులకు ఆర్థిక చేయూత అందించుటకు కిసాన్ క్రెడిట్ కార్డు, ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజన, ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన లాంటి అనేక సంక్షేమ పథకాలను అమలుపరుస్తున్న  మోడీ ప్రభుత్వాన్ని కొనియాడారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రైస్ మిల్లర్ల తో కుమ్మక్కై తరుగు పేరట 10 కిలోల వరకు తొలిగిస్తూ ధాన్యం కొనుగోలు జాప్యం చేస్తూ రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల దృష్ట్యా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందని మరోసారి రుజువైందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు మ్యాకాల మల్లేశం,బీజేపీ మండల ఉపాధ్యక్షుడు భూమల్ల అనిల్, ప్రధాన కార్యదర్శి తిప్పారపు శ్రవణ్,  కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు ఇట్టి రెడ్డి లక్ష్మారెడ్డి,  కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు రొండ్ల మధుసూదన్ రెడ్డి, దళిత మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మామిడి హరీష్, యువ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు బొల్లారం ప్రసన్న, మహిళ మోర్చా మండల అధ్యక్షురాలు పిట్టల అశ్విని, మహిళ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి కొలనూరు ముత్తక్క, యువ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి పల్లె సాయి ప్రసాద్ రెడ్డి, శక్తి కేంద్రాల ఇంచార్జి పొన్నం కృష్ణ, లొంకోజు చంద్రం, సీనియర్ నాయకులు బత్తిని సాయి గౌడ్, చింతలపెల్లి రాజిరెడ్డి, చిమ్మనిగొట్టు శ్రీనివాస్, కట్కూరి తిరుపతి, పారిపెల్లి రాంరెడ్డి లు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments